Home Cinema Upasana : ఉపాసన తన పుట్టబోయే బిడ్డ కోసం రక్తంతో అలాంటి పని చేస్తుందట!

Upasana : ఉపాసన తన పుట్టబోయే బిడ్డ కోసం రక్తంతో అలాంటి పని చేస్తుందట!

upasana-is-planning-to-cord-blood-in-stem-cell-banking-for-her-baby

Upasana : మెగా కుటుంబంలో బుల్లి వారసుడు లేక వారసురాల కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని పదేళ్లయిన తర్వాత.. ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నారు. ఈ ఆనందం వాళ్ళ కుటుంబంలో చాలా ఎక్కువగా ఉంది. చాలా ప్లాన్డ్ గా అన్ని ( Upasana planning for her baby ) రకాలుగా రెడీ అయిన తర్వాత.. బిడ్డలను కనడానికి ప్రిపేర్ అయ్యారు. అయితే ఇక ఉపాసన డెలివరీ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ఆమెను పుట్టింటి వారు, అత్తింటి వారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ అయితే ఎంత బిజీగా ఉన్నా.. భార్యకి వీలైనంత టైం తను ఇస్తున్నాడు.

upasana-is-planning-to-cord-blood-in-stem-cell-banking-for-her-baby

ఉపాసన డెలివరీ వేరే దేశం తీసుకెళ్లి చేస్తారని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ.. ఉపాసన డెలివరీ అపోలోనే చేస్తారని.. ప్రపంచంలో బెస్ట్ గైనకాలజిస్ట్స్ ని ఇక్కడికే రప్పించి.. ఆమెకు డెలివరీ చేసే ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఉపాసనని ఒక మహారాణిగా ట్రీట్ చేసి.. ఆమెకు డెలివరీ చేయాలని ఆమె పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ( Upasana planning for her baby ) అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భర్తగా రామ్ చరణ్ ఆమెతో ప్రతి నిమిషం తోడుగా, నీడగా ఉంటూ భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళినప్పుడు కూడా భార్య చేతిని భద్రంగా పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళుతున్న రామ్ చరణ్ ఫోటో చూసి.. అభిమానులు ఎంతగానో పొంగిపోయారు.

See also  King Nagarjuna: మన్మథునిగా పేరున్న నాగార్జున ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ కానీ ఆమెను చూస్తే భయపడేవాడట ఎందుకు.?

upasana-is-planning-to-cord-blood-in-stem-cell-banking-for-her-baby

అలాగే ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందరూ ఆమె బేబీ బంప్ సరిగ్గా కనిపించడం లేదని చెప్పినా కూడా.. అంటే ఆమె సరిగ్గా తినడం లేదని బేబీ వెయిట్ పెరగడం లేదని కామెంట్స్ చేస్తే.. దానికి కూడా చక్కటి సమాధానం వచ్చింది. నేను బేబీకి ( Upasana planning for her baby ) ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తీసుకుంటున్నాను తప్ప నా వెయిట్ పెరిగే ఫుడ్ నేను తీసుకోవడం లేదు అని చెప్పింది. దీనితో బిడ్డ మీద ఉపాసనకు ఎంత జాగ్రత్త ఉంది అనేది అర్థమవుతుంది. ఉపాసనకి బేబీ షవర్ ఫంక్షన్స్ కూడా ఇప్పటికీ రెండుసార్లు చేశారు. అలాగే ఉపాసన డెలివరీకి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఇక ఉపాసన ఆనందంగా ఉంచడానికి రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు.

See also  Danush: 150 కోట్లు పెట్టి ఆమె కోసమే ఇల్లు కట్టించాడు ధనుష్ కానీ...

upasana-is-planning-to-cord-blood-in-stem-cell-banking-for-her-baby

ఇప్పుడు ఉపాసన తన బిడ్డ కోసం ఒక వినూత్నమై నిర్ణయం తీసుకుందట. ఈ పని మన తెలుగు వాళ్లకి పెద్దగా తెలియదు కూడా.. బహుశా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మాత్రమే వాళ్ళు బిడ్డల కోసం ఇలాంటి పనిచేస్తారనుకుంటా.. ఉపాసన తన పుట్టబోయే బిడ్డ కోసం కార్డు బ్లడ్ సేకరించి దాన్ని దాయాలని డిసైడ్ అయిందంట. కార్డు బ్లడ్ అంటే బిడ్డ పుట్టేటప్పుడు మాయ బొడ్డులో మిగిలిన రక్తం. దీన్ని జాగ్రత్తగా సేకరించి భద్రపరుస్తారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇదే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు ఎప్పుడైనా ఏమైనా అనారోగ్యం వస్తే.. దానితో ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు చేసుకునే పని అని అంటున్నారు. ఉపాసన కూడా అలా తన బిడ్డ మాయా బొడ్డులో రక్తంలో మిగిలిన రక్తాన్ని భద్ర పరుస్తానని చెప్పింది. ఇందుకోసం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానాన్ని ఎన్నుకున్నానని ఉపాసన స్వయంగా చెప్పింది.