ఇంట్లో గీజర్ వాడేవాళ్ళు ఈ పనులు చేయకండి ప్రాణాలకే ముప్పు.
Geyser: కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ చాలా అబివృద్ది చెందుతుంది.
ప్రతీ పనికి కరెంటుతో నడిచే వస్తువులనే వాడుతున్నాము ఉదయాన్నే స్నానం చేసే దగ్గర నుండి అనేక రకాల ఉపయోగాలకు ఎలక్ర్టానిక్ సంబంధిత పరికరాలే వాడుతున్నాము.
ఉదయం లేచి స్నానం చేయాలంటే అది చలికాలంలో ఐతే వేడి నీళ్ళతోనే, చల్ల నీటితో జలుబు చేసి జ్వరం వస్తూ ఉంటుంది. చలికాలం ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేయలనుకుంటారు.
అయితే ఒక్కప్పుడు కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు మరిగించుకునేవారు, ఆ తర్వాత వాటర్ హీటర్లు వచ్చాయి.
ప్రస్తుతం మాత్రం గీజర్ లు ప్రతీ ఒక్కరి బాత్రూమ్లో అమర్చుకుంటున్నారు. ఐతే గీజర్ ఒక ఎలక్ర్టానిక్ పరికరం. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
కొన్ని సందర్భాలలో మనుషుల ప్రాణాలే పోయాయి. కాబట్టి గీజర్ విషయంలో కొన్ని జాగర్తలు పాటించాలి. అవేమిటో ఇప్పుడు చూద్దామా.
గీజర్ ఆన్ చేసిన తర్వాత చాలా మంది ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు దీనివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి గీజర్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే అలారం పెట్టుకుని ఆఫ్ చేయండి.
గీజర్ హీటింగ్ కు మించి ఎక్కువ సమయం ఆన్ లో ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సమయానికి ఆఫ్ చేయాలి.
ఎవరు పడితే వాళ్ళు గీజర్లను అమర్చకూడదు, నిపుణులైన ఎలక్ర్టీషియన్స్ సమక్షంలోనే అమర్చాలి. లేనిచో కనెక్షన్లో ఇవ్వడంలో తేడాలు వచ్చి తప్పులు చేసే అవకాశముంది.
ఇలా తప్పులుగా కనెక్షన్లు అమర్చితే షాక్ కు గురయ్యే అవకాశాలెక్కువ. ఖచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యామ్ అమర్చడం ముఖ్యం ఎందుకుంటే.
గీజర్ లో బ్యూటెన్, ప్రోపెన్ వాయువులు కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి కాపట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం.
గీజర్ పాడవుతే మనకేదో తెలిసినట్టు గెలకవద్దు రిపేర్ చేసేవాళ్ళను పిలవాలి. అది సురక్షితం.