Home Cinema First Hit Movie: మొదటి సినిమాతో హిట్టు కొట్టి కనిపించకుండా పోయిన హీరోయిన్లు వీళ్లే…

First Hit Movie: మొదటి సినిమాతో హిట్టు కొట్టి కనిపించకుండా పోయిన హీరోయిన్లు వీళ్లే…

First Hit Movie:

కొంతమంది హీరోయిన్లకు చాలా సినిమాలు చేస్తే కానీ మంచి గుర్తింపనేది రాదు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదటి సినిమాతోనే మంచి హిట్ కొడతారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే మాత్రం మొదటి సినిమాతో ఒక మంచి హిట్ అందుకోవటం మాత్రం ఆ హీరోయిన్లకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది అనే దాంట్లో సందేహం లేదు.

మరి ఇలాంటి తొలి సక్సెస్ ని అందుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందామాం.

See also  Mega Family : మెగా ఫామిలీ లో ఇన్ని విడాకులకు కారణం అదేనట.. ఇక నెక్స్ట్ ఆమె సంగతి?

షామిలి: చిన్నతనం నుండే బాలనటిగా మంచి గుర్తింపు పొందిన తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మళ్ళీ సినిమాలలో కనిపించలేదు.

కార్తీక: రాధా కూతురుగా జోష్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన కార్తీక ఆ తర్వాత దమ్ము, రంగం సినిమాలు చేసిన తర్వాత టీవి రంగానికి పరిమితమైపోయింది.

సియా గౌతమ్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ సరసన నేనింతే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వా వేదం సినిమాలో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయింది.

See also  Popular Actress: బాబోయ్ ఇంత మంది ఉన్నారేంట్రా.? పెళ్ళికి ముందే తల్లయిన స్టార్ హీరోయిన్లు..

నేహ శర్మ: రామ్ చరణ్ మొదటి సినిమాలో నేహ శర్మకు మొదటి సినిమా మంచి హిట్ సంపాదించినప్పటికీ ఆ తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ నిలబెట్టుకోలేకపోయింది.

గౌరీ ముంజల్: అల్లు అర్జున్ తో బన్ని సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు.

మీరా చోప్రా: పవన్ కళ్యాన్ తో బంగారం సినిమాలో చేసినప్పటికీ ఆ సినిమా పరాజయంతో ఆ తర్వాత ఆఫర్లు లేక తనని పక్కకు పెట్టేసారు.

ఇంకా వీళ్ళే కాక, అనురాధ మెహత, భాను శ్రీ మెహ్ర, అన్షు, రిచా వంటి మొదలైన హీరోయిన్లు మొదటి సినిమాలతో మళ్ళీ కనిపించకుండా కనుమరుగైపోయారు. దీంతో చేసేది ఏం లేక చిత్ర పరిశ్రమకు దూరమైపోయారు.