Home Cinema Suma : సుమ చావు భయంతో వాళ్లకు ఆ సీక్రెట్ చెప్పేసిందా?

Suma : సుమ చావు భయంతో వాళ్లకు ఆ సీక్రెట్ చెప్పేసిందా?

suma-sensational-comments-about-her-death

Suma : ప్రతి మనిషి తన జీవితంలో ఏం సాధించాలని అనుకుంటాడో అది ఎంతవరకు సాధించగలడో ఎవరికీ తెలియదు. ఎక్కడో ఎవ్వరో కొందరు మాత్రమే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సక్రమంగా సాధించగలరు.అలాంటి ( Suma about her death ) వారిలో సుమ కూడా ఒకర్తి. సినిమా రంగంలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలని వచ్చిన సుమ సినిమాల్లో తనకి కలిసి రాకపోతే.. ఏ రూపంగా కూడా కృంగిపోకుండా.. తన దగ్గర ఏం ట్యాలెంట్ ఉందో తానే తెలుసుకొని.. దానిపరంగానే ముందుకు వెళుతూ.. ఈరోజు ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన యాంకర్ గా ఆమె నిలబడింది.

Suma-after-death

సినిమా ఇండస్ట్రీలో పెద్దపెద్ద వేడుకలు జరగాలంటే.. సుమ డేట్స్ చూసుకొని దాన్నిబట్టి ఆ వేడుక డేట్ ని ఫిక్స్ చేసుకునే సందర్భాలు ఇప్పటికీ అనేకం ఉన్నాయి. ఆమె వయసు పెరుగుతున్నా కూడా.. అందంలో గాని, ఆమె కంఠంలో గాని ( Suma about her death ) ఎటువంటి మార్పు రాలేదు. మాట తీరు, సమయస్ఫూర్తి, స్పాంజీనియస్ గా ఆమె మాట్లాడే మాటలు నిజంగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆమె యాంకరింగ్ చేస్తూ ఉంటే.. ఎవరిని ఆమె సరదాగా ఏమన్నా, టీజ్ చేస్తున్నా , కార్నర్ చేస్తున్నా కూడా అది నిజంగా గొప్ప ఆనందంగానే ఉంటుంది. ఎవరిని ఒప్పించకుండా అంత అద్భుతంగా ఆమె యాంకరింగ్ చేయగలదు.

See also  Taraka Ratna: బయట పడ్డ అసలు నిజాలు.. తారకరత్న ని వాళ్ళు అంత దారుణంగా టార్చెర్ పెట్టారా?

Suma-sensational-comments

కెరీర్ పరంగా సుమ ( Suma ) ఎంత గొప్పగా సక్సెస్ అయిందో.. ఇక తన పర్సనల్ లైఫ్ లో కూడా ఆమె అంతే గొప్పగా సక్సెస్ అయింది. రాజీవ్ కనకాలకి ఉత్తమ ఇల్లాలుగా ఉంటూ ఎంతో చక్కగా పిల్లల్ని పెంచుతూ ఆమె తన భర్తకిచ్చే మర్యాదగాని పిల్లలను పెంచుకునే తీరుగాని.. అంత బిజీగా ఉండే ఒక మహిళ కుటుంబాన్ని కూడా అంత తీర్చిదిద్దుకోవడం నిజంగా తెలుగుజాతి ఆడవాళ్లు గర్వించే విధంగా ఉంటుంది. అయితే సుమ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతోమంది ఆడవాళ్లు భర్తలు చనిపోయిన తర్వాత కనీస డబ్బులు లేక పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు.

See also  NagaChaitanya Reacts: మొదటి సారి డివోర్స్ గురించి రియాక్ట్ అయిన నాగచైతన్య..సమంత చాలా మంచి మనిషి..

Suma-after-death-comments

కొందరు ఆడవాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా, ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేకుండా కష్టాలు పడుతూ బతుకుతున్నారు. నా పిల్లలకు మాత్రం నేను కుటుంబంలో అన్ని విషయాలలో చెప్తాను. ముఖ్యంగా నేను చనిపోయిన వెంటనే ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి.. కుటుంబాన్ని ఎలా సేఫ్ చేసుకోవాలి అన్ని ముందుగానే చెప్పి ఉంచాను. వాళ్ళు ఎందుకు ఇలాంటి మాటలు చెప్తావు అని అన్నా కూడా.. లేదు ఏ క్షణం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. నేను చనిపోయిన వెంటనే మీకు ఏదీ కూడా తెలీదు అని ఉండకూడదు. అన్నీ తెలుసుకొని, అన్ని జాగ్రత్తగా చూసుకొని కుటుంబాన్ని సంరక్షించుకోవాలని ముందుగానే చెప్పి ఉంచుతున్నాను అని సుమ చెప్పిన మాటలకు.. అభిమానులు ఆమె జాగ్రత్తకు ఆనందించినా.. ఆమె చావును తలంచడం వాళ్లకు నచ్చలేదు.