Home Cinema Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన...

Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన శ్యామలా దేవి..

shyamala-devi-revealed-prabhas-marriage-date-and-the-bride-details

Prabhas Marriage : డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతున్న ప్రభాస్ సినిమా గురించి ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి ( Prabhas marriage date and the bride details ) లాంటి సంచలనాత్మకమైన సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లోకి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రాలేదని ఆయన అభిమానులు చాలా కొరతగా బాధగా ఉన్నారు. అయినా కూడా ఎక్కడ హోప్స్ ని వదులుకోకుండా ప్రభాస్ ప్రతి సినిమాని కూడా హిట్ అవ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Prabhas-marriage-shyamala-devi-revealed

యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా రూపుదిద్దుకుంటున్న సలార్ సినిమా మాత్రం ఈసారి ఆశల్ని అడియాసలు చేయకూడదని.. కచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ( Prabhas marriage date and the bride details ) ఉంటే ఇక ప్రభాస్ విషయంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది, ఆయన సినిమాలు హిట్టు ఫ్లాప్ గురించి కాదు గాని, పెళ్లెప్పుడు చేసుకుంటాడా అనే విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ప్రభాస్ పేరు సంపాదించుకున్నాడు కాబట్టి మా హీరో ఎప్పుడు ఆ టైటిల్ నుంచి బయట పడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

See also  Jr NTR : నువ్వంటే నాకు ఇష్టమే గాని.. భరించడమే చాలా కష్టం అంటున్న జూనియర్ ఎన్టీఆర్..

Prabhas-marriage-shyamala-devi-date-bride

ఈ క్రమంలోనే ప్రభాస్ ఒకసారి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో తిరుపతిలో జరిగిన ఈ వేడుకలో నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటాను మీకు చెప్పే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ ( Prabhas marriage date and the bride details ) మళ్ళీ పెళ్లి గురించి మాట ఎత్తలేదు. అయితే పెళ్లి ఎక్కడ చేసుకుంటాడో ప్లేస్ చెప్పిన ప్రభాస్.. మిగిలిన డీటెయిల్స్ ఏవి ఇంతవరకు చెప్పలేదు, ముందుకు తీసుకురాలేదు. అంతే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా విజయవాడ కనకదుర్గని దర్శించుకోవడానికి కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి వెళ్లారు. అక్కడ మీడియా వాళ్ళు ఆమెను ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించారు.

See also  Rajamouli - Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

Prabhas-marriage-shyamala-devi-news-viral

శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. కృష్ణంరాజు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు ప్రఖ్యాతల్ని సినిమా రంగంలో అలా ముందుకు తీసుకెళ్తూ మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళుతున్న ప్రభాస్ పెళ్లి అతి తొందరలోనే ఉందని ఆమె చెప్పారు. వచ్చే దసరా కల్లా ప్రభాస్ పెళ్లి అయిపోతుందని కచ్చితంగా చెప్పారు. ఇక మీరు ఫిక్స్ అవ్వండి వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. అయితే ఎగ్జాక్ట్ డేట్, పెళ్లి కూతురు ఎవరు అని మాత్రం ఇప్పుడు అడక్కండి. అది సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక శ్యామలాదేవి నోటి నుంచి వచ్చే ఏడాది దసరా లోపు అని అన్నారు అంటే కచ్చితంగా అన్ని ఫిక్స్ అయిపోయే ఉంటాయని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక సలార్ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత.. అప్పుడు అసలు విషయాలు బయట పెడతారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి అనగానే.. ప్రభాస్ – అనుష్క పెళ్లి ఫొటోస్ నెట్ లో తయారుచేసిన ఫొటోస్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి..