శృతిహాసన్ ఆ వ్యాధిని బారిన పడిందా.? ఇంతకు ఏమైంది క్లారిటీ ఇచ్చిన శృతి.!
శృతిహాసన్ అనగానే మనందరికీ తెలిసిన విషయం లోక నాయకుడు అని పిలవబడే కమలహాసన్ కూతురు. తెలుగులో 3 మూవీ తో మనందరికీ పరిచయమై వై దిస్ కొలవ రి డీ అనే పాటతో అప్పట్లో ఆ సినిమా యువతను ఉర్రూతలూగించింది. శృతిహాసన్ విషయానికి వస్తే ఆమె తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. శృతిహాసన్ యొక్క ఇతర పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. 1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. చిన్నతనంలోనే తన తండ్రి సినిమాలో యాక్టర్ గా నటించింది. తెలుగులో సెవెంత్ సెన్స్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
శృతిహాసన్ దక్షిణ భారతదేశంలో పెద్ద స్టార్ హీరోయిన్లలో తాను ఒకరు, అంతేగాకుండా అత్యధికంగా రెమినరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో తాను ఒకరు. అయితే ప్రస్తుతం అమ్మడు సీనియర్ హీరోల సరసన యాక్టింగ్ చేస్తూ, సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తయారైంది. నిన్న రిలీజ్ అయిన వీరసింహారెడ్డి ఇవాళ రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాయి దీంతో యముడికి మరెన్నో అవకాశాలు గాలం చేపకు పడినట్లుగా పడుతున్నాయి. అయితే ఈ హీరోయిన్ ఇటీవల ఏదో వ్యాధి బారిన పడినట్లు న్యూస్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏమి వ్యాధి బారిన పడిందో చూద్దాం.
శృతి హసన్ పోస్ట్ చేసిన ఒక ఫోటో పట్టుకుని కొన్ని వైబ్ సైట్లు తనకేదో మామసిన రుగ్మత ఉందంటూ దుష్రచారం చేసారు. సమంతకు లాగే శృతి హసన్ కు ఏదో అయ్యింది అంటూ పుకార్లు లేవనెత్తారు ఇది శృతి హసన్ కు చాలా కోపం తెచ్చింది. వాటిని ఖండించింది. అయితే నాకు ఎలాంటి రోగం లేదని, నేను ఆరోగ్యంగా ఉన్నానని తన ఇస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. అదేకాకుండా తనకు వచ్చింది కేవలం వైరల్ విఫరని అది కూడా ఇప్పుడు తగ్గిందని దానిని పట్టుకుని ఇలా రూమర్స్ లేపుతున్నారని శృతి స్పష్టం చేసింది. ఇలాంటివాటిని అస్సలు నమ్మవద్దని చెప్పింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో అతి పెద్ద ప్రాజెక్టు సలార్, ఇందులో తను ఆద్య పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె లుక్స్ అదరహో అనిపిస్తున్నాయి మంచి స్పందన కూడా వచ్చింది. ఇదే కాకుండా ఓ ఇంగ్లీష్ మూవీ లో కూడా నటిస్తుంది. ఇంకా ది ఐ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తో తెరకెక్కుతుంది. ఇవే కాకుండా ఓ తమిళ సినిమాలో నటించనుడనట్టు సంతకం పెట్టింది ఈ సంవత్సరమంతా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉండనుంది.