Home Reviews Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.....

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

సినిమా : శాకుంతలం ( Shaakuntalam movie )
నటీనటులు: సమంత ( Samantha ) , దేవ్ మోహన్ ( Dev Mohan ), మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ళ..
మాటలు: సాయి మాధవ్
సంగీతం: మణిశర్మ
కెమెరా: శేఖర్ వి. జోసెఫ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: నీలిమ గుణ
దర్శకత్వం: గుణశేఖర్
విడుదల: 14 ఏప్రిల్ 2023 ( Shaakuntalam movie release date ) (Samantha shakunthalam movie review rating public talk is movie a hit )

సమంత మెయిన్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది.
గుణశేఖర్ దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా కాగా.. హై బడ్జెట్ తో తీసిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా కారణంగా, మరియు సమంతకు ఆరోగ్యం బాగోక ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యం అయ్యి.. చివరికి ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు దీనిపై హైప్ క్రియేట్ చేయాలని రెండు రోజుల ముందే ప్రీమియర్ షో లు వేశారు. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. యావరేజ్ టాక్ కొందరు చెబితే, కొందరు బాలేదు అంటే, అతి తక్కువ మంది బాగుంది అని అన్నారు. సరే.. ప్రీమియర్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది కాబట్టి.. సగటు ప్రేక్షకుడిగా సినిమా ఎలా ఉందో చూద్దాం. అందరి అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం..

samantha-shakunthalam-movie-review-rating-public-talk-is-movie-a-hit

కథ.. ( Shaakuntalam full movie story )

సినిమా మొదలు కొన్ని పక్షులు మేనక వదిలి వెళ్ళిపోయిన పసికందుని.. ఒక ఆశ్రమానికి దగ్గర వదులుతాయి. అక్కడ కణ్వమహర్షి ఆబిడ్డని తీసుకుని శకుంతల అని పేరు పెట్టి, అతను బిడ్డగా స్వీకరిస్తాడు. రాజ్యంలోని ప్ర‌జ‌ల‌ను క్రూర మృగాల బారి నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో దుష్యంత మ‌హారాజు (దేవ్ మోహ‌న్‌) క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలోకి వస్తాడు. అప్పటికి ఆ ఆశ్రమంలో పెరిగి పెద్దయిన శకుంతల ( సమంత) రాజు కంట పడతాది. తొలి చూపులోనే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. తరవాత వాళ్లిద్దరూ గాంధర్వ వివాహం చేసుకుని.. శారీరకంగా ఒకటి అవుతారు. ఆ తరవాత రాజు మళ్ళి వచ్చి, శకుంతలను రాజ్యానికి గౌరవంగా తీసుకుని వెళ్తానని చెప్పి.. ఇంక రాడు. శకుంతల గర్భవతి కాగా.. తన భర్త కోసం ఆ రాజ్యానికి వెళ్తాది.. అక్కడ దుష్యంతుడు శకుంతల ఎవరో తనకు తెలీదు అంటాడు.. అలా అనడానికి కారణం ఏమిటి? ఆ తరవాత శకుంతల పరిస్థితి ఏమిటి? చివరికి శకుంతల దుష్యంతుడు కలుస్తారా? ఎలా కలుస్తారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.

సినిమా ఎలా ఉందంటే.. ( Samantha shakunthalam movie review rating public talk is movie a hit )

శాకుంతలం సినిమా ఎలా ఉంది అనే దానిమీద కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమి లేదు. సినిమా రిలీజ్ డేట్ కంటే ముందే ప్రీమియర్ల్ వెయ్యడంతో కొంత మిక్స్డ్ టాక్ వస్తే.. ఇంకొంత ఫ్లాప్ టాక్ వచ్చింది. కాకపోతే సినిమా అసలు ఏ పాయింట్స్ లో బాగుందో, ఎందుకు బాలేదు చెప్పుకోవాలి. శాకుంతలం సినిమా కథ చాలామందికి తెలిసినదే. అయినా కూడా ఆ కథతో ఆడియన్స్ మెప్పించగలను అని నమ్మకంతో గుణశేఖర్ ఈ సినిమాని మొదలు పెట్టి ఉంటె.. అతను నమ్మకం తప్పినట్టే. తెలిసిన కథే అయినా కూడా ఆడియన్స్ ఆ సినిమా చూడటానికి వెళ్లారు అంటే అర్ధం.. అక్కడ ఎవరో ఒకరి మీద గట్టి నమ్మకంతో వెళ్తారు. దర్శకుడు కావచ్చు, ఆ నిర్మాణ సంస్థ కావచ్చు, నటీ నటులు కావచ్చు. కానీ ఈ సినిమాని ఆడియన్స్ ఎవరిని నమ్మి వెళ్లారో మనందరికీ తెలుసు. ఒకరు దర్శకుడు గుణశేఖర్ రెండు సమంత. వీళ్లిద్దరి మీద నమ్మకంతోనే ఆ సినిమా చూడటానికి ఆడియన్స్ సినిమా హాల్లో అడుగు పెట్టారు. ( Samantha shakunthalam movie review rating public talk is movie a hit )

See also  Ahimsa Review : అహింస లో ఉదయకిరణ్ కనిపించాడా.. రివ్యూ మరియు రేటింగ్

samantha-shakunthalam-movie-review-rating-public-talk-is-movie-a-hit

ఏ సినిమా అయినా అది జరిగిన కథ కావచ్చు, పురాణాల్లో ఒక భాగం కావచ్చు, లేదా కొత్తగా క్రియేట్ చేసింది కావచ్చు. ఏదైనా పరవాలేదు కానీ దాని మూలం ఒకటి ఉంటాది. అంటే ఆ సినిమాలో ఆడియన్స్ ని దేనికి కనెక్ట్ చెయ్యాలి అనే క్లారిటీ దర్శకుడికి ఉంటాది. ఈ సినిమా మూలం ప్రేమ కావ్యం. అంటే ఈ సినిమాకి వెళ్ళేవాళ్ళు కోణంలో మంచి ప్రేమ కావ్యాన్ని చూడటానికి వెళ్తున్నాం అని వెళ్తారు. కానీ అక్కడ ప్రేమని చెప్పారు తప్ప చూపించలేకపోయారు. ప్రేమని చెప్పడం.. చూపించడం.. దాన్ని ఆడియన్ ఫీల్ అవ్వడం అన్నిటికి తేడా ఉంటాది. రెండవ స్టేజి లో ఉంటె కొంచెం పరవాలేదు. మూడవ స్టేజి ప్రేక్షకుడు ఫీల్ కూడా అయితే, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతాది. కానీ ఈ సినిమా మొదటి స్టేజి కేవలం ప్రేమ కథ చెప్పారు. మిగిలిన రెండు స్టేజెస్ ని చూపించలేకపోయారు.

ఇకపోతే దర్శకుడు ఒక సినిమాని తియ్యాలని అనుకుంటే మొదట కథ రాసుకుని.. దానికి ఎవరు ఫిట్ అవుతారో చూసుకుని నటులను సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ గుణశేఖర్ మొదట కథని ఫిక్స్ అయ్యి ఉంటె.. ఈ సినిమాకి సమంతని తీసుకోకూడదు. ఎందుకంటే శకుంతల క్యారెక్టర్ కి సమంత అసలు నప్పలేదు. ఈ సినిమాలో హీరోయిన్ బయట ప్రపంచం తెలియకుండా.. ఒక ఆశ్రమంలో పెరిగే చాలా అందమైన యవ్వనంగా ఉన్న అమ్మాయి. అలాంటి పాత్రకి ఎలాంటి హీరోయిన్ ని తీసుకోవాలో గుణశేఖర్ కి తెలియలేదా అంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ సమంతతో సినిమా చెయ్యాలి అని ఆయన సినిమా కథ రాయడం మొదలు పెట్టి ఉంటె.. సెకండ్ హాఫ్ నుంచి సినిమా మొదలు పెట్టి.. శకుంతల పడ్డ కష్టాలు, ఆమె చేసిన ఫైట్ గురించి సినిమా తియ్యాల్సింది. కొంచెం బాగానే ఆమె కథకి సెట్ అవుతాది. అంతే కానీ మూల కథకి మాత్రం ఆమె నప్పలేదు. ( Samantha shakunthalam movie review rating public talk is movie a hit )

ఇక ఈ సినిమాలో హీరో అయితే ఎవరో మనకు తెలియని వాడిని ఎలా చూడాలో అనుకుంటూ.. అయినా సమంత ఉందిగా అనుకుంటూ వెళ్లిన ఆడియన్స్ కి హీరో షాక్ ఇచ్చాడు. ఊహించినదానికంటే హీరో బాగున్నాడు. సమంతతో సమానంగా నటించాడు. పైగా ఆ పాత్రకి చాక్కగా నప్పాడు కూడా.. కాకపోతే అతని హీరోయిజాన్ని చూపించడానికి గుణశేఖర్ అనవసరంగా భారీ బడ్జెట్ తో యుద్దాలు పెట్టారు గాని, ఎవరూ కనెక్ట్ అవ్వలేదు. మనకి తెలియని హీరోని యాక్సెప్ట్ చెయ్యడమే గొప్ప అనుకుంటే.. అతని హీరోయిజం,యుద్దాలు చూడలేకపోయారు. హీరోగా మన తెలుగువాడిని, తెలిసినవాడిని పెడితే బాగుణ్ణు అని చాలాసార్లు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అప్పట్లో పోరానికం, జానపదం ఏ సినిమా తీసినా దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా ఉండే నటులనే తీసుకునేవారు తప్ప, వాళ్ళ ఫేమ్ తో సంబంధం ఉండేది కాదు.

See also  Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

ఇక ఈ సినిమాలో అన్నిటికంటే ఘోరం ఏమిటంటే సమంత వాయిస్. ఇప్పటి జనరేషన్ కి సంబందించిన సినిమా ఏదైనా తీసి ఉంటె.. అందులో సమంత వాయిస్ ఓకే. కానీ పురాణాల్లోకి వెళ్లి కాళిదాసు రచించిన ప్రేమ కావ్యంలో శకుంతలను చూద్దామని వెళ్తే.. ఆ పాత్ర నేనే పోషిస్తున్నది బాగా చూడండి అని సమంత చాలా గర్వంగా, అసహ్యంగా ఆమె నోరు విప్పిన ప్రతీసారి చెప్పినట్టు అనిపిస్తుంది. అసలు ఆమె వాయిస్ పెట్టాలనే ఆలోచన గుణశేఖర్ దేనా? లేక సమంత డిమాండ్ గానా? దీనికి వీళ్ళిద్దరిలో ఎవరు కారణం అయితే వాళ్ళు ఈ పాయింట్ లో సినిమా పోవడానికి కారకులు అవుతారు. లాస్ట్ లో రాజు మాట్లాడిన తరవాత సమంత వాయిస్ తో మళ్ళి మాట్లాడితే చిరాకు వచ్చి పారిపోవాలనిపించింది. మరి డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎవరికీ ఈ బీభత్సం ఏమిటనే ఆలోచన రాలేదో.. వచ్చినా ఏమి చెయ్యలేకపోయారో తెలీదు.

హీరో హీరోయిన్ ని చూడగానే ఆమె అందాన్ని పొగుడుతూ ఒక పాట ఉంటాది. నిజంగా ఆ పాట లిరిక్స్ , మ్యూజిక్ రెండూ బాగున్నాయి తప్ప ఎవరి మీద పాడుతున్నారో ఆమె మాత్రం అస్సలు బాలేదు. సన్నటి నడుముతో, ఆ డ్రెస్ కి తగ్గట్టు ఫిజిక్ ఎంత అందంగా ఉందొ చూసుకున్నారు గాని, ఆ ముఖం అస్సలు బాలేదు.ఈ సినిమాలో సమంత లాస్ట్ లో కొంచెం సేపు చాలా బాగుంది. అమ్మయ్య మన సమంత ని చూసాం అనిపిస్తాది. ఎందుకంటే ఒక కొడుక్కి తల్లిగా ఆమె ఫేస్ చాలా బాగా నప్పింది కానీ, ఒక అమాయకపు కన్నె పిల్లగా ఆమె ఫేస్ అస్సలు నప్పలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాలేదు. అన్నిటికంటే ఈ సినిమాలో మరో ఘోరం ఏమిటంటే.. ఎక్కడికక్కడ ఒక స్టోరీ ని యానిమేషన్ లో చూపిస్తూ నోటితో చెప్పేస్తారు. ఇది చూడటానికి చాల ఏడుపు వచ్చింది. ఇంట్లో పిల్లలు టీవీ లో స్టోరీస్ అన్ని అలానే చూస్తారు. అది గుర్తుకు వస్తుంది.

అన్నిటికంటే గుణశేఖర్ ఒక లాజిక్ మరచిపోయాడు. అదేమిటంటే సినిమా కథని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి గూగుల్ ఉంది. దానిని అడిగితేహ్ మొత్తం అప్పట్లో జరిగిన పురాణం చెప్పేస్తాది. కానీ గూగుల్ మనకి ఆ ప్రపంచం గురించి ఇన్ఫిర్మషన్ ఇస్తాది గాని, ఆ ప్రపంచంలో మనం ఉన్నట్టు చెయ్యలేదు. సినిమాకి, గూగుల్ ఇన్ఫిర్మషన్ కి ఉన్న తేడా అదే. సినిమా చూస్తే ఆ కథలో మనం కూడా లీనమైపోయి.. అక్కడ పాత్ర నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం, ప్రేమిస్తే ప్రేమను ఫీల్ అవుతాం. ఈసినిమాలో అలాంటివి ఏమి లేవు. గూగుల్ లాగా కథ మొత్తం ఎలాగోలా ఇన్ఫిర్మషన్ లాగ ఇచ్చేసారు. నిజానికి చెప్పాలంటే గుణశేఖర్ మంచి దర్శకుడు. ఆయన మంచి దర్శకుడినని కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేని వ్యక్తి. కానీ ఈ సినిమాను తీయడంలో మాత్రం ఆయన ఇలాంటి లోపాలను చేసి ఫెయిల్ అయ్యారు.

See also  Vimanam Review : తండ్రి పోతే ఎలా బ్రతకాలనే.. మరి బిడ్డ పోతే ఏమనిపిస్తాది?

తన కథలో పాత్రకు తగ్గ నటులను వెతుక్కోవడంలో దర్శకుడికి ఎంత బాధ్యత ఉందొ.. తాను నటించే పాత్రకి నేనెంతగా కనక్ట్ అవుతానని నటులు కూడా ఆలోచించాలి. పైగా మెయిన్ రోల్ లో హీరో, హీరోయిన్, ప్రమోషన్ బేసిక్ సోర్స్ అన్ని సమంత ఈ సినిమా పై బాధ్యత లేకుండా కేవలం తన ఆనందం, అవార్డు గ్రహీత కావాలనే ఆలోచనో తెలీదు కానీ, ఆమె వాయిస్ ఇవ్వడానికి నిర్ణయించుకోవడం ఈసినిమా ఫెయిల్ కి కీలక కారణాల్లో ఇదొకటి. పాటల్లో సంగీతం లిరిక్స్ బాగున్నాయి. మల్లిక, మల్లిక పాట బాగుంది. ఇక యుద్ధాల సీన్స్ అస్సలు నచ్చలేదు. ఆ నచ్చని పార్ట్ కి ఎన్ని కోట్లు ఖర్చు చేసి, వేస్ట్ చేశారో అనిపిస్తాది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతరు అల్లు హర్ష ఎంటర్ అవగానే హీరో హీరోయిన్ కి ఎంట్రెన్స్ కూడా లేని సౌండ్ అల్లరి ఆ పాప ఎంటర్ అవ్వగానే వినిపించింది.

తనకు అవకాశం దొరికిన కొద్దీ సేపు ఆమె డైలాగ్స్ గాని, నటన గాని చాలా చక్కగా చేసింది. రుద్రమదేవి లో అల్లు అర్జున్ ఎలా మెరిపించాడో.. ఇందులో అయన కూతురు అలా మెరిపించింది. ఇక సినిమాలో సెట్టింగ్స్ అన్ని కూడా డిం గా కనిపించాయి.. లైటింగ్ తక్కువగా ఫీల్ కలిగింది. ఇక విలన్స్, యుద్దాలు ఇవన్నీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో నోటితో లేదా అనిమేషన్ తో ఎవరో ఒకరు చెప్పేస్తున్నారు.. అక్కడ ఎదో జరుగుతుంది తప్ప.. దాన్ని ఆడియన్స్ అస్సలు ఫాలో అవ్వలేదు. ఈ సినిమాలో 3 సీన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి హీరో హీరోయిన్ కలయిక అఫెక్షన్. అది అస్సలు పండలేదు. ఇంటర్వెల్ తరవాత సమంతకు సభలో జరిగిన అవమానం అది కొంచెం పరవాలేదు. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ పరవలేదేమో అని అనిపిస్తాది.

కాకపోతే ఆ సీన్ కూడా ఇంకా హైలెట్ గా తియ్యచ్చు గాని, దానిని సమంత వాయిస్ తో చంపేసింది. ” తగలబెట్టండి మాయుష్మతీ సామ్రాజ్యాన్ని” అని బాహుబలి లో అనుష్క ఒక్క డైలాగ్ ఇలాంటి 100 సీన్స్ కి సమానంలా అనిపిస్తాది. అయినా ఆ సీన్ ని కొంచెం నిలబెట్టడానికి సమంత సాయి శక్తుల ప్రత్నించింది. మూడవది హీరో హీరోయిన్ లాస్ట్ లో కలవడం.. అది చాల నార్మల్ గా ఉంది తప్ప ఎలాంటి ఆనందం,అనుభూతి కలగలేదు. ఇంకా ఈ సినిమాలో మోహన్ బాబు తన వరకు తన పాత్ర బాగానే చేసారు. ప్రకాష్ రాజు ఎంటర్ అవ్వగానే అబ్బా బాగా తెలిసినవాడు కనిపించాడని అనుకుంటప్పటికీ.. ఒక పాట పాడి వెళ్ళిపోయాడు. కాకపోతే సమంత అభిమానులు ఈ సినిమాని ఒకసారైనా చూడచ్చు. ఎందులకంటే సమంత పౌరాణిక సినిమాల్లో చేయడం ఇదే మొదటి సారి కాబట్టి.. మొత్తం మీద సినిమా ఊహించిన అంచనాలను, వాళ్ళు ప్రమోషన్ లో క్రియేట్ చేసిన హైప్ ను గాని అస్సలు రీచ్ అవలేదు. అసలు ఏమీ ఊహించకుండా, ఎవరి నుంచి ఎలాంటి ఎక్సపెక్ట్షన్స్ లేకుండా టైం పాస్ కి ఈ సినిమాకి వెళ్తే యావరేజ్ గా ఉంటాది.

రేటింగ్ : 2.25 / 5

ఈ రివ్యూ గాని రేటింగ్ గాని కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.
అసలైన రివ్యూ మరియు రేటింగ్ మీకు మీరే ఇవ్వాలి..