Home Uncategorized Ravanasura: రావణాసుర సినిమా ట్రైలర్ పై నెటిజనుల రివ్యూ..

Ravanasura: రావణాసుర సినిమా ట్రైలర్ పై నెటిజనుల రివ్యూ..

Ravanasura: మాస్ మహారాజు రవితేజ నటన అంటే ఆడియన్స్ ఇప్పటికీ మాంచి హుషారుగానే ఉంటారు. రవితేజ నటనలో ఉన్న కిక్కే వేరబ్బా అని అందుకే అంటారు. రవితేజా హీరోగా రావణాసుర (Ravanasura Movie Trailer Review) సినిమా ఏప్రిల్ 7 వ తేదీన ఆడియన్స్ ముందుకు వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ సినిమా ని సుదీర్ వర్మ దర్శకత్వం చేయగా.. కథ మాటలు శ్రీకాంత్ విస్సా రాయడం జరిగింది. అను ఇమ్మాన్యుయేల్ మరియు మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. అనుమోలు సుశాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య తారాగణంతో ఉన్నారు.

See also  Hansika Motwani: శింబుతో ప్రేమ వ్యవహారం పై నోరువిప్పిన హన్సిక..!

ravanasura-movie-trailer-review

ట్రైలర్ మొదలు చూస్తేనే ఈ సినిమా హత్యల తో వైలెన్స్ గా నడుస్తుందని అనిపిస్తుంది. ఆ తరవాత లైఫ్ లో వైలెన్స్ ఎక్కువ అయిపోయి బొత్తిగా రొమాన్స్ తగ్గిపోతుందిరా అంటూ రవితేజ కామిడీ కోణం బాగానే ఉంది. సరసాలు ఆడేటప్పుడు మీరే డోర్ లోపలనుంచి లాక్ చేసుకోవాలండి అనే డైలాగ్ తో రవితేజ ఎప్పుడు పండించే కామెడీ కనిపించింది. రవితేజా ని గ్లామర్ గా చూపించారు గాని, అక్కడక్కడా ఏజ్ మాత్రం కొంచెం బాగానే కనిపిస్తుంది. హైపర్ ఆది డైలాగ్స్ తో కామెడీ బాగానే ఉంటాదనిపిస్తుంది.

See also  Bro Movie: బ్రో చిత్రానికి తప్పని తిప్పలు. ఆందోళనలో ఫ్యాన్స్.

ravanasura-movie-trailer-review

సినిమాలో ఫైట్స్, కామెడీ , మాత్రమే కాకూండా సస్పెన్సు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ వెతుకుతున్న హంతకుడు హీరో నే లా ఉన్నాడు. అదే అయితే కిక్ సినిమా కొంచెం గుర్తుకువస్తాది. రావు రమేష్ నటన ఎప్పటిలానే సపోర్ట్ గా ఉంటాదనిపిస్తుంది. అలాగే మర్డర్ చెయ్యడం (Ravanasura Movie Trailer Review) ఒక క్రైమ్ అయితె దొరక్కుండా మర్డర్ చెయ్యడం ఒక ఆర్ట్ అనే డైలాగ్ విన్నప్పుడు కూడా కిక్ అజండా కనిపిస్తుంది. అయితె కిక్ సినిమాలో సమాజం కోసం హీరో దొంగతనాలు చేస్తే, ఇందులో పర్సనల్ రివెంజ్ కోసం హత్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

See also  Puri-Charmi: చార్మి ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటే.. పూరి లైట్ తీసుకోమన్నాడట ఇంతకీ ఏం జరిగింది.?

ravanasura-movie-trailer-review

మొత్తం సినిమా హీరోయిన్ కోసం హీరో విలన్స్ తో చేసే యుద్దమే కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక లాయర్ గా రవితేజ లుక్ స్టైల్ కూడా బాగున్నాయి. కానీ ట్రైలర్ లో ఎక్కడా కూడా రవితేజ లవ్ ట్రాక్ చూపించలేదు. పైగా సినిమా పేరు నెగటివ్ విలన్ పేరు రావణాసుర అని పెట్టారు. ఈ రెండిటి మీద సినిమా చూసినప్పుడు క్లారిటీ రావాలి. ఏది ఏమైనా ట్రైలర్ అయితే సినిమా ఏవరేజ్ గా బాగానే ఉండచ్చు అనిపిస్తుంది.