Home Cinema Rajamouli: 45 సెకండ్స్ యాడ్ కోసం 3 కోట్లు.. రాజమౌళికి దరిదాపుల్లో కూడా లేని స్టార్...

Rajamouli: 45 సెకండ్స్ యాడ్ కోసం 3 కోట్లు.. రాజమౌళికి దరిదాపుల్లో కూడా లేని స్టార్ హీరోలు..

Rajamouli Oppo Ad: తెలుగు సినిమా గర్వపడే స్థాయి నుండి ఇండియన్ సినిమా గర్వపడే రేంజ్ కి ఎదిగిన దర్శకుడు రాజమౌళి. అద్భుతమైన విజన్ కి హద్దులు అనేవే లేవు అనడానికి నిదర్శనం ఆయన, రీసెంట్ గానే ఆయన #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డు ని కూడా గెలిచి మన తెలుగోడి సత్తాని ప్రపంచం మొత్తానికి చాటిచెప్పాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కి సైతం వెన్నులో వణుకు పుట్టించేలా చేసాడు.

rajamouli-oppo-ad

ఇతడు ఇండియన్ సినిమాకి మాత్రమే పరిమితం అయితే బాగుండును, ఇక్కడకి వస్తే మన స్థానాలకు ఎసరు పెడుతాడు అనే రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్నాడు. అందుకే ఆయనతో ఒక్క సినిమా అయినా చెయ్యాలని మన ఇండియన్ సూపర్ స్టార్స్ పరితపించిపోతుంటారు. ఇక నుండి రాజమౌళి (Rajamouli Oppo Ad) సినిమాలు కేవలం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ తో పోటీ పడే రేంజ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

See also  Sai Dharam Tej : చిన్న వయసులోనే ఆ తప్పు చేసి సూసైడ్ అటెమ్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన మెగా హీరో ఎవరో తెలుసా?

rajamouli-ad

అందుకే రాజమౌళి బ్రాండ్ ఇమేజి ని వాడుకొని తమ ప్రోడక్ట్స్ కి సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇది వరకు రాజమౌళి అడపాదడపా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో తళుక్కుమని మెరిశాడు కానీ, ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ యాడ్ లో నటించలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఒప్పో మొబైల్ యాడ్స్ లో నటించి ఆ ముచ్చటని కూడా తీర్చుకున్నాడు రాజమౌళి. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం రాజమౌళి అక్షరాలా 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడట. కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ కి ఇంకా రీచ్ కాలేదు. దీనిని బట్టీ రాజమౌళి రేంజ్ ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

See also  SreeMukhi: యాంకర్ శ్రీ ముఖి మెగా స్టార్ చిరంజీవికి ప్రపోస్ చేస్తే తెగ సిగ్గు పడుతూ ఏం చేసాడో తెలుసా.?

rajamouli-advertisement

ఇక నుండి కూడా ఆయన ఇలాంటి కమర్షియల్ యాడ్స్ లో(Rajamouli Oppo Ad) కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. ఇదంతా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చూసుకుంటాడు, రాజమౌళి మాత్రం ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి వరల్డ్ టూర్ ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నాడు.