Prabhas movie Salaar : మొత్తానికి సలార్ సినిమా రిలీజ్ కు డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ సినిమా ఇక ప్రేక్షకుల ముందు రాడానికి ( Prabhas movie Salaar ) ఎన్నో రోజులు లేదు. సమయం దగ్గర పడే కొద్ది ప్రభాస్ అభిమానుల్లో ఆనందంతో పాటు, ఆత్రుత అన్ని మొదలయ్యాయి. ఈ సినిమా గురించి ఒక ట్రైలర్, ఓ పాట తప్పితే ఇంకేమీ రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ గురించి కూడా వాళ్ళు ఏమి అంత కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల రిలీజైన అనిమల్ సినిమా ప్రమోషన్ చూస్తే విపరీతంగా చేసుకొని ముందుకు వచ్చారు.
ఇక సలార్ సినిమా విషయంలో మాత్రం దానికి భిన్నంగా చూస్తున్నాం. ఎక్కడా దీని ప్రమోషన్ ని ఒక కొత్త తరహాలో గాని, కనీసం పాత తరహాలో అయినా ఎక్కువగా చేయడం గాని చేయడం లేదు. చాలా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు సలార్ ( Prabhas movie Salaar ) సినిమా ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న ప్రమోషన్స్ కూడా ప్రభాస్ ప్రశాంత్ నీల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మీడియా వాళ్ళు రాసుకుంటున్నవే తప్పా.. వాళ్ళ చేస్తున్న ప్రమోషన్స్ ఎక్కడ కనిపించడం లేదు. ఇకపోతే ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అతి కొద్ది రోజులే ఉండడంతో.. ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడటం జరిగింది.
ప్రభాస్ ఈ సినిమా గురించి, ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి కొన్ని మాటలు మాట్లాడడం సలార్ మూవీలో ఎమోషన్స్ చాలా డెప్త్ గా ఉంటాయి. ఆడియన్స్ నన్ను ఇంతవరకు ఇలాంటి పాత్రలో చూడలేదు. ఈ దర్శకుడి చిత్రంలో నేను తొలిసారిగా నటిస్తున్నాను. అయితే సినిమా చేస్తున్నప్పుడు నేను కూడా నా ఆలోచనలు ( Prabhas movie Salaar ) కొన్నిటిని అతనికి చెప్పడం జరిగింది.వాటిని కూడా ఫాలో అవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా గురించి నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. సలార్ సినిమా షూటింగ్ కోసం నన్ను ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసేవాడిని, అలాగే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాలని చాలా ఆకృతిగా ఉండేవాడిని.
ఇంతకీ షూటింగ్ స్పాట్ కి వెళ్ళడానికి అంత ఆతృతగా ఎందుకు ఉండేవాణ్ణి అంటే.. ప్రశాంత్ నీల్ తో మాట్లాడటమంటే నాకు చాలా ఇష్టం. అతనితో ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. పరిచయమైన కొన్ని రోజులకే నాకు చాలా బాగా నచ్చాడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక అతనితో షూటింగ్ స్పాట్లో మాట్లాడుతూ ఉంటే.. చాలా ఆనందంగా ఉండేది అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని.. ప్రభాస్ చెప్పిన ఒక మాట మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నా 21 ఏళ్ల కెరీర్ లో.. నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పాడు. అయితే ఈ మాట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ కి తాను చూసిన బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే.. రాజమౌళి అని చెప్తాడని అందరూ అనుకుంటారు.కానీ ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడే సమయంలో.. 21 ఏళ్ల కెరీర్లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత నీల్ అని చెప్పడంతో.. ప్రభాస్ కి రాజమౌళి కంటే కూడా ఇంకొక బెస్ట్ కనిపించిందనే సీక్రెట్ బయటపడిందని అనుకుంటున్నారు..