Home Cinema Pawan Kalyan: పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్.. ఈసారి చాల భారీగా స్కెచ్ వేశారు!

Pawan Kalyan: పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్.. ఈసారి చాల భారీగా స్కెచ్ వేశారు!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాలకి మామూలు క్రేజ్ కాదు. ఎందుకంటే ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆయన చేసే పనులని, మాటలని చాల శ్రద్దగా తెలుసుకుంటారు. పేరుకి చిరంజీవి తమ్ముడు అయినా, మెగా హీరో అయినా కూడా.. ఈయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్, ప్రాముఖ్యత ఏర్పాటయింది. పవన్ కళ్యాణ్ చాలా ( Pawan Kalyan in the police station for shooting ) అదృష్టవంతుడే అనుకోవాలి. ఎందుకంటే ఈయన సినిమా కెరియర్ లో చూస్తే.. అన్నీ సూపర్ హిట్స్ ఏమీ కాదు, పైగా అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ పయనంలో కూడా..

pawan-kalyan-in-the-police-station-for-shooting

ఇంతవరకు పెద్ద సక్సెస్ అమీ చూడలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎక్కడా కూడా తగ్గలేదు. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ ని సెట్ చేసే విధంగా ఉంటాడన్నట్టు అతని స్టైల్ కనిపిస్తాది. అందుకే అభిమానులకి పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి. పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన తరవాత చాల కాలం ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి గుడ్ బాయ్ చెప్పడమేనా అనుకునే టైం లో హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాడు. ఆ సినిమా మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

See also  Samantha : త్రిష అనుష్క లను సైడ్ చేసి మరీ.. సమంత ఆ హీరోకి ప్లాన్డ్ గా దగ్గరవుతున్నది అందుకేనా?

pawan-kalyan-in-the-police-station-for-shooting

అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ హవా మళ్ళి మొదలయ్యింది. ఆ తరవాత అత్తారింటికి దారేది సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. అయితె ఆ తరవాత మళ్ళి చాలా కాలం హిట్స్ రాలేదు. 2021 , 22 లో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పరవాలేదు అనిపించుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఎలాంటి హిట్ ఇస్తాడో ఏమౌతాదో తెలీదు కానీ.. హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై ( Pawan Kalyan in the police station for shooting ) అభిమానులకి, సినిమా ఇండస్ట్రీ కి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ అలాంటిది కాబట్టి. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో ఘనంగా పూజ కార్యక్రమాలు చేసి, సినీ ప్రముఖుల మధ్య మొదలయ్యింది.

See also  South Queen Trisha: చెన్నయ్ బ్యూటీ చెప్పా పెట్టకుండా చేసుకుంది గా పెళ్లి అందరంగా వైభవంగా..

pawan-kalyan-in-the-police-station-for-shooting

బుధవారం ఏప్రిల్ 5  నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. సినిమా మొదటి షెడ్యూల్ మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉంటాదంట. అందువలన పవన్ కళ్యణ్ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాడు. ఈ పోలీస్ స్టేషన్ మీద ఈసారి చాలా శ్రద్ద పెడుతున్నాడట హరీష్ శంకర్. అందుకే భారీ బడ్జెట్ తో  ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ వేయించారట. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కంటే పెద్ద హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, పైగా ఈ హిట్ క్రేజ్ తో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా సపోర్ట్ అవ్వాలని.. ఈసారి భారీ స్కెచ్ వేసుకుని అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట..

See also  Nani - Mahesh Babu : మహేష్ బాబు కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టిన నాని.. ఇక ఆ సినిమాని..