Home Cinema Jr.NTR: ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనమవ్వడానికి కారణం.! ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడమేనా.?

Jr.NTR: ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనమవ్వడానికి కారణం.! ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడమేనా.?

NTR Movie Career: ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. నందమూరి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ప్రస్తుతం ఇటీవల నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుంచి గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోయే చిత్రాలే.. ఇక ఎన్టీఆర్ తన సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని తన టాలెంట్ తో ఎదిగిన హీరో.. కానీ ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ మొత్తం ఫ్లాప్ సినిమాలతో హిట్టు అనే పదానికి చాలా దూరంగా ఉండిపోయాడు.

ntr-ruined-his-early-movie-career-by-falling-in-love-with-that-actress

ఇలా ఆయన సినీ జీవితం ఇరకాటంలో పడడానికి అసలైన కారణం ఆ హీరోయిన్ నేనట.. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. గతంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అన్న వార్తలు ఎన్నో వ్యాపించాయి.. ఇదే కాకుండా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా ముస్తాబయ్యారన్న విషయాలు అప్పట్లో మీడియాలో వినిపించాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు నరసింహుడు, అశోక్.. ఇక వీళ్ళు ప్రేమలో పడ్డది మాత్రం నరసింహుడు సినిమా టైంలో, అలా చాలా రోజులు ప్రేమల్లో మునిగి తేలుతున్నారు. ఇక సమీరా రెడ్డి కూడా వేరే చిత్రాలు నటిస్తూ ఎంతో ఎక్స్పోజింగ్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చేది కాదట.. ఇక ఇదే కారణంతో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డికి ఓ కండిషన్ పెట్టాడట..

See also  Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తో దెగ్గరుండి మరి ఆ హీరో తో రొమాన్స్ చేయించిన భర్త..

ntr-ruined-his-early-movie-career-by-falling-in-love-with-that-actress

అదేంటంటే నువ్వు నా సినిమాలు తప్ప వేరే సినిమాల్లో అస్సలు నటించకూడదని. దానికి సమీరా కూడా సరే అని చెప్పిందట.. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో అశోక్ సినిమా వచ్చింది కానీ.. ఆ తరువాత ఐదు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ వదులుకోవాల్సి వచ్చింది. దానికి అసలైన కారణం.. ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన దర్శక, నిర్మాతలతో ఎన్టీఆర్ కచ్చితంగా తన సినిమాలో సమీరా అనే హీరోయిన్ ను పెట్టాలని చెప్పేవాడట. ఆ కారణంతో ఒక్క హిట్ కూడా లేని హీరోయిన్ ని పెట్టి సినిమాలు ఎలా తీయగలం అని దర్శక, నిర్మాతలు తారక్ తో కాకుండా వేరే హీరోలను సంప్రదించారట..

See also  Ram Gopal Varma : శ్రీదేవి పై అలా.. నన్ను చూస్తే నాకే అసహ్యం అందుకే వేసింది అని సంచలన విషయం చెప్పిన రామ్ గోపాల్ వర్మ.

ntr-ruined-his-early-movie-career-by-falling-in-love-with-that-actress

అందు చేతనే ఐదు సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకొని ఫ్లాప్ సినిమాల్లో చేసాడు జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ సినీ కెరియర్ ఇరకాటంలో పడుతుందన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ ద్వారా ఈ విషయాన్ని అంత తెలుసుకున్న హరికృష్ణ ఏదో రకంగా అయినా ఎన్టీఆర్ ని సెట్ చేయాలన్న ఉద్దేశంతో.. రాత్రికి రాత్రి సమీరా రెడ్డి ఆమె కుటుంబం మొత్తానికి వార్నింగ్ ఇచ్చి హైదరాబాదు వదిలి ముంబై వెళ్లేలా చేశాడట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమీరా రెడ్డి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మొహం కూడా చూడకుండా చేశారట.. ఇక ఆ తర్వాత నుండే ఎన్టీఆర్ (NTR Movie Career) కి హిట్ సినిమాలు కలిసి రావడం జరిగింది.