Rojas Husband: సీనియర్ నటి ఏపీ మంత్రి రోజా సెల్వమణి భర్త ప్రముఖ తమిళ సినీ దర్శకుడు అయినటువంటి ఆర్కే సెల్వమణి గురించి మనకు చాలా బాగా తెలిసిన విషయమే.. ఎన్నో చిత్రాలను నిర్మించి సూపర్ డూపర్ చిత్రాలను తన దైన శైలిలో చాలా హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నటువంటి సెల్వమణి కి కోర్టు నుండి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ మంజూరు చేయడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది.? కోర్టు నాన్ బెయిలబుల్ శిక్ష వేసేంత తప్పు ఏం చేశాడు.? ఎందుకు చెన్నైలోనే జార్జ్ టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దానికి అసలు సిసలైన కారణమేంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన అభివృద్ధి శాఖ మంత్రి రోజా సెల్వమణి. ఇక ఆమె యొక్క భర్త ఆర్కే సెల్వమణి. ఇతను సినీ దర్శకుడు ఎన్నో చిత్రాలను నిర్మించినటువంటి వ్యక్తి ఈయన సినీ ప్రయాణం మొదలైంది 1990 సంవత్సరంలో..
నాడు మొదలుపెట్టిన ఆయన సినీ ప్రస్థానం నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఓ తమిళ దర్శకుడిగా తన దైన శైలిలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి తమిళ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ విజయాలను కైవసం చేసుకున్నాడు. అలా ఆయన తెరకెక్కించినటువంటి ఎన్నో చిత్రాలు తమిళంలోనే కాకుండా తెలుగులో సైతం డబ్బింగ్ విడుదల కూడా చేయబడ్డాయి. ఇక రోజా మరియు ఆర్కే సెల్వమణి లు 2002 వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరిద్దరికీ ఒక కుమార్తె అంశమాలిక మరియు ఒక కుమారుడు కృష్ణ లోహిత్ సెల్వమణి ఇద్దరు పిల్లలు కలరు. వివాహం అనంతరం రోజా పూర్తిగా సినిమాలకు దూరమైన తర్వాత చాలా సంవత్సరాలకి జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలో తళుకుమన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో కొనసాగుతున్న సమయంలోనే తన కుటుంబాన్ని ఓసారి ప్రోగ్రాం కి తీసుకువచ్చి మరి అందరికీ పరిచయం చేసిన సంగతి మనకు తెలుసు..
ఇక ఆర్కే సెల్వమణి విషయానికి వస్తే సెల్వమని 2022-24 సంవత్సరం గాను దక్షిణ భారత సినీ కార్మికులకు సమాఖ్య (ఫెప్సీ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా సెల్వమణి అసలు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారి చేసింది కోర్టు చెన్నైలో ఉన్న జార్జ్ టౌన్ కోర్టు.. ఈ మేరకు నాన్ బేలబుల్ వారెంట్ కింద ఉత్తర్వులని మంజూరు చేసింది. దీంతో అసలు ఏమైందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరింతకు ఏం జరిగిందో తెలుసుకుందాం. 2016 వ సంవత్సరంలో తమిళ ఛానల్ కు సెల్వమణి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయనకి ఇంటర్వ్యూ చిక్కులు తెచ్చి పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఫైనాన్సర్ ముకుంద్ చంద్ బోత్రా ను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు గాను అతను కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశాడట.
ముకుంద్ చంద్ బోత్రా కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమని వీడియో ఛానల్ లో ముఖాముఖిలో చెప్పారని ఆరోపణలు ఉండగా అతను చేసిన వ్యాఖ్యలకు ముకుంద్ చంద్ బోత్రా పరువు నష్టం దావ కేసు వేయసాగాడు. కానీ ఈ కేసు వేసిన కొన్నేళ్ళకి ముకుంద్ బోత్రా మరణించాడు. ఆ తరువాత ఆ కేసు ముకుంద కొడుకు గగన్ బోత్రా కొనసాగిస్తూ వచ్చాడు. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆ కేసు సోమవారం విచారణ జరగడంతో సెల్వమని ఆ కేసుకి హాజరు కాలేదు. గతంలోనూ సెల్వమణి విచారణకు రాలేదు మరియు అతనికి సంబంధించిన లాయర్లు సైతం కోర్టుకు రాకపోవడంతో సెల్వమని తీరుపై చెన్నై జార్జ్ టౌన్ కోర్టు సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. దాంతో సెల్వమని కి కోర్టు నాన్ బెయిలబుల్అ రెస్టు వారు అంటూ మంజూరు చేసింది. కాగా ఈ విషయంపై ఇప్పటివరకు ఇటు మంత్రి రోజా కానీ అటు సెల్వమని (Rojas Husband )కానీ స్పందించలేదు మరి చూడాలి ఏమవుతుందో