Home Cinema Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

niharika-gave-clarity-on-her-divorce-news

Niharika : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ ఎందరో మంచి హీరోలను తెలుగు కళామ్మతల్లికి అందించింది. అలాగే మెగా కుటుంబం ( Niharika gave clarity ) నుంచి మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని చాలా ప్రయత్నించంది కానీ.. హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినప్పటికీ.. అభిమానుల గుండెల్లో మాత్రం మంచి స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా కెరియర్ లో పడుతూ లేస్తూ ఇంకా ప్రయత్నిస్తున్న సమయంలోనే.. మెగా కుటుంబం ఎంతో వైభవంగా నిహారిక కు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు.

niharika-gave-clarity-on-her-divorce-news

పెళ్లయిన తర్వాత నిహారిక సినిమాల్లో నటించడం మానేసింది. ఆ తర్వాత తన పెళ్లి చేసుకునేటప్పుడే సినిమా రంగంలో ఇంక నటించనని మాటిచ్చి పెళ్లి చేసుకుందని కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఈ ప్రచారాల్లో ఎంతవరకు ఏది నిజమో తెలియదు కానీ పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరంగానే ఉంది. నిహారిక ( Niharika gave clarity ) సినిమాలకయితే దూరంగా ఉంది కానీ.. తన కెరీయర్ని పూర్తిగా వదులుకోకుండా ఓటీటీ ప్లాట్ఫారం అందుకుని అక్కడ తన కెరియర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి తరుణంలో గత కొంతకాలంగా నిహారిక పర్సనల్ లైఫ్ పై అనేక వార్తలు వినవలసి వస్తుంది. నిహారిక తన భర్త జొన్నల‌గ‌డ్డ‌ చైతన్య ని వదిలేస్తుందని, విడాకులు తీసుకోబోతుందని, మెగా డాటర్స్ కి పెళ్లి కలిసి రాలేదని ఇలా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

See also  Mahesh Babu: పూరి కి మహేష్ బాబు కి మధ్య చిచ్చు పెట్టిన లేడీ.. కనీసం ఇప్పుడు మాటలు కూడా లేవు.

niharika-gave-clarity-on-her-divorce-news

దానికి కారణం సోషల్ మీడియాలో నిహారిక తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసిందని.. చైతన్య ను కూడా అన్ ఫాలోయింగ్ చేసిందని.. ఆమె భర్త కూడా వాళ్ళిద్దరూ పర్సనల్ ఫొటోస్ అన్ని తీసేసాడని.. అందువల్ల కచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోతున్నారని ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాము. ఇంతమంది ఇంతలా మాట్లాడుకుంటున్న కూడా మెగా కుటుంబం గాని, నిహారిక గాని ఈ విడాకుల సబ్జెక్టు మీద ఎప్పుడు స్పందించలేదు. అయితే ఇటీవల నిహారిక `డెడ్‌ పిక్సెల్స్‌`(dead pixels) వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న క్రమంలో ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె విడాకుల గురించి ప్రశ్నించాగా.. ఇంటర్వ్యూస్ లో నిహారిక కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్పంది.

See also  Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఇంత పెద్ద చిచ్చు ఎవ్వరూ ఊహించి ఉండరు..

niharika-gave-clarity-on-her-divorce-news

వెండితెరగాని, ఓటీటీ గాని ఎందులోనైనా కూడా నా కెరియర్ నిలబెట్టుకోవడం కోసం నేను 100% కష్టపడుతున్నాను అని చెప్పింది. అలాగే ఫ్యూచర్లో సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని.. అలాగే సోషల్ మీడియాలో ( Niharika gave clarity ) వస్తున్న కొన్ని వార్తలని తాను పట్టించుకోవడం లేదని, మొదట్లో కొంచెం బాధ కలిగినా కూడా ఇలాంటి వాటిని కేర్ చేయడం మానేశానని చెప్పింది. తన వైవాహిక జీవితం పై ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నా.. అందులో ఎలాంటి నిజం లేదని దాని గురించి ఎక్కువగా స్పందించడం కూడా నాకు ఇష్టం లేదని సూటిగా చెప్పింది. అంటే నిహారిక విడాకులు తీసుకుంటుంది అనే వార్త ఏమాత్రం నిజం కాదని తెలుస్తుంది. దీనితో మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.