Home Cinema Allu Arjun – Prabhas : అల్లు అర్జున్ ప్రభాస్ ల గురించి ఒక విచిత్రమైన...

Allu Arjun – Prabhas : అల్లు అర్జున్ ప్రభాస్ ల గురించి ఒక విచిత్రమైన ఇలాంటి వాదన తలెత్తింది..

Allu-Arjun-prabhas-movies

Allu Arjun – Prabhas : సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఎవరి మనసులో ఏమున్నా వెంట వెంటనే వ్యక్తపరుస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదైతే, మరో విధంగా అనవసరమైన సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఇక ఇప్పుడు ( Allu Arjun and Prabhas ) సోషల్ మీడియాలో నెటిజనులు అల్లు అర్జున్, ప్రభాస్ మధ్య ఒక విచిత్రమైన వాదనను తెచ్చుకొని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అల్లు అర్జున్, ప్రభాస్ మధ్య ఆ విచిత్రమైన వాదన ఏంటంటే.. వీళ్ళిద్దరిలో ఎవరికి అదృష్టం, ఎవరికి దరిద్రం ఏ రకంగా పడుతుంది అని మాట్లాడుకుంటున్నారు.

Allu-Arjun-prabhas-netizens-comments

ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక రేంజ్ లో ఉన్నాడు. పుష్ప సినిమాతో గ్లోబల్ లెవెల్ లో అల్లు అర్జున్ కి మంచి పేరు వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రకి, అందులో ఆయన నటనకి అభిమానులు ఫిదా అయిపోయారు. అందుకే ( Allu Arjun and Prabhas ) అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. అలాగే బాహుబలి సినిమాతో ప్రభాస్ కి కూడా అంతర్జాతీయ లెవెల్లో ఎంతో ఖ్యాతి వచ్చింది. బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకునే అంత గొప్ప సినిమాకి పాన్ ఇండియా సినిమాకి మొదటి స్టార్ హీరో అవ్వడం నిజంగా ప్రభాస్ అదృష్టం కూడా అనుకుంటూ.. నెటిజనులు ఏదేదో కామెంట్స్ చేసుకుంటూ.. ఇలా హీరోలా అదృష్టల గురించి చర్చించుకునే దగ్గరకి వచ్చారు.

See also  Manchu Manoj: భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ.. ఆగ్రహంతో మంచు మనోజ్.?

Allu-Arjun-prabhas-netizens

కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అదృష్టం మాయం అయిపోయింది. వందకోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరో అయినప్పటికీ కూడా బాహుబలి సినిమా తర్వాత అన్ని డిజాస్టర్లే మిగులుతున్నాయి. దీనితో ప్రభాస్ ఫ్యూచర్ ఎక్కడికి ( Allu Arjun and Prabhas ) వెళ్తుందో అతని ఏ రేంజ్ లో ఉంటాడో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. కానీ అల్లు అర్జున్ తన కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా పైకి ఎదుగుతూనే ఉన్నాడు తప్పా.. స్థాయి కిందకి రావడం లేదు. అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారం లాగా ఉంది. ఏది ఎలా చూసుకున్నా ప్రభాస్ అల్లుఅర్జున్ లో అల్లు అర్జున్ అదృష్టవంతులని అంటున్నారు.

See also  Anchor Suma: ఆ పని చేసి అరెస్ట్ అయిన సుమ.. నెట్టింట హల్ చల్ అవుతున్న ఫోటోలు. అసలు జరిగిన సంగతేంటి.?

Allu-Arjun-prabhas-movies-comments

అసలు అల్లు అర్జున్కి అదృష్టాన్నిచ్చింది ప్రభాస్ అంట. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఒక వెలుగులోకి రావడానికి కారణమైన సినిమా ఆర్య. ఆర్య సినిమా సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. సుకుమారి కథను పట్టుకొని మొదట ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు అంట. ప్రభాస్ డేట్స్ ఖాళీ లేవని రిజెక్ట్ చేస్తే.. ఆ కథని అల్లు అర్జున్కి సెట్ చేశాడంట సుకుమారు. ఇలా అప్పటి నుంచే ప్రభాస్ అల్లు అర్జున్కి అదృష్టాన్ని ఇచ్చేసాడని అనుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత చాలా సినిమాలకి చాలా మంది దర్శకులు ప్రభాస్ ని కలవగా.. ప్రభాస్ డేట్స్ కాళీ లేవనగా.. అవి తిన్నగా అల్లు అర్జున్ఖాతాలోకి వచ్చి పడ్డాయి అంట. ఇలా అల్లు అర్జున్ తన అదృష్టాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అంతే కాకుండా పెళ్లి, పిల్లలు అనే పర్సనల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ బాగున్నాడు. ఏదేమైనా అల్లు అర్జున్ ప్రభాస్ లో అల్లు అర్జున్ ప్రస్తుతానికి అదృష్టవంతుడంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అసలు ఇది ఒక విచిత్రమైన కంపారిజన్ అని మరికొందరు నెటిజనులు అంటున్నారు.