Home Cinema Mahesh Babu: మహేష్ బాబు సెల్ ఫోన్ రింగ్ టోన్ ఏంటో తెలిస్తే నవ్వి నవ్వి...

Mahesh Babu: మహేష్ బాబు సెల్ ఫోన్ రింగ్ టోన్ ఏంటో తెలిస్తే నవ్వి నవ్వి సచ్చిపోతారు..

Mahesh Babu : టాలీవుడ్ లో ఇన్ బిల్డ్ కామెడీ టైమింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయనతో ఏ మీడియా రిపోర్టర్ అయినా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాస్త తింగరి గా మాట్లాడినా ఆయన వేసే పంచులు ముఖం వాచిపోవాల్సిందే. ఇలాంటి అనుభవాలు గతం లో ఎంతో మందికి జరిగాయి. కొన్ని కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానం వింటే పొట్ట చక్కలు అవుతుంది(Mahesh Babu Ringtone). రీసెంట్ గా ఆయన బిగ్ సి షో రూమ్ వారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం ని ఏర్పాటు చేసారు.

mahesh-babu-cell-phone-ringtone

ఈ సమావేశానికి మహేష్ బాబు కూడా విచ్చేశాడు. ఈ మీడియా సమావేశం లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసిన ఆయన వేసిన ఈ పంచులే కనిపిస్తున్నాయి. అందులో ఒక మీడియా రిపోర్టర్ మీరు ఫోన్ బాగా ఉపయోగిస్తారు కదా, మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మహేష్ బాబు దానికి సమాధానం ఇస్తూ ‘నా ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లో ఉంటుంది అండీ’ అని అంటాడు(Mahesh Babu Ringtone). ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోతుంది. మహేష్ బాబు లో ఇంత కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ దానిని సినిమాల్లో ఈమధ్య వాడుకోలేకపోతున్నారు దర్శకులు.

See also  Samantha: నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..??

mahesh-babu-trivikram

దానికి తోడు ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ ఆయనతో కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేయిస్తున్నారని కంప్లైంట్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్యాన్స్ కి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయని. చాలా కాలం తర్వాత మహేష్ నుండి రాబోతున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే త్వరలో ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

See also  Rashmika Mandanna: రష్మిక నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే...!!!

mahesh-babu-guntur-kaaram

ఈ సినిమా కూడా ఈ ఏడాది నుండే ప్రారంభం కాబోతుంది. ఈ రెండు సినిమాలు మహేష్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ చిత్రాలతో ఆయన రేంజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. మహేష్ బాబు ప్రస్తుతం జిం లో చాలా కష్టపడుతున్నాడు. రాజమౌళి తో చేసే నెక్స్ట్ సినిమా కోసం కొద్దిగా ఫిట్ అవ్వాల్సి ఉంది అని అన్న రాజమౌళి, వెంటనే కొద్దిగా కండలు పెంచి బాడీ ఫిట్ చేయాలి అని ఫిక్స్ అయిన మహేష్, తన శరీరంపై వర్క్ అవుట్ చేయటం మొదలు పెట్టాడు. రాజమౌళి తో మహేష్ సినిమా అని ఊహించుకుంటేనే ప్రిన్స్ ఫాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి అట. ఇక ఈ సినిమా రిలీజ్ ఐతే మహేష్ బాబు కి ఉన్న అందానికి హాలీవుడ్ స్టార్స్ అందరూ మాకు కాంపిటీషన్ అని అనుకోవాల్సిందే.