Home Cinema Mahesh Babu : పెళ్ళాం దగ్గర బతికి బట్టగట్టాలంటే ఎప్పుడు ఆ పని మాత్రం చేయాలంటున్న...

Mahesh Babu : పెళ్ళాం దగ్గర బతికి బట్టగట్టాలంటే ఎప్పుడు ఆ పని మాత్రం చేయాలంటున్న మహేష్ బాబు..

mahesh-babu-gave-a-tip-about-how-to-manage-with-wife

Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎంతటి స్టార్ హీరో అన్నది మనందరికీ తెలిసింద. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా ( Mahesh Babu gave a tip about the wife ) ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేయబోతున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పటినుంచి మహేష్ బాబును చూసి అందరూ తెగ ఏడిపిస్తున్నారు. రాజమౌళితో సినిమా ఎన్నేళ్లు జరుగుతుందో.. ఇక మహేష్ బాబు టూర్లు ఎలా తిరుగుతాడో అని తెగ నవ్వుతున్నారు.

Majesh-gave-a-tip-for-wife

మహేష్ బాబు మాత్రం ఎవ్వరు ఏమన్నా కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. మహేష్ బాబు ఎప్పుడూ కూడా సీరియస్ మూడ్లో ఉండడం అనేది పెద్దగా కనిపించదు. ఎప్పుడు చాలా సింపుల్గా, చిరునవ్వుతో కనిపించే వ్యక్తి. అయితే ( Mahesh Babu gave a tip about the wife ) నిన్న మహేష్ బాబు ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనిమల్. ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చేశారు. దీనికి రాజమౌళి, మహేష్ బాబు కలిసి వచ్చి ఆ సినిమా గురించి అనేక విషయాలను మాట్లాడారు.

See also  Prabhas: ఆ డైరెక్టర్ ప్రభాస్ ని అవమానించడానికి కారణం అదేనా.. 3000 కోట్లా!

Majesh-gave-a-tip-for-wife-family

ఈ సినిమా గురించి మాట్లాడే క్రమంలో మహేష్ బాబును యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో అనిమల్ సినిమా తండ్రి కొడుకుల సెంటిమెంట్ సినిమా కదా. రియల్ గా మీకు, కృష్ణ గారికి ఉన్న సెంటిమెంట్ గురించి.. ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా అలా మిమ్మల్ని ఏమైనా భయపెట్టిందో, తిట్టిందో సంఘటన ఏమైనా ఉన్నాయని అడిగితే.. అవన్నీ చాలా కామన్ గాని.. మరీ సందీప్ రెడ్డి వంగ చూపించినంత లేదు అని ( Mahesh Babu gave a tip about the wife ) సమాధానం చెప్పేసాడు. ఆ తర్వాత అలా కొన్ని ప్రశ్నలు అడుగుతూ.. ఈ సినిమాలో భార్యాభర్తలు రిలేషన్ కూడా ఉంది కదా.. భార్యని మేనేజ్ చేయాలంటే ఏవైనా కొన్ని టిప్స్ చెప్పండి అని సుమా వ్యంగంగా నవ్వుతూ మహేష్ బాబుని అడిగింది.

See also  Janhvi Kapoor: తరచూ తిరుపతికి శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ ఎందుకు వెళుతుందో అసలైన కారణం తెలుసా.?

Majesh-gave-a-tip-in-Animal-pre-event

అంటే మహేష్ బాబు తన భార్యను మేనేజ్ చేయడానికి ఎలాంటి టిప్స్ వాడతాడు అని అందరికీ తెలియాలనే సుమ చాలా తెలివిగా ప్రశ్న అడిగింది. ఎందుకంటే మహేష్ బాబు జీవితంలో నమ్రతని ప్రేమించే పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. నమ్రత ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటుంది. మహేష్ బాబు కేవలం తన సినిమాలు కెరీర్ మాత్రమే చూసుకొని మిగిలిందంతా తన భార్య చేతిలోనే పెట్టే మనిషిని అందరూ అంటారు.నమ్రత చాలా క్రమశిక్షణ, బాధ్యత ఉన్న మనిషని చెప్పుకుంటారు. అయితే నమ్రత తో ఎప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేయడానికి మహేష్ బాబు వాడే టిప్ ఏమిటా అని తెలుసుకోవడానికి సుమ అలా అడిగిందని అందరికీ అర్థమైంది. దాంతో మహేష్ బాబు ఒక చిన్న చిరునవ్వు నవ్వి.. భార్యని మేనేజ్ చేయాలంటే ఒకటే టిప్ అండి. ఎప్పుడు నవ్వుతూ ఉండడమే అని చెప్పాడు. దీనితో అక్కడున్న అభిమానులు అందరూ కూడా నవ్వేశారు. మొత్తానికి భార్యని జాగ్రత్తగా మేనేజ్ చేయాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆమె ఏం చెప్పినా నవ్వుతూ ఉండాలంటే.. అంటే ఆమె తిడుతున్న నవ్వుతూ ఉండాలి, పొగడ్తున్నాను అవుతూ ఉండాలి, భర్తకి బాధగా ఉన్నా భార్యని మాత్రం ఆహ్లాదకరంగా ఉంచాలని మహేష్ బాబు ఉద్దేశం అని అర్థమవుతుంది..