Home Cinema Lavanya Tripathi : పెళ్ళికి ముందే లావణ్య తీసుకున్న ఆ డేరింగ్ స్టెప్ కి మెగా...

Lavanya Tripathi : పెళ్ళికి ముందే లావణ్య తీసుకున్న ఆ డేరింగ్ స్టెప్ కి మెగా ఫ్యామిలీ రియాక్షన్?

lavanya-tripathi-made-the-daring-decision-before-marriage-only

Lavanya Tripathi : మెగా ఫ్యామిలీలో మరొక సందడి ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. అదే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి. మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పరిచయం ( Lavanya Tripathi before marriage ) మొదలయ్యి, అక్కడ నుంచి ప్రేమగా మారి, ఇన్నేళ్లు ప్రేమించుకుని కూడా.. పెద్దవాళ్ల మాట గౌరవించి, వాళ్ళని ఒప్పించిన తర్వాతే పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎంతో సంబరంగా నాగబాబు ఇంట్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటినుంచి వాళ్ళ పెళ్లి ఎప్పుడు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Lavanya -Tripathi

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల పెళ్లి అనుకున్న తర్వాత ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మెగా కుటుంబంలో సినిమా రంగంలో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్లకు కలిసి రాదని, వాళ్ళు విడిపోతారని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇటీవలే నిహారిక తన భర్తతో విడిపోవడం చూసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిహారిక ( Lavanya Tripathi before marriage ) పెళ్లి టైంలో ఎంతో ఆనందంగా ఉంటూ.. తన భర్తతో ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ చాలా ఆనందంగా ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సమస్యలు వచ్చాయో తెలియదు కానీ.. విడిపోవలసి వచ్చింది. ముఖ్యంగా పెళ్లికి ముందు సినిమాలు పూర్తిగా నటించను అని మాట ఇవ్వడమే కాకుండా కొంతకాలం నిలబెట్టుకుంది.

See also  Ayesha Takia: సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..! చూస్తే తట్టుకోగలరా.??

Lavanya-Tripathi-daring

కానీ తర్వాత మరి నిహారిక ఆమె భర్త మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చాయో తెలీదు కానీ.. లావణ్య త్రిపాఠి మాత్రం కొంచెం తెలివైన దానిలాగే అనిపిస్తుంది. ఆమె పెళ్లికి ముందే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే వరుణ్ తేజ్ తో ఎప్పుడో ప్రేమలో పడినా కూడా.. ఇంతకాలం పట్టడానికి కారణం పెళ్లి తర్వాత ( Lavanya Tripathi before marriage ) సినిమాల్లో నటిస్తే కుటుంబంలో సమస్యలు రావచ్చని, లేదా ఆ పాత్రలో వాళ్లకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అని ఆలోచించుకొని ముందుగానే సినిమాలన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత పెళ్లికి సిద్ధమైందని అనేక వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఇది చాలా తెలివైన పనే అనుకోవాలి ఇంకెవరితోని ఎలాంటి మనస్పర్ధలు ఉండవు.

See also  Ravanasura review rating: రావణాసుర రివ్యూ మరియు రేటింగ్

Lavanya-Tripathi-movies

ఇప్పుడు లావణ్య త్రిపాఠి తాజాగా డేరింగ్ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటించడానికి అనేక ఆఫర్స్ వస్తున్నాయంట.. ఆమెకు వెళ్లి కథ, పాత్ర కూడా చెప్తున్నారట. అయితే దానికి ఆమె.. నేను ఇంకొద్ది రోజుల్లో కొణిదెల వారి కుటుంబానికి కోడలు కాబోతున్నాను. సినిమాలైతే నటించొచ్చు కానీ.. ఇలాంటి పాత్రలు నటించడం కుదరదు, బోల్డుగా ఉండే పాత్రలో చెయ్యను అని సినిమా ఆఫర్స్ కి, వెబ్ సిరీస్ ఆఫర్స్ కు కూడా ఆమె ధైర్యంగా చెప్పేసిందంట. ఇలా తన గురించి తాను నిర్ణయం తీసుకుంటూ కరెక్ట్ గా దాని మీద నిలబడుతూ ఉంటే.. ఎవరితోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సెంటిమెంట్స్ ని పటాపంచలు చేసేలా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి కలకాలం ఉండాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. అయితే మెగా కుటుంబం వాళ్ళ కాబోయే కోడలి నిర్ణయానికి మరి ఎంతగా ఆనందించి ఉంటారో..