Home Cinema Prabhas – NTR : ప్రభాస్ లక్ ని ఎన్టీఆర్ అలా లాక్కున్నాడా.. మరి సలార్...

Prabhas – NTR : ప్రభాస్ లక్ ని ఎన్టీఆర్ అలా లాక్కున్నాడా.. మరి సలార్ కల్కి?

junior-ntr-super-hit-movie-brindavanam-rejected-by-prabhas

Prabhas – NTR : సినిమా ఇండస్ట్రీలో హీరోగాని, హీరోయిన్ గాని ఎవరైనా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారంటే అక్కడ నుంచి వాళ్లకి అనేక సినిమా ఒకేసారిగా సైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత లైన్ గా వచ్చే సినిమాల్లో ఏ సినిమా ( Prabhas and NTR ) ఎంతవరకు హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుందనేది దైవదినం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కెరియర్ పరంగా చూసుకుంటే.. అంచలంచలుగా ఎదిగి బాహుబలి సినిమాతో బీభత్సమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి ఆయన క్రేజ్ తగ్గడమైతే తగ్గలేదు గాని.. అనుమానస్పదంగా, ఆత్రుతగా నెక్స్ట్ మరో బాహుబలి లాంటి రికార్డును ఎప్పుడు బద్దలు కొడతానని ఆశగా ఆడియన్స్ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

junior-ntr-super-hit-movie-brindavanam-rejected-by-prabhas

ఇదిలా ఉంటే ఏ సినిమా ఎవరికి అందుబాటులోకి వస్తుందో.. ఆ సినిమాలో ఎవరు నటిస్తారో.. ఆ హిట్టుని గాని.. ఫ్లాప్ని గాని ఎవరు బరిస్తారు అనేది ఎప్పుడూ తెలియదు. వారి వారి అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వరిస్తుంది. అలాగే ( Prabhas and NTR ) ప్రభాస్ కెరీర్ లో ఒక సినిమాని రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేయగా.. బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడంట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ చేసిన బృందావనం సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బృందావనం.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్, సమంత ఇద్దరు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

See also  Leo First Day Collection : లియో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

junior-ntr-super-hit-movie-brindavanam-rejected-by-prabhas

బృందావనం సినిమా అప్పట్లో మంచి హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ కలెక్షన్ విపరీతంగా రాబట్టింది. అయితే ఈ సినిమాని వంశీ పైడిపల్లి తయారు చేసుకున్న తర్వాత మొదట ఈ సినిమాని చేయమని ప్రభాస్ దగ్గరికి వెళ్లి అడిగారంట వంశి పైడిపల్లి. ప్రభాస్ కి మొత్తం కథ చెప్పిన తర్వాత ప్రభాస్ కథ చాలా నచ్చిందట కానీ.. ఆ టైంలో ప్రభాస్ డార్లింగ్ సినిమాకి ఒకే చెప్పాడంట. కాబట్టి ఈ సినిమాని చేయడానికి అవకాశం లేక సున్నితంగా ( Prabhas and NTR ) తనకి టైం లేదని చెప్పేసాడంట. దాంతో ఇంకొక హీరోని వెతుక్కునే క్రమంలో.. ఈ కథకి ఎన్టీఆర్ అయితే బాగుంటాడని వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కి చెప్పాడంట. అప్పుడు ఎన్టీఆర్ కథకి ఓకే చెప్పి సినిమా చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో.. ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటించడం జరిగింది.

See also  Naga Chaitanya : విడాకులు తీసుకున్న ఇన్నాళ్ళకి సమంత గురించి మొత్తం బయటపెట్టిన నాగ చైతన్య..

junior-ntr-super-hit-movie-brindavanam-rejected-by-prabhas

తమన్ ఈ సినిమాకి స్వరాలందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2010 అక్టోబర్ 14న విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ అదరగొట్టింది. అప్పుడు ప్రభాస్ లక్ ని ఎన్టీఆర్ తీసుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని.. అలాగే ఇప్పుడు బాహుబలి సినిమా తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేసి మళ్లీ లక్ ని అందుకొని ప్రపంచ స్థాయి హీరో అయ్యాడని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 చిత్రాలతో పాటు.. మారుతి మారుతీతో, సందీప్ రెడ్డి వంగతో కూడా సినిమా చేయడానికి ప్రభాస్ కమిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు సలార్, కల్కి ఈ రెండు సినిమాల మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండిటికైనా ప్రభాస్ లక్ ప్రభాస్ కి తిరిగి వచ్చి.. బ్లాక్ బస్టర్ కొట్టి.. సంచలనం క్రియేట్ చేయాలని ప్రభాస్ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.