Home Cinema జూనియర్ ఎన్టీఆర్ అంత పని చేసేస్తాడంటారా! మీరేమంటారు?

జూనియర్ ఎన్టీఆర్ అంత పని చేసేస్తాడంటారా! మీరేమంటారు?

జూనియర్ ఎన్టీఆర్ అంత పని చేసేస్తాడంటారా! మీరేమంటారు?

సినీ అభిమానులు మంచి సినిమాలు కోసం ఎదురుచూస్తారు. కానీ ఒక హీరోకి అభిమానులు… సినిమా బాగుండటమే కాకుండా, అది సూపర్ డూపర్ హిట్ అయ్యి, వాళ్ళ హీరో కెరియర్ కి ఆ సినిమా మరొక మంచి టర్నింగ్ అవ్వాలని కోరుకుంటారు. అభిమానుల నుంచి అంత మంచి దీవెనలు పొందాలంటే, వారి అభిమానాన్ని చాలా పొందాల్సి ఉంటాది. అంతటి అభిమానం పొందాలంటే, వారి ఎక్సపెక్టషన్స్ కి సరిపడేటట్టు గా హీరో అంత బాగా నటించాలి. ఎంతటి నటుడికి అయినా వారికి వచ్చే ఆదాయం కంటే… అభిమానులు చూపించే ఆదరణ,అభిమానమే వాళ్లకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.

See also  Tamanna: మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి కన్నీళ్లు పెట్టుకున్న తమన్న..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ ఆర్ సినిమా ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా గురించి ప్రకిటించన మొదలు నుంచి, ఆ సినిమా పై అందరికీ భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమా రాజమౌళి లాంటి దర్శకుడి దర్శకత్వంలో ముల్టీ స్టార్ తారాగణంతో రూపొందటం అంటే మామూలు విషయం కాదు. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు రాజమౌళి ముందు ఎంతటి అద్భుతమైన సినిమాలు ఇచ్చారో సినీ అభిమానులకు తెలిసిందే. పైగా బాహుబలి2 లాంటి అంతర్జాతీయ సక్సెస్ సినిమా తరవాత వచ్చిన సినిమా ఇది.

See also  Anasuya : అదిరిపోయే అందాలను ఆరబోస్తూ జిమ్ లో అనసూయ వీడియో వైరల్

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ గా తన నటనతో అభిమానుల మనసుని ఎంతగానో ఆకట్టుకున్నాడు. తారక్ పులులతో చేసిన ఫైట్ ఎంత అద్భుతంగా వచ్చిందో, ఎన్టీఆర్ కు అంత పేరు వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డుల సందడి మొదలయ్యింది. ఈ అవార్డుల నామినేషన్ కు ఏ సినిమాలు, ఏ నటులు ఎన్నిక అవుతారు అని అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వెరైటీ అనే అంతర్జాతీయ మీడియా, ఆస్కార అవార్డు నామినేషన్స్ కు అర్హులుగా ఉన్న 10 మంది హీరోలు అంటూ ఊహాజనిత లిస్ట్ ను పబ్లిష్ చేసింది. అందులో మొదటి స్థానంలో ఇండియన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంది. ఇది నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో గర్వకారణం. ఈ సంస్థ ఊహించినట్టు ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయితే తెలుగు సినిమా రంగం మరో సారి అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అంతపని చేసితీరుతాడని అభిమానులు, ఆస్కార్ కి అందుకుంటాడా అని సినీ అభిమానాలు అనుకుంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.