Home Cinema Samantha: తీవ్రమైన అనారోగ్యానికి గురైన సమంత.! హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు.. అసలేమైంది.??

Samantha: తీవ్రమైన అనారోగ్యానికి గురైన సమంత.! హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు.. అసలేమైంది.??

Samantha Health: సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. మరికొద్ది గంటల్లో అందరి ముందుకు విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంలో సమంత తీవ్రమైన అనారోగ్యానికి గురైందట.. దాంతో హుటాహుటిన సామ్ ను హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం తెలుస్తుంది. అసలు సామ్ కి ఏమైందో ఇప్పుడు చూద్దాం..అక్కినేని నాగచైతన్య తో విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎంతో సమయం తీసుకున్నప్పటికీ ఆ వ్యాధి నుంచి పూర్తిగా తేరుకోలేదు.

See also  Ileana: తల్లి అయిన నటి ఇలియానా.!! తండ్రి ఎవరని అడుగుతున్న నెటీజన్స్.??

is-samantha-health-in-critical-condition-again-rushed-to-hospital

ఇక ఆ వ్యాధి నుంచి కొంచెం తేరుకున్న తర్వాత ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా మారిపోయింది. గతేడాది విడుదలైన యశోద చిత్రం విడుదలయ్యే సమయంలో కూడా సామ్ ఇంకా ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆ తర్వాత సమంత ఆరోగ్యం కాస్త నెమ్మది పడడంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యింది. ఇక సమంత మెయిన్ రోల్లో నటించిన శకుంతలం సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల అవ్వబోతుంది. ఇక ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తూ ఈ సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేసుకున్నారు.

See also  Pawan Kalyan: పవర్ స్టార్ అనే బిరుదును పవన్ కళ్యాణ్ కు ఎవరు ఇచ్చారు.? అసలు ఎలా వచ్చిందో తెలుసా.?

is-samantha-health-in-critical-condition-again-rushed-to-hospital

కేవలం చిత్ర యూనిట్ మాత్రమే కాకుండా సమంత కూడా వరుసగా ప్రమోషన్లతో, ఇంటర్వ్యూ లలో పాల్గొనడం చేత తీవ్రమైన అస్వస్థకు (Samantha Health) గురైనట్లు మనకు అర్థమవుతుంది, సామ్ కు తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతూ శాకుంతలం సినిమా ప్రమోషన్ కి రాలేకపోతున్నాను అంటూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ఏముందంటే నా ఆరోగ్యం బాగాలేదు.. అందువల్లనే నేను ఈ ప్రమోషన్ మిస్ అవుతున్నాను అని సమంత ఒక పోస్ట్ పెట్టింది. దాంతో ఒక్కసారిగా సమంత అభిమానులు ఆందోళనలో పడిపోయారు.

See also  Asnushka: ప్రభాస్‌కు అనుష్క పెట్టిన ముద్దుపేరు గురించి మీకు తెలుసా.?

is-samantha-health-in-critical-condition-again-rushed-to-hospital

ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సమంతా అభిమానులు తనకు ఏమైందని చాలా కంగారుపడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రివ్యూల నడుమ ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమా హైప్ క్రియేట్ చేసుకున్నది. ఇక రేపు విడుదల అవుతున్న శాకుంతలం ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఎదురుచూడాల్సిందే. ఇక ఈ చిత్రం మీదనే సమంత కెరియర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్టయితే సమంత తన పూర్వ వైభవంతో తిరిగి వస్తుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.