చిన్న బెల్లం ముక్క ఎంత పనిచేస్తుందో తెలుసా?
మనం ఆరోగ్యం ఎంత బాగుంటే, మనం అంత ఆనందంగా ఉంటాము. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారు బ్రతికినంత కాలం గాని, వారంత ఆరోగ్యంగా మనం ఉండటం లేదు. మన జనరేషన్ ఇలా ఉందంటే, మన తరవాత జనరేషన్ వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. దానికి కారణం మన ఆహార అలవాట్లు, మన టైమింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఎన్ని సదుపాయాలు పెరిగితే అంత అనారోగ్యాలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎంతోకొంత ఫలితం ఉంటుంది.
మన ఇంట్లో ఉండే బెల్లంతో మనం ఎన్నో చిన్న చిన్న రోగాలను నయం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు,ఒళ్లునొప్పులు, ఎసిడిటీ ఇలా ఎన్నో సమస్యలను బెల్లం ద్వారా తగ్గించుకోవచ్చు. ప్రతీ చిన్న సమస్యకి మెడిసిన్ మీద ఆధారపడకుండా ఉండాలంటే, మనం రోజు తీసుకునే ఆహారంలో చిన్న బెల్లం ముక్క తినడం ఎంతో మంచిదని అంటున్నారు. పెరుగు బెల్లం కలుపుకుని తింటే, తొందరగా జలుబు తగ్గుతుంది. మైగ్రేడ్ తలనొప్పి ఉన్నవారు కూడా, బెల్లంలో నెయ్యి కలిపి తింటే కొద్దీ రోజులకు తలనొప్పి తగ్గుతుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే బెల్లం మనకు శక్తిని కూడా ఇస్తుంది.
బెల్లం తినడం వలన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా పని చెయ్యాలంటే, భోజనం తరవాత ప్రతీరోజు చిన్న బెల్లం ముక్క తింటే మంచిది. లివర్ లో చెడు పదార్ధాలను పోగొట్టి, లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడతుంది. బెల్లం ఎక్కువగా తినడం వలన అధిక పరువు కూడా తగ్గుతారు. బెల్లం తినడం వలన గుండెజబ్బు కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉందని అంటున్నారు. పంచదార స్వీట్స్ తినడం వలన ఆరోగ్యానికి ఎన్ని నష్టాలు ఉన్నాయో, బెల్లం స్వీట్ తినడం వలన అన్ని లాభాలు ఉన్నాయి. అందుకని బెల్లాన్ని నిత్యం మన ఆహారంలో భాగంగా తీసుకోవడం ఎంతో మేలు అని అంటున్నారు.