నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?
Lemon: నిమ్మమకాయలు మనకు ఏ కాలంలోనైనా దొరుకుతాయి ఏ సీజన్ అనేది వీటికి ఉండదు. వీటి రుచి పుల్లగా ఉంటుంది. వీటి రుచి వాసన కోసం ప్రతి వంటకాలలో వినియోగిస్తుంటాము. నిమ్మకాయలకు ఆయుర్వేదంలో చాల ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదంలో అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు.
వీటిని ఆహార పదార్థాలలో వాడడం వల్ల శరీరానికి ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పడిగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనే కలుపుకొని తాగితే రోజంతా ఆరోగ్యం ఉత్సాహంగా ఉంటుంది మరియు బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే శరీరంలోనే అదనపు కొవ్వును కరిగిస్తుంది.
వీటిలో ఉండే విటమిన్ సి శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందించడమే కాకుండా విటమిన్ సి లోపం వల్ల వచ్చే స్కర్వీ ప్రమాదాన్ని పోగొడుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది.
జలుబు మరియు దగ్గు కు గొప్ప ఔషధం నిమ్మరసం ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది.
దీని వల్ల నోటి దుర్వాసన పైత్యం మొదలైనవి తొలగిపోతాయి.
రోజు నిమ్మరసం తాగడం వల్ల బాడీలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలుపుకుని తాగితే శరీరం ప్రశాంతంగా మరియు నీరసం తగ్గి హుషారుగా ఉంటారు.
నిమ్మరసం జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.
నిమ్మరసం తాగడం వల్ల మూత్రపిండాలో రాళ్లు రాకుండా సాయపడుతుంది.
నిమ్మకాయ రసం చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ రసం కాలేయాన్ని దెబ్బతీయకుండా నివారిస్తుంది.
ఇది అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడం వలన ఆరోగ్యాన్ని ఆనందంగా ఉంచుతుంది
నిమ్మకాయ రసం ఒక యాంటీబయాటిక్.
మరిన్ని ఆరోగ్య సంబందిత విషయాలకు మమ్మల్ని ఫాలో అవ్వండి.