Home Cinema Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ...

Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

Deepika Padukone interduced natu natu song in Oskar Awards: మొత్తానికి మన భారతదేశం తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2023 ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఎంతో వైభంగా మొదలయ్యింది. నిజంగా భారతదేశం అందులోనూ తెలుగువాళ్లు ఎంతో ఆనందించాల్సిన రోజు ఇది. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి నాటు నాటు పాటని అనౌన్స్ చెయ్యడానికి దీపికా పడుకోణె వచ్చింది. దీపికా తన అందాలను చాలా అందంగా చూపిస్తూ, ఎంతో అట్రాక్షన్ గా వచ్చి నాటు నాటు పాట గురించి చెప్పింది. బాలీవుడ్ లో దీపికా కి ఎలాంటి క్రేజ్ ఉందొ, తెలుగు వాళ్ళ దగ్గర కూడా దీపకాకి అంత క్రేజ్ ఉంది. ఎందుకంటే దీపికా సినిమా తెలుగువాళ్లు కూడా బాగానే ఫాల్లో అవుతారు. హిందీ లో అగ్ర హీరోలతో ముఖ్యంగా ఆమె షారుఖ్ తో నటించిన సినిమాలను మన తెలుగు వాళ్ళు కూడా బాగానే చూస్తారు.

See also  Jr NTR : ఆ ఒక్క హీరోయిన్ తనకంటే పెద్దదయినా కూడా జతకట్టిన ఎన్టీఆర్..

deepika-padukone-interduced-natu-natu-song-in-oskar-awards

నాటు నాటు పాటను ఇంట్రడ్యూస్ చెయ్యడానికి దీపికా ( Deepika Padukone interduced natu natu song in Oskar Awards ) స్టేజి మీదకు రాగానే హర్షధ్వనులు భారీగా వినిపించాయి. భారతీయ పోరాట యోధులు కొమురంభీం, అల్లూరి సీతారామ రాజుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ సినిమాలో చూపించారని దీపికా చెప్పింది. ఇంకా మాట్లాడుతూ.. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ఈపాటకి యూట్యూబ్, టిక్​టాక్, ఇన్​స్టాగ్రామ్​లలో లక్షల కోట్ల వ్యూస్ సంపాదించుకోగా, ఇప్పుడు ఆస్కార్ అవార్డు ని కూడా సంపాదించుకుంది అని అన్నది. ఏకంగా ఆస్కార్ అవార్డు కి నామినేట్ ఆయిన మొదటి ఇండియన్ పాటగా చరిత్ర సృష్టించింది అని చెప్పింది. మీకు నాటు గురించి తెలుసా..? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పుడు నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ రాబోతోంది. చూసి ఎంజాయ్ చేయండి.” అంటూ ఆస్కార్ వేదికపై దీపికా నాటు నాటు పాటను ఇంట్రడ్యూస్ చేసింది.

See also  Upasana : ఆడబడుచులని ఆ విషయంలో నిరాశ పరిచిన ఉపాసన!

deepika-padukone-interduced-natu-natu-song-in-oskar-awards

అయితే దీపికా నాటు నాటు పాటని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి వచ్చినప్పుడు చాలా హుందాగా ఎంటర్ అయ్యింది. అయితే భారతదేశం నుంచి తొలి సినిమా పాట అని చెప్పేటప్పుడు ఆమె ముఖంలో ఆనందం, తాను మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న మన ఇండియన్స్ చప్పట్లు, ఆనందాన్ని చూస్తూ ఆమె అనౌన్స్ చేసే తీరు చాలా కన్నులవిందుగా ఉంది. ఆమె ఆ సినిమా పేరుని అనౌన్స్ చేసేటపుడు, అటు ఇటు మన వాళ్ళని చూస్తూ.. ఆనందంగా చెప్పింది. అలాగే ఆ సినిమాలో ఆ పాట ప్రాధాన్యం, సోషల్ మీడియాలో ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి ఆమె చెప్పినప్పుడు ఆమె ప్రౌడ్ తో కూడిన నవ్వు చూసి, భారతీయులు అందరికీ ప్రౌడ్ గా అనిపించింది. నాటు గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు అని దీపికా చెప్పినప్పుడు, మనవాళ్ళ కేరింతలు చెప్పట్లు మామూలుగా లేవు.

See also  Samantha : ఆ అనారోగ్యంతో సమంత నటనకు గుడ్ బాయ్ చెబుతూ.. కన్నీటితో ఒక్కసారి..

deepika-padukone-interduced-natu-natu-song-in-oskar-awards

ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ లో దీపికా నాటు నాటు పాటని ఇంట్రడ్యూస్ చేసిన వీడియో ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి చూసి, మీకెలాంటి ఫీలింగ్ కలిగిందో కామెంట్స్ చెయ్యండి.