Home Cinema Colors Swathi: త్వరలో కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందా.? ఇందులో ఉన్న నిజమెంత.

Colors Swathi: త్వరలో కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందా.? ఇందులో ఉన్న నిజమెంత.

Colors Swathi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో ఇష్టంతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అందులో కొన్ని జంటలు మాత్రమే చివరి వరకు వెలుతుంటాయి. కానీ మరికొన్ని జంటలు మాత్రం ఎందుకు విడిపోతున్నారో తెలియదు. ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో జంటలు పెళ్లిళ్లు చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటూ కొన్ని సంవత్సరాల పాటు సంసార జీవితాన్ని గడిపి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు సడన్ గా విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవలే పలువురు సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకొని వార్తల్లో నిలువగా ప్రస్తుతం మరొకరు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో..

colors-swathi-is-also-going-to-divorce-soon-how-true-is-it

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొంది.. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా కూడా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి డివోర్స్ తీసుకోబోతుందని వార్తలు ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్నాయి. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రంలో వెంకటేష్ కు మరదలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కలర్ స్వాతి. ఇక ఆ తర్వాత అష్టా చమ్మా చిత్రంలో మంచి నటన ప్రతిభను కనబరిచినందుకు నంది అవార్డు వరించింది. కేవలం తెలుగులోనే కాకుండా పలు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. అలా పాపులాటిని కైవసం చేసుకున్న అనంతరం స్వామి రారా, కార్తికేయ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

See also  Skanda: స్కంద ఈవెంట్ లో భాగంగా రామ్ పోతినేని గురించి ఓ సీక్రెట్ వెల్లడించిన నటసింహం బాలయ్య..

colors-swathi-is-also-going-to-divorce-soon-how-true-is-it

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా తన భర్త వికాస్ కు దూరంగా ఉంటుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి వార్తలు రావడానికి అసలు సిసలైన కారణమేంటంటే ఇటీవలే కలర్ స్వాతి ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో నుండి తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలు డిలీట్ చేసుడు ఏందో గాని అప్పుడు సమంత నాగచైతన్యలు విడిపోయే ముందులా కూడా ఇలాగే మొన్న నిహారిక చైతన్య జోన్నలగడ్డలు కూడా విడిపోయే ముందు ఇలాగే ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒకరికి ఒకరు ఫోటోలు డిలీట్ చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కలర్ స్వాతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భర్త ఫోటోలు డిలీట్ చేయడంతో ఒక్కసారిగా తను కూడా విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా..

See also  Pawan kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్..

colors-swathi-is-also-going-to-divorce-soon-how-true-is-it

యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ వేసి మరి ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. కలర్స్ స్వాతికి ఇదేమి కొత్త కాదు గతంలో కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడంతో ఆ వార్తలకు తను వెంటనే చెక్ పెట్టేసింది. కాగా ప్రస్తుతం కలర్ స్వాతి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ సినిమాలు చేయడానికి సిద్ధమవుతుందంటూ తెలుస్తోంది. ఆమె భర్త మాత్రం థాయిలాండ్ లోనే ఉన్నాడంటూ ప్రచారమైతే జరుగుతున్నది. మరి ఈ వార్తలు నిజం ఎంత ఉండేది తెలియదు కానీ గతంలో లాగా మళ్లీ కలర్స్ స్వాతి (Colors Swathi) స్పందిస్తే తప్ప అసలు నిజం ఏంటనేది మనకు తెలుస్తుంది.