Home Cinema Chiranjeevi-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ కి చిరంజీవి ఆ వ్యక్తిని క్షమాపణ...

Chiranjeevi-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ కి చిరంజీవి ఆ వ్యక్తిని క్షమాపణ ఇలా అడిగారంట!

chiranjeevi-told-sorry-to-that-person-because-of-pawan-kalyan-mistake

Chiranjeevi-Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటే ఎంతోమందికి ఇష్టం, గౌరవం అన్ని ఉన్నాయి. మెగా కుటుంబం మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడిగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా వీళ్ళ ముగ్గురు ఒకరు సినిమాల్లో మెగాస్టార్ అయ్యి.. ఇంకొకరు ( Chiranjeevi and Pawan Kalyan ) పవర్ స్టార్ అయ్యి.. ఇంకొకరు మెగా బ్రదర్ గా చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. అలాగే చిరంజీవి కొంతకాలం రాజకీయాల్లోకి వచ్చి.. తర్వాత దూరమవ్వగా.. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ.. సినిమాలు చేస్తూ.. ఇలా ముగ్గురు అన్నదమ్ములు ఎవరికి తోచిన దారుల్లో వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నారు.

chiranjeevi-told-sorry-to-that-person-because-of-pawan-kalyan-mistake

వీళ్ళ ముగ్గురు ఒక్కొక్క పనిలో ఒక్కొక్క దారిలో బిజీగా ఉన్నప్పటికీ.. వాళ్లలో వాళ్లకు కుటుంబానికి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒకటిగానే ఉంటారని అంటారు. అలాంటి సంఘటన ఒకసారి మెగాస్టార్ చిరంజీవి లైఫ్ లో జరిగిందంట. మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ఒక ఇల్లు కొనుక్కొని ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడకి ( Chiranjeevi and Pawan Kalyan ) తీసుకొని వెళ్లి.. చిరంజీవి చెన్నై దగ్గర్లో ఎక్కడో ఒక షూటింగ్ షూటింగ్ వెళ్లి వస్తూ ఉండేవాడంట చిరంజీవి. తన కారులో డ్రైవర్ పెట్టుకుని వెళ్లి వచ్చే టైం లో.. ఆ దగ్గరలో ఒక గ్యాంగ్ చిరంజీవి డ్రైవర్ దగ్గర చిరంజీవి గారిని ఏదో ఒకటి అంటూ.. చిరంజీవిని డిస్టర్బ్ చేస్తూ ఉండేవారట. కానీ చిరంజీవి వాళ్ళను అసలు పట్టించుకోవద్దని.. పట్టించుకోవాల్సిన పనిలేదని వదిలేసి ఆయన పని ఆయన చూసుకునేవారు అంట. అలాంటి టైంలో ఆ డ్రైవరు పవన్ కళ్యాణ్ కి చెప్పాడంట.

See also  Adipurush : ఆదిపురుష్ పై ఇన్ని నెగటివ్ కామెంట్స్ రావడానికి కారణం ప్రభాస్ నిర్ణయమా?

chiranjeevi-told-sorry-to-that-person-because-of-pawan-kalyan-mistake

దీంతో పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చి.. వాళ్ళ దగ్గరికి వెళ్లి గొడవాడంట. మా అన్నని పట్టుకొని మీరు మాట్లాడతారా అని అంటూ.. పెద్దగా గొడవ చేసాడంట. ఆ గ్యాంగ్ అందరితో గొడవ పడే క్రమంలో.. వాళ్ల గ్యాంగ్ లో ఒక నెంబరు కుప్ప స్వామి అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా కొట్టడంట. దీంతో ఆ వ్యక్తికి గాయాల తగలాయంట. ఈ విషయం ( Chiranjeevi and Pawan Kalyan ) తెలుసుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ తరఫున సారీ చెప్పి వచ్చాడంట. వచ్చి పవన్ కళ్యాణ్ ని గట్టిగా చిరంజీవి తిట్టారంట. ఎందుకు నువ్వు వెళ్లి అతన్ని అలా కొట్టావు అని.. ఎందుకంటే మిమ్మల్ని అంటే ఊరుకోవాలా అని అడిగాడంటపవన్ కళ్యాణ్. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు వాటిని మనం పట్టించుకోకూడదు అని చిరు మందలించారట.

See also  Naga Chaitanya: మొట్ట మొదటి సారి సమంతతో విడాకుల విషయంలో నోరు విప్పి సంచలనమైన విషయాలు వెల్లడించిన చైతు..

chiranjeevi-told-sorry-to-that-person-because-of-pawan-kalyan-mistake

చిరంజీవి చాలా బాధ్యత, భద్రత, క్షేమం కోరుకునే వ్యక్తి. ఎవరితోనూ గొడవలకి వెళ్లడు. పవన్ కళ్యాణ్ తనకు నచ్చినట్టు.. ఎదుటి వాళ్ళని ఎదిరించే గుణం ఉన్న వ్యక్తి .. అయినా కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని మందలించి.. పవన్ కళ్యాణ్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి.. అక్కడ ఆ కుప్ప స్వామి అనే అతన్ని పలకరించి.. పవన్ కళ్యాణ్ తో క్షమాపణ చెప్పించి.. అతని హాస్పిటల్ ఖర్చులు, అవన్నీ చిరంజీవి పెట్టి.. పవన్ ని తీసుకొని వచ్చారంట. అన్న మాట కాదనలేక.. చిరంజీవి ఎలా చెప్తే పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోయినా కూడా అలాగే చేశాడంట. ఇలా చిరంజీవి మొదటి నుంచి కూడా సౌమ్యమైన మనసు కలిగిన వాటిని ఎక్కడా కూడా ఎవరిమీద నెగిటివ్గా ఎక్కువ కామెంట్స్ కూడా చేయడు. కానీ నాగబాబు, పవన్ కళ్యాణ్ అలా కాదు వీళ్ళిద్దరికీ కొంచెం కోపం తొందరగానే వస్తుంది. నాగబాబు నోటితో సమాధానం చెప్తే.. పవన్ కళ్యాణ్ ఇంకా సూటిగా వెళ్ళిపోయి గొడవ పడి సమాధానం చెప్పాలనుకుంటాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది..