Home Cinema Chiranjeevi : చిరంజీవికి క్యాన్సర్.. ఈ ప్రచారం వెనుక దారుణమైన నిజం ఇదే..

Chiranjeevi : చిరంజీవికి క్యాన్సర్.. ఈ ప్రచారం వెనుక దారుణమైన నిజం ఇదే..

chiranjeevi-reacted-to-his-false-cancer-news

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే.. తెలుగు సినీ అభిమానులకి ఎంతో అభిమానం, గౌరవం కూడా. ఒక్కడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఈరోజు అనంతంగా ఎదిగి, ఎందరినో ఈ రంగంలో నిలబడడానికి ( Chiranjeevi reacted to his ) కారకుడైన చిరంజీవి.. కేవలం తన కెరియర్, తన కుటుంబం మాత్రమే చూసుకోకుండా.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి.. ఎందరినో చావు నుంచి తప్పించేలా సాయపడిన మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా.. అలాగే ఆయన కుటుంబం నుంచే ఎందరో మెగా హీరోలు ఉన్నప్పటికీ కూడా.. ఇప్పటికీ ఆయన ఎంతో వినయంగా, గౌరవంగా ఎదుటివారితో మాట్లాడే ఆయన గుణమే.. ఆయన సక్సెస్ కి కారణం అని అనిపిస్తాది.

chiranjeevi-reacted-to-his-false-cancer-news

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏదో ఒక అబద్ధపు ప్రచారాలు గాని, రూమర్స్, అపోహలో వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని వార్తలు లో నిజం లేకపోయినా.. వినడానికి, చూడ్డానికి బాగుంటాయి.. సరదాగా నవ్వుకోడానికి ఉపయోగపడతాయి. కానీ కొన్ని వార్తలు మనుషులను కంగారు పెట్టడమే కాకుండా.. బాధను కూడా ( Chiranjeevi reacted to his ) కలిగిస్తాయి. అలాగే ఇటీవల చిరంజీవికి క్యాన్సర్ అని.. ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కోల్కున్నారని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే చిరంజీవికి క్యాన్సర్ అనగానే.. మెగా అభిమానులు మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కన్నీటితో వాళ్ళ హీరోకి ఇంత పెద్ద రోగం రావడం ఏమిటని బాధతో నలిగిపోయారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవికి ఎటువంటి క్యాన్సర్ లేదు. దాని మీద ట్రీట్మెంట్ జరగలేదు.

See also  స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

chiranjeevi-reacted-to-his-false-cancer-news

చిరంజీవి క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా.. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని కొన్ని మాటలు మాట్లాడారు. వ్యసనాలు లేనంత మాత్రాన క్యాన్సర్ రాకుండా పోదని.. అది శరీరంలో ఉండే లక్షణాలను ( Chiranjeevi reacted to his ) బట్టి వస్తాదని ఆయన చెప్పుకొచ్చారు. తాను కూడా క్యాన్సర్ వచ్చిందని అనుమానంతో ఏజీ హాస్పిటల్స్ లో కొన్ని టెస్టులు చేయించుకున్నానని.. అక్కడ పాలిప్స్ ఉన్నట్లు గుర్తించారని.. వెంటనే చికిత్స చేసి తొలగించారని చెప్పారు. అయితే ఈ మాటని మీడియా వాళ్ళు నేను క్యాన్సర్ బారిన పడ్డానని.. చికిత్స అయిన తర్వాత బాగానే ఉన్నానని.. వార్తలు ప్రచారం చేశారు. ఇలా లేనిపోని వార్తలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని చిరంజీవి గారు గట్టిగా ఇచ్చారు.

See also  Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ ఏకైక సినిమాలో స్పెషల్ ఏమిటో తెలుసా?

chiranjeevi-reacted-to-his-false-cancer-news

క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్గా మెడికల్ చెక్ అప్ చేయించుకోవాలని చిరంజీవి గారు చెప్పారు. నేను అలర్ట్ గా ఉండి కొలనోస్కోప్ టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి.. అందులో నాన్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేసి తీసేసారని చెప్పారు. అలా ముందుగానే జాగ్రత్త పడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని వైద్యులు చెప్పారని చెప్పారు. కేవలం చిరంజీవి.. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం కోసం క్యాన్సర్ గురించి మాట్లాడితే.. దానితో ఆయన క్యాన్సర్ ఉందని ప్రచారం చేయడం చాలా దారుణం. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయితే.. దాని ద్వారా వచ్చే డబ్బు సంపాదన కోసమో.. లేక యాంటీ మెగా అభిమానులు చేసిన ప్రచారమో అవ్వాలి తప్ప.. చిరంజీవి గారికి ఏమి జరగలేదు.