Home Reviews Anni Manchi Sakunamule : అన్నీ మంచి శకునములే సినిమాలో ఎవరి మధ్య కెమిస్ట్రీ చూడాలంటే.....

Anni Manchi Sakunamule : అన్నీ మంచి శకునములే సినిమాలో ఎవరి మధ్య కెమిస్ట్రీ చూడాలంటే.. రివ్యూ మరియు రేటింగ్.

anni-manchi-sakunamule-movie-review-and-rating

సినిమా: అన్నీ మంచి శకునములే ( Anni Manchi Sakunamule Review )
నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేశ్, గౌతమి
రచన : నందినీ రెడ్డి
సంగీతం: మిక్కీ జె. మేయర్
కెమెరా: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: జునైద్
నిర్మాత: స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌
దర్శకత్వం: నందినీ రెడ్డి

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్ గా.. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అన్నీ మంచి శకునములే అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకుంది. ఓ బేబీ సినిమా తరవాత నందిని రెడ్డి తీసిన ఈ సినిమా పై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందొ కథలోకి వెళ్లి చూద్దాం..

కథ.

విక్టోరియా కాలంలో ఒక కాఫీ ఫ్యాక్టరీ గురించి మొదలయిన ఒక గొడవ ఆధారంగా సినిమా మొదలవుతాది. ఆ గొడవ కోర్ట్ లో మూడు తరాల నుంచి నడుస్తూ ఉంటాది కానీ అది తేలదు. మూడవ తరం వారసులుగా ప్రసాద్ ( రాజేంద్రప్రసాద్) దివాకర్ ( రావు రమేష్ ) ఉంటారు. వీళ్ళిద్దరూ తాతల గొడవల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రసాద్ భార్య మీనాక్షి ( గౌతమి). ప్రసాద్ జాతకాలను ఎక్కువగా నమ్ముతాడు. దివాకర్ కి పెళ్లి కాదు. అతని తమ్ముడి కుటుంబం సుధాకర్ ( నరేష్ ) కుటుంబాన్ని దివాకర్ తన కుటుంబంలా చూసుకుంటాడు. ప్రసాద్ కి ఇద్దరు ఆడపిల్లలు. సుధాకర్ కి పిల్లలు లేక ఒక అమ్మాయిని పెంచుకుంటాడు. తరవాత ప్రసాద్ మరియు సుధాకర్ ఇద్దరి భార్యలు కడుపుతో ఉండగా.. డెలివరీ కి ఒకే డాక్టర్ జగదాంబ( ఊర్వశి ) దగ్గరకి వెళ్తారు. డెలివరీ లో ప్రసాద్ కూతురు సుధాకర్ కి, సుధాకర్ కొడుకు ప్రసాద్ కి మారిపోతారు. ప్రసాద్ తనకి కొడుకు పుట్టాడని, అక్కడ నుంచి అంతా కలిసి వస్తుందని ఆనందంలో ఉంటాడు. కొడుక్కి ఋషి ( సంతోష్ శోభన్) అని పేరు పెడతాడు. సుధాకర్ తన కూతురికి ఆర్య ( మాళవిక నాయర్ ) అని పేరు పెడతారు. ఋషి, ఆర్య చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యి.. ఒక కారణం వలన ఇద్దరూ దూరం అవుతారు. అక్కడ నుంచి సినిమా లో ఆ పిల్లలు ఇద్దరూ ఎలా పెరిగారు? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటాది? రెండు కుటుంబాలకి వాళ్ళ పిల్లలు మారిపోయారని తెలుస్తుందా? కోర్ట్ గొడవ ఏమౌతాది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

anni-manchi-sakunamule-review-and-rating

సినిమా ఎలా ఉందంటే.. ( Anni Manchi Sakunamule Review )

సినిమా మొదలు రెండు కుటుంబాల మధ్య కోర్టు గొడవలు పైగా అన్ని తరాల నుంచి అంటూ స్టార్ట్ అవ్వడం ఎప్పుడూ ఉంటె రొటీన్ కథ మూలం అనిపించినా, ఎందుకో కొంచెం ఏదైనా డిఫరెంట్ గా చూపిస్తారని అనిపించింది. ఎప్పుడైతే హాస్పిటల్ లో పిల్లలు మారిపోతారో అక్కడ ప్రేక్షకుడు వామ్మో చాలా మామూలు పాత రొటీన్ స్టోరీ అని ఫిక్స్ అయిపోతాడు. అయినా వచ్చిన స్టోరీనే మళ్ళి మళ్ళి తీయడం, చూడటం మన సినిమా వాళ్ళకి ప్రేక్షకులకి కొత్త ఏమి కాదు కాబట్టి.. పోనీ సినిమాలో సీన్స్ బాగుంటాయేమో అని సినిమా చూస్తూ ఉంటాడు. సినిమాలో స్టార్టింగ్ లోనే టైటిల్ సాంగ్ వస్తుంది. అది బాగానే ఉంది అనిపించుకుంది. ఈ సినిమాకి రెండు మూలాలు అని అనిపిస్తుంది. ఒకటి మూడు తరాల నుంచి కోర్టు గొడవ, రెండు హీరో హీరోయిన్ పుట్టగానే మారిపోవడం.

See also  Bichagadu 2 Review and Rating : డబ్బున్నోడు లేనోడు కూడా కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్.. బిచ్చగాడు 2 రివ్యూ మరియు రేటింగ్..

ఈ రెండు పాయింట్స్ ని హైలెట్ చేస్తూ.. వాటి గురించి సినిమా నడిపించాలని దర్శకురాలు ఫిక్స్ అయ్యిందని అర్ధమవుతూ ఉంటాది. హీరో, హీరోయిన్ వీళ్లిద్దరి జర్నీ ని నాలుగు భాగాలుగా చూపించింది నందిని రెడ్డి. చిన్నప్పుడు ఇద్దరూ కలవడం మంచి స్నేహితులు అవ్వడం.. ఆ తరవాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలతో విడిపోయివడం, ఆ తర్వాత కొన్నేళ్ళకు మల్లి ఇద్దరూ క్లోజ్ అవ్వడం, మల్లి విడిపోవడం, ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళి దగ్గరవ్వడం మళ్ళి విడిపోవడం, ఇలా నాలుగు సార్లు జరుగుతుంది. ఇది చదువుతుంటే మీకు ” అలా మొదలయ్యింది ” , ” ఏటో వెళ్ళిపోయింది మనసు ” సినిమాలు గుర్తుకువస్తున్నాయి కదా? కానీ అలా పోల్చుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు నందిని రెడ్డి. ఎందుకంటే అలామొదలయింది లో ( Anni Manchi Sakunamule Review ) కలిసిన ప్రతీసారి మంచి స్నేహం వాళ్ళిద్దరి మధ్య కనిపిస్తాది. ఒక రకమైన చనువు నాని, నిత్యామీనన్ ల మధ్య కనిపిస్తాది. ఆ కెమిస్ట్రీ చాలా బాగుంటాది. అలాగే ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నాని, సమంత మధ్య కలిసిన ప్రతీసారి లవ్ ట్రాక్ తో కూడిన అట్రాక్షన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతాది. ఈ సినిమాలో అలాంటివి ఏమి లేవు.

anni-manchi-sakunamule-review-and-rating

హీరో సంతోష్ శోభన్ తన మట్టుకు తాను బాగానే నటించాడు. అలాగే హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్రలో తనకు చక్కగా చాలా బాగా చేసింది. కానీ వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాలేదు అని చెప్పడానికి అవకాశం లేదనే అనుకోవాలి. ఎందుకంటే అసలు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుందా లేదా అని చెప్పాలంటే.. వాళ్ళిద్దరి మధ్య మంచి సీన్స్ రాయాలి కదా? అప్పుడు ప్రేక్షకుడు ఆ సీన్స్ ఎలా పండాయో, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందొ చెబుతాడు. సినిమా మూల కథనే రొటీన్ గా ఎన్నుకున్న నందిని రెడ్డి.. కనీసం అదే రొటీన్ గా ఇలాంటి సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కచ్చితంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉండాలని గుర్తించి ఉంటె.. సినిమాని రొటీన్ గా మన వాళ్ళు కచ్చితంగా హిట్ చేసేద్దురు. కానీ అలా జరగలేదు.

See also  Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..

పోనీ వీళ్ళిద్దరితో పని లేదు, రెండు కుటుంబాల మధ్య కెమిస్ట్రీని చూపిద్దామని అనుకున్నదా? అని అనుకుంటే.. అసలు ఆ రెండుకుటుంబాలకి ఎలాంటి స్నేహం గాని, పర్సనల్ గా ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన హిస్టరీ గాని కథలో లేదు. సినిమా మూలాలుగా అనుకుంటున్న రెండు పాయింట్స్ ని ఎలా సాల్వ్ చేసి చూపిస్తాదని ప్రేక్షకుడు కొంచెం సహనంగా చూస్తే.. కోర్టు సమస్య ఎదో అలా తేల్చి.. పిల్లలు మారారు అనే విషయం తేలుస్తాదా? తెలిస్తే ఎవరి ద్వారా? లేక ఎలా తెలుస్తాది? అందులో నందిని రెడ్డి ఏమైనా కొత్తదనాన్ని చూపిస్తాదా అని ( Anni Manchi Sakunamule Review ) ఎదురు చూస్తే.. అది మరీ దారుణమైన రొటీన్ గా చూపించింది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో కొంత భాగం చిన్నప్పటి స్టోరీ తో నడవగా.. తరవాత వాళ్ళ మెంటాలిటీస్ చూపిస్తూ చాలా స్లో గా నడిచింది.

హీరో, హీరోయిన్ కలిసినప్పుడు ఆనందం గాని, విడిపోయినప్పుడు బాధ గాని ప్రేక్షకులకు కలగలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత గొప్ప కెమిస్ట్రీ లేదు కాబట్టి. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా చప్పగా ఉంది. పాటలు ఒకటి రెండు తప్ప మిగిలినవి పెద్దగా లేవు. ఇక నటీనటుల పరంగా చూస్తే.. హీరో సంతోష్ శోభన్ బాగానే నటించాడు పరవాలేదు అనిపించుకున్నాడు. హీరోయిన్ మాళవిక నాయర్ హీరోని డామినేట్ చేసేలా బాగా నటించింది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ తన పాత్రను తాను ఎప్పటిలానే చాలా బాగా నటించాడు. చాల న్యాచురల్ గా ఆయన తన పాత్రలో ఇమిడిపోయారు. గౌతమి ఈ సినిమాలో హీరో తల్లిగా చాలా బాగా చేసింది. ఆమెను చూస్తే రియల్ లైఫ్ లో అమ్మలా చాలా నిమ్మదిగా, మాట్లాడే తీరు, ఆమె క్యారక్టర్ ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. హీరో మరియు గౌతమి మధ్య తల్లి కొడుకుల కెమిస్ట్రీ చాలా బాగుంది.

వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్ గా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఓ బేబీ సినిమాలో రావు రమేష్ కి చాలా మంచి పాత్ర ఇచ్చిన నందిని రెడ్డి ఈ సినిమాలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చింది కానీ, అతని నటనా ట్యాలంట్ ని మొత్తం లాక్కుని చూపించే సీన్స్ రాసుకోలేకపోయింది. నరేష్ ఈ సినిమాలో ఎప్పటిలానే బాగానే నటించాడు. అలాగే నరేష్ తన కూతురు ఆర్య మధ్య కెమిస్ట్రీ బాగానే ఉంది. అలాగే రాజేంద్రప్రసాద్ మరియు హీరోయిన్ మధ్య తండ్రి కూతుర్లు అని తెలియకపోయినా.. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. ఇక సినిమాలో హీరో మొదటి నుంచి హీరోయిన్ ని ప్రేమిస్తున్నట్టు చూపిస్తారు కాబట్టి దానిమీద ఒక క్లారిటీ ఉంది. కానీ, హీరోయిన్ హీరో ప్రేమని తెలుసుకున్న తరవాత ఆమె అతడిని ప్రేమించిందా? లేదా? ఒకవేళ ప్రేమిస్తే.. ఎప్పటి నుంచి ఎలా ప్రేమపుట్టిన్ది అనే దాని గురించి అస్సలు ఒక మంచి క్లారిటీ ఇవ్వలేకపోయింది దర్శకురాలు. ఆ సబ్జెక్టు ని అలా గాలికి వదిలేసినట్టు ఉంది.

See also  Dasara movie review and rating: దసరా రంగస్థలం పుష్ప మూడింటికి తేడా ఇదే.. దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్..

ఇన్ని మైనస్ లు ఉన్న ఈ సినిమాలో లాస్ట్ 20 నిముషాలు చాలా బాగా సాగింది. అందులో కొత్తదనం మాత్రం ఏమి లేదు కానీ, రొటీన్ అయినప్పటికీ.. ఆ టైం లో అందరి హావభావాలు, నటన, డైలాగ్స్ అన్నీ ప్రేక్షకుల కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చేలా చెయ్యడంలో నందిని రెడ్డి సక్సెస్ అయ్యింది. స్టోరీ లో గాని, సీన్స్ లో గాని కొత్త మలుపు ఏమి లేకపోయినా.. అల వైకుంఠపురం లాంటి పెద్ద స్టార్స్ , డైరక్టర్ ఉన్న సినిమాలో ఆ ట్విస్ట్ తెలిసిన తరవాత ఎవరి పాత్రని చూసి ( Anni Manchi Sakunamule Review ) ఎవ్వరూ కన్నీళ్లు పెట్టలేదు కానీ.. ఈ చిన్న సినిమాలో సినిమా అంతా చాలా రొటీన్ గా ఉన్న.. లాస్ట్ లో మాత్రం ప్రేక్షకుడు కళ్ళలో నీళ్లు రావడం ఒక్కటే ఈ సినిమాలో హైలెట్ ప్లస్ పాయింట్. అంటే ఈ సినిమాలో ఏ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయినా చక్కగా కుదిరింది కానీ, కేవలం హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఒక్కటే కుదరకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా క్లైమాక్స్ అయితే.. హీరో హీరోయిన్ ఎలా కలుస్తారు అని ఎదురు చూస్తే.. చాలా సింపుల్ గా తేల్చేసింది.

anni-manchi-sakunamule-review-and-rating

ఈ సినిమా లో హీరో హీరోయిన్ ని ఇష్టపడటానికి చూపించిన రీజన్ చాలా బాగుంటుంది. అలాగే హీరోయిన్ కూడా హీరోని ఎందుకు ఇష్టపడతాదో లాస్ట్ వరకు మంచి రీజన్ నందిని రెడ్డి చూపిస్తాదని.. ప్రేక్షకుడి ఎదురు చూపు అలానే మిగిలిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసి.. సగటు ప్రేక్షకుడు ఇద్దరు ప్రేమికుల, రెండు కుటుంబాల స్టోరీ ని ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవ్వడానికి వెళ్తాడు. కానీ.. దర్శకురాలు నందిని రెడ్డి వాటిని బేస్ చేసుకుని.. తల్లితండ్రులకి పిల్లల మీద వాళ్ళని కన్నా, పెంచినా అలాగే పిల్లకి వాళ్ళ మీద ఉండే ఒక సెన్సిటివ్ ఫీల్ ని చూపించాలని అనుకుంది. దాని మీదనే ఎక్కువ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ నందిని రెడ్డి ఆ పాయింట్ మీద ఎక్కువ వర్క్ చేయడం ననిజమైతే ఆమె ఆ పాయింట్ లో సక్సెస్ అయినట్టే. కానీ సినిమాని మొత్తంగా చూస్తే మాత్రం చాలా రొటీన్ సినిమాగా, చాలా స్లో సినిమాగా యావరేజ్ కి చాలా దగ్గరగా ఉంది అంతే..

రేటింగ్: 2/5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..