Home Cinema Sangeetha: భర్తతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న సంగీత.. కారణం అదేనట..

Sangeetha: భర్తతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న సంగీత.. కారణం అదేనట..

Sangeetha: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు సంగీత. అద్భుతమైన అభినయం, చూపులు తిప్పుకోలేని అందం ఈమె సొంతం. ‘గంగోత్రి’ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగీత (Sangeetha About Husband), ఆ తర్వాత తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా హీరోయిన్ గా సుమారు రెండు దశాబ్దాలు రాణించిన సంగీత ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా మారింది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ పెళ్ళిలో వేళా కోట్లు గురించి పచ్చి నిజాన్ని బయట పెట్టిన స్నేహ రెడ్డి తండ్రి..

sangeetha-comments-about-her-married-life

క్యారక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక ఆమెకి మరిన్ని గొప్ప పాత్రలు వచ్చాయి. ఇప్పటికీ ఆమె మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది లో ఆమె నటించిన ‘వారసుడు’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ప్రముఖ సింగర్ క్రిష్ ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎవరికీ యిష్టం లేదు, దాంతో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా పెళ్ళైన కొత్తలో సంగీత (Sangeetha About Husband) ఎలాంటి ఇబ్బందులకు గురైందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

See also  Naresh-Pavitra: మేము పిల్లలని కనడానికి ఫిట్ అంటూ.. పబ్లిక్ గా ఆ నిజం చెప్పేసిన నరేష్ పవిత్ర!

actress-sangeetha

ఆమె మాట్లాడుతూ ‘మా ఇద్దరి రంగాలు మాత్రమే కాదు, మా ఆలోచనలు, ఇష్టాలు అన్నీ కూడా డిఫరెంట్. తనకి నచ్చేవి నాకు నచ్చవు , నాకు నచ్చేవి తనకి నచ్చవు,ఇందువల్ల మా ఇద్దరి మధ్య చాలా గొడవలు ఏర్పడ్డాయి. పెళ్ళైన కొత్తల్లో అయితే నరకం చూసి ఇక వైవాహిక జీవితం కొనసాగించడం నా వల్ల కాదు, విడాకులు తీసుకుందాం అనుకున్నాను. కానీ చిన్నగా ఒకరినొకరం అర్థం చేసుకున్నాము,మా ఇద్దరి ఇష్టాలు కొన్ని రోజుల తర్వాత ఒక్కటయ్యాయి. నేనెప్పుడైనా విడిపోవాలి అని గొడవ చేసినప్పుడు, ఉన్న ఒకేఒక్క ఈ జీవితం లో మనల్ని ప్రేమించే వారు దొరకడం చాలా కష్టం, అలాంటోళ్లను మిస్ అవ్వొద్దు అని నాకు ఆయనే మోటివేషన్ ఇచ్చేవాడు.

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా స్టోరీ అదిరిపోయే సీన్స్ తో ఇదేనంట..

sangeetha-actress

తనకి తన మీద ఉన్న ప్రేమకంటే కూడా నా మీద ఉన్న ప్రేమనే ఎక్కువ. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది సంగీత, ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. సంగీత ఈ మధ్య కాలం అసలు తెలుగు సినిమాలో కనిపియ్యటం చాల తక్కువ ఐపోయింది, ఎన్ని ఏళ్ళ తరువాత మొన్న రిలీజ్ అయిన వారసుడు సినిమాలో కనిపించి ఇంకా తాను బతికే ఉన్నన్ని ఫాన్స్ కి చెప్పింది సంగీత. ఇంత అందం టాలెంట్ ఉన్న సంగీత మరెన్నో సినిమాలో చేయాలనీ ఆశిస్తున్నారు అభిమానులు.