బాదాం పప్పు తో ప్రయోజనాలు ఎన్నో చూద్దామా.?
బాదం గింజల్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత వీటి వినియోగం చాలా పెరిగింది. కోవిడ్ కి ముందు, కోవిడ్ కి తర్వాత డ్రై ప్రూట్స్ యొక్క వాడకం కోవిడ్ సమయంలో చాలా చాలా పెరిగింది. బాదం లో ముఖ్యంగా ఉన్న విటమిన్ E, ఫైబర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ మెండుగా ఉన్నాయి. నిత్యం క్రమం తప్పకుండా నానపెట్టిన బాదం పప్పులను తినడం వలన మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం తినే ఆహారంలో డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి చూసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంపప్పు తినడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బాదంను రోజూ తప్పక ఎంతో కొంత పరిమాణంలో తినాలి. కొంతమంది బాగుంటాయి గా అని కుమ్ముడే ఇగ తింటనే ఉంటరు అలా తినకూడదు, ఏదైనా ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చేదైనా తగు పరిమాణంలో తీసుకుంటేనే మంచిది. అధికంగా తింటే కష్ఠాలు తప్పవు మనకు.
బాదం రోజు తగినన్ని ఐదు లేదా ఆరు తింటే ఉండదు మన హెల్త్ కి ముప్పు. బాదం తింతే మన తెలివి తేటలు పెరిగి బుర్ర బాగా యాక్టీవ్ గా పనిచేస్తుంది. రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ పప్పుని తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలుంటాయి. బాదంను నేరుగా తినవచ్చు లేదా తీపి వంటకాల్లో మరియు పిండివంటకాల్లో ఉపయోగిస్తారు. రక్తపోటు ఉన్న వారికి బాదం చాలా ప్రయోజనకరం.! ఎందుకంటే ఇవి నాడీ వ్యవస్థ పై మరియు కండరాలు మెరుగ్గా నడుచుకోవడానికి ఉపయోగపడతాయి. న్యూట్రిషియన్స్ చెప్పిన ప్రకారం నానబెట్టిన బాదంని తినడం వల్ల మాములు బాదం కంటే మరింత ఆరోగ్యకరం. ఎందుకంటే రాత్రి మొత్తం నానబెట్టిన బాదంలలో నీళ్ళు దాని పొట్టుపై ఉన్న వివిధ రకాలైన విషపూరితమైన వాటిని తొలగించేస్తుంది.
రాత్రి నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామూ.?
జీర్ణశక్తిని పెంచడం :నానబెట్టిన బాదంను ఉదయాన్నే తినడం వల్ల మొత్తం జీర్ణక్రియను ఈజీగా చేసి స్పీడ్గా జీర్ణప్రక్రియ సులువుగా సాగేలా చేస్తుంది. బాదంపప్పులను నీళ్ళలో నానబెట్టినపుడు పైన పొట్టు తీసివేయడం వల్ల ఈజాగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు దాని నుంచి లభిస్తాయి.
ప్రెగ్నేన్సీ సమయంలో: మీరు కడుపుతో ఉన్నట్లైతే, తప్పకుండా నానబెట్టిన బాదంలను తినాలి. ఎందుకంటే ఇవి మీకు పుట్టబోయే బేబీ ఆరోగ్యానికి చాలా మంచివి. నానబెట్టిన బాదం తల్లికి, బిడ్డకి అన్నిటికంటే ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి. అంతేకాక బాదంలలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే ఎన్నో లోపాలను చాలా వరకు తగ్గిస్తుంది.
మెదడు పనితీరును మెండు: డాక్టర్లు రోజూ ఐదు నుంచి ఆరు బాదంపప్పులు తినడం వలన మన బ్రైన్ కు ఇది టానిక్ లెక్క పనిచేయడమే గాకుండా కేంద్రనాడీ వ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తుంది. అందుకే ఉదయాన్నే బాదం తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి చురుగ్గా మారి, మెదడు పనితీరు మెరగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో : నానబెట్టిన బాదం వల్ల కొలెస్ట్రాల్ అధిక శాతం తగ్గుతుంది. దీనిలో మోనోసాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి అవి మన బాడీలో చెడు కొవ్వులను కరిగిస్తుంది. బాదంలలో ఉండే విటమిన్ E రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
హర్ట్ పదిలంగా : ఇందులో గల ప్రొటీన్, పొటాషియం & మెగ్నీషియం గుండె పదిలంగా ఉండేలా చేస్తాయి. ఇందులో గల యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేసి, తీవ్ర ప్రాణాంతక హర్ట్ రోగాలు పోరాడటంలో సహకరిస్తాయి.
రక్తపోటుకి చెక్ : నానబెట్టిన ఈ పప్పు తినటం వలన అధికంగా ఉండే రక్తపోటును నయం చేస్తుంది, నానబెట్టిన ఈ పప్పుల్లో ఉండే హై పొటాషియం & లో సోడియం రక్తపోటు హేవీగా లేకుండా చేస్తాయి. వీటిల్లో గల ఫోలిక్ యాసిడ్ & మెగ్నీషియం ఉండే రక్తనాళాలు నిండిపోకుండా ఆ ప్రమాదాలను తగ్గిస్తాయి.
బరువు తగ్గడంలో : మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించటానికి నానబెట్టిన బాదంపప్పులను మీ డైట్ లో చేర్చుకోండి. నానబెట్టిన ఈ పప్పుల పై తొక్కు తీయడం వల్ల బరువు తగ్గడంలో వేగవంతం చేస్తుంది. నానబెట్టిన బాదంపప్పులలో మోనోసాచ్యురేటడ్ కొవ్వులు ఉండి మీ ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉంచుతాయి.