
అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణాలేంటి.?
Sudden Heart Attack:
ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం వారానికి కనీసం 2 లేదా 3 సంఘటనలు మనకి కనిపిస్తున్నాయి.
పెళ్లిలో భరాత్ డాన్స్ లలో లేదా ఫ్రెండ్స్ పార్టీల్లో అలాగే ఏదో ఒక డాన్స్ ప్రోగ్రాంలో హఠాత్తుగా మనిషి ఉన్నట్టుండి
అప్పటివరకు మనతో ఆనందంగా ఎగురుతున్న మనిషి కుప్పకూలడం వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోవడం హాస్పిటల్ కి తీసుకుకుని పోయేసరికి ప్రాణాలు వదలడం చాలా న్యూస్ లలో చూస్తున్నాం.
ఈ సంఖ్య సగటున రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. హార్ట్ ఎటాక్ మరణాలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి…
ఆకస్మిక గుండె పోటుకు గల కారణాలు:
హర్ట్ ఎటాక్ కు ఎన్నో కారణాలున్నాయి అందులో ముఖ్యమైనది.
నిద్రలేమి, చాలా మంది సరైన సమయం మన శరీరానికి ఇవ్వడం లేదు ఆఫీసుల్లో వర్క్ బిసీ ముగించుకుని తిరగి ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా ఆఫీస్ పనులతో బిసీ గా ఉంటూ సరైన సమయంలో మన శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం.
మంచి నిద్ర మన శరీరానికి ఇవ్వాలి రోజుకు మన శరీరానికి మినిమం 8 గంటల విశ్రాంతి అవసరం లేనిచో రక్తపోటు పెరిచి మన గుండెకు హని కలగవచ్చు.
తరచుగా తల నొప్పి వస్తే అది ఆఫీస్ పని వల్ల మీకు పనిమీద ఒత్తిడి వల్ల వచ్చిందని ఫీలవ్వకూడదు అది భవిష్యత్తులో హర్ట్ ఎటాక్ గా మారవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
మరి కొన్ని లక్షణాలు బిపీ ఎక్కువగా ఉండడము, షుగర్ లెవల్స్ మరియు అధిక కొవ్వును కలిగి ఉండడము.
అలాగే ఊభకాయం ఉండడము, సరైన ఆహర నియమాలను పాటించకపోవడం ఉదయాన్నే సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం.
అత్యంత ప్రమాదకరమైన విషయం ధూమపానం చేయడం అలాగే మానసిక ఒత్తిడి & నిరంతం పెరిగిపోతున్న పొల్యూషన్ కూడా ప్రధాన కారణం.
వయసు మితిమీరిన వారిలో రావడం అంటే అది సహజమైన విషయమే మరొకటి మన ఇండియన్ రైస్ తినడం వల్ల కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి.
అయితే ప్రధానంగా ఇవి 90% వరకు మన హర్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
రెండు రకాల హర్ట్ ఎటాక్ లు మనలో రావచ్చు హెరిటిక్ & జనిటిక్ మనలో మనకు బంధువులతో సంబంధం లేకుండా వచ్చే హర్ట్ ఎటాక్ హెరిటిక్ అలాగే మన తల్లిదండ్రుల జీన్స్ ద్వారా మనకు వస్తే అది హేరిటిక్.