Home Cinema Mahesh Babu: అలాంటి చిత్రాలలో నటించాలన్న కోరిక ఉందా.? ప్రిన్స్ మహేష్ బాబుకు ?

Mahesh Babu: అలాంటి చిత్రాలలో నటించాలన్న కోరిక ఉందా.? ప్రిన్స్ మహేష్ బాబుకు ?

Prince Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. తొలి చిత్రం రాకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో హీరో గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తన దైన శైలిలో ఎన్నో చిత్రాలలో నటిస్తూ ప్రిన్స్ మహేష్ బాబు గా కోట్లాది ప్రేక్షకులకు సంపాదించుకున్నారు. ఇంకా మహేష్ బాబు నటించిన రాజకుమారుడు తర్వాత మురారి, వంశీ, యువరాజు, బాబి, అర్జున్, ఒక్కడు, సైనికుడు, అతడు, దూకుడు, పోకిరి.. మొదలైనటువంటి చిత్రాలతో మన తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు.

prince-mahesh-babu-want-to-act-in-those-kind-of-movies-what-a-dream

ఇక ఇలాంటి చిత్రాలే కాకుండా పలు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సైన్ చేశాడు మహేష్ బాబు. అందులో ఓ చిత్రమైన నాని లో మేకప్ లేకుండా నిజంగా నిజం సినిమాలో నటించాడు. ఇక ఇదే కాకుండా పోకిరి వంటి సినిమాల్లో రౌడీగా అదరగొట్టి చివరికి అందరికీ షాకిస్తూ పోలీస్ ఆఫీసర్ గా మాస్ ఆడియన్స్ సైతం తన వైపుకు లాగేసుకున్నాడు. ప్రిన్స్ జీవితంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మురారి వంటి చిత్రంతో మరియు రాజకుమారుడు లాంటి ప్రేమ కథ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకున్నాడు. ఇలా మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో ప్రేమ కథ యాక్షన్ ప్రయోగాత్మక చిత్రాలలో నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నాడు.

See also  Sri Mukhi: డబ్బుల కోసం శ్రీ ముఖి ఎంతకైనా భరితెగించేస్తుందా..ఏమైనా చూపిస్తుందా.? పైసామే పరమాత్మ..

prince-mahesh-babu-want-to-act-in-those-kind-of-movies-what-a-dream

ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన పూర్తి భక్తి చిత్రంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక మిల్క్ బాయ్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు వద్దకు వచ్చే కథలన్నీ లవ్ యాక్షన్ వంటి స్టోరీలకు సంబంధించినవే బాగా వస్తుంటాయి. అయితే గతంలో మహేష్ బాబు (Prince Mahesh Babu) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన మనసులో ఉన్న ఈ కోరికను బయటపెట్టాడట. నేను ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి చిత్రాలు నటించాను. కానీ నాగార్జున గారి లాగా నాకు కూడా ఓ భక్తి సినిమాలో చేయాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు నా దగ్గరికి అలాంటి కథ రాలేదంటూ చెప్పుకువచ్చాడు.

See also  MohanBabu: మంచు వారి పెళ్లిలో కన్నీటి పర్యంతరమైన మోహన్ బాబు-భూమా మౌనిక రెడ్డి

prince-mahesh-babu-want-to-act-in-those-kind-of-movies-what-a-dream

ఇక మహేష్ బాబు తన మనసులో ఉన్న ఈ కోరికను బయట పెట్టడంతో మరి రాబోయే రోజుల్లో ఎవరైనా డైరెక్టర్లు మహేష్ బాబు ఏదైనా భక్తి చిత్రం చేయాలనే ముందుకు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. కానీ మహేష్ బాబు నిజంగా భక్తి సినిమాలు నటిస్తే అంతగా సెట్ అవ్వరు అనేది అభిమానుల వాదన. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చూడు యాక్షన్ సినిమాలు ప్రేమ కథ చిత్రాలలో నటించాడు. మిల్క్ బాయ్ లాగా నిగనిగలాడిపోతుంటాడు. మరి భక్తి సినిమాలుసూట్ అవుతుందా లేదా అనేది ఆయనకు తగ్గ స్టోరీ దొరికితే అప్పుడు చూడాలి. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ చిత్రం అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.