Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాప్ తెచ్చుకొని కలెక్షన్స్ బానే రాబట్టింది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నప్పటికీ అంత భారీ సక్సెస్ కాకపోయినా.. మరి డిజాస్టర్ కు మాత్రం వెళ్ళలేదు. పైగా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, డైలాగ్స్ అన్నీ కూడా చక్కగా ( Pawan Kalyan last movie ) కుదురాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆ సినిమాను చూసి ఆనందంతో పొంగిపోయారు. అంతేకాకుండా చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ జోష్ గా డాన్సులు, పాటలు పాడిన మంచి మంచి పాటలతో ఈ సినిమాలో కనిపించడంతో ఇంకా ఆనందంతో పొంగిపోయారు.
అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీరమల్లు , ఓజి మొదలగు సినిమాల్లో నటించబోతున్నారని సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో రెండిట్లోని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కువగా రాజకీయాల మీద శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక ( Pawan Kalyan last movie ) ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఈ క్రమంలో షూటింగ్లో సినిమాలు అన్నిటిని కొంతవరకు పక్కన పెట్టి.. రాజకీయాల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇలా రాజకీయాల్లో టైం స్పెండ్ చేసే క్రమంలో ఆయన వారాహి యాత్ర అని రోడ్డు యాత్రని ప్రారంభించారని విషయం తెలిసిందే.
ఈ యాత్రలో వైజాగ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఇంక సినిమాలు చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తాడు అనగానే ఆయన అభిమానులు ( Pawan Kalyan last movie ) ఎంత దుఃఖిస్తారో.. అది నోటి మాటతో ఎవ్వరూ చెప్పలేరు. భాషకు అందని భావం. వాళ్ళ బాధని ఎవరు ఓదార్చలేరు. అంత బాధ కలుగుతది వాళ్ళకి. నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నటించకపోతే ఊరుకోమని రచ్చ చేసినా చేస్తారు. వాళ్ళ అభిమానం అంత పిక్ స్టేజ్ లో ఉంటది అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే వారాహి యాత్రలో వైజాగ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ జగదాంబ సెంటర్ దగ్గర మాట్లాడుతూ.. ఇదే జగదాంబ సెంటర్ దగ్గర నేను సుస్వాగతం సినిమాకి ఇలాగే బస్సు మీద నిలబడి డాన్స్ చేశాను. అప్పుడే నాకు అంత మందిలో డాన్స్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే మా వదినకి ఫోన్ చేసి నన్నెందుకు సినిమాల్లో పంపించావు.. ఇలా పబ్లిక్ లో డాన్స్ చేయాల్సి వస్తుంది అని అన్నాను. అప్పుడే నేను అదే నా ఆఖరి సినిమా అని.. ఇంక నేను సినిమాలు చేయబోవునని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. దీంతో అభిమానులు అందరూ హమ్మయ్య ఇది అప్పటి నిర్ణయామా ఇప్పుడు తీసుకున్నాడు ఏమో అని టెన్షన్ పడ్డాం అని అనుకుంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.