పొద్దుతిరుగుడు గింజలతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!
మనం ఆరోగ్యవంతంగా గా ఉంటే ప్రతి రోజు ఆరోగ్యమైన ఆహారం తినాలి. మన ఆరోగ్యానికి, జుట్టుకు మరియు చర్మానికి కూడా పొద్దు తిరుగుడు విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు బూడిద గింజ రంగులు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ విత్తనాలను పొద్దుతిరుగుడు పువ్వు మధ్య భాగంలో నుంచి సేకరిస్తారు. ఇందులో ముఖ్యంగా ఉండే విటమిన్స్, యాసిడ్స్ మరియు మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతాయి.
పొద్దు తిరుగుడు పువ్వు యొక్క గింజల గురించి కలిగే లాభాలు తెలుసుకుందాం.
ఇందులో విటమిన్ ఈ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనం రోజు ఓ పావు కప్పు గింజలు తినడం వల్ల దాదాపు 90% మన శరీరానికి విటమిన్ E అందుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉండడం వలన మన గుండెకు చాలా సహాయపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా ముఖ్యంగా ధమనులలో కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది. వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేర్కొన్న ఇది పనిచేస్తుంది.
దీనిలో గల డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మన జీర్ణ శక్తిని బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది, మన శరీరంలో ఏర్పడే రకరకాల క్యాన్సర్లు దరిచేరకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే విటమిన్ E, సెలేనియం, కాపర్ కు శరీరంలో ఏర్పడే వ్యర్ధపదార్దాలను అడ్డుకునే శక్తి ఉంది, శరీరంలో ఉన్న కణాలను దెబ్బతినకుండా అడ్డుకుంటాయి.
ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ గింజల్లో ఉన్న కాపర్ వల్ల ఎముకల జాయింట్లలో గుజ్జు చేరి జాయింట్లు బాగా పనిచేస్థాయి. ఇందులో నా మెగ్నీషియం వల్ల నరాలకు చాలా మేలు జరుగుతుంది నరాలు చాలా రిలాక్స్ అవుతాయి. ఏ విత్తనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి మనలోని మెంటల్ టెన్షన్ ను తగ్గించే మన మూడ్ ని పాజిటివ్ సైడ్ తీసుకువస్తాయి. శరీరంలో ఏర్పడే మంటలు లేదా వాపు లాంటివి ఈ విత్తనాల్లో ఉన్న విటమిన్ E కారణం చేత తగ్గుతాయి.
ముఖ్యంగా డయాబెటిస్ రాకుండా అడ్డుుంటుంది. శరీరంలో విష వ్యర్థాలు రాకుండా విటమిన్ E అడ్డుకుంటుంది. ఈ విత్తనాలు మంచి రుచిని కలిగి ఉండడం వల్ల పాస్తా,శాండ్విచ్ లలో వాడడానికి ఉపయోగపడుతాయి. అలాగే ఈ విత్తనాలు తినడం వల్ల హై బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దానికి కారణం కూడా విటమిన్ E. శ్వాస తీసుకునే సమయంలో మనకు ఎదురయ్యే సమస్యలను నయం చేయడానికి ఎక్కువ సన్ఫ్లవర్ గింజలను ఉపయోగిస్తుంటారు ఆయుర్వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది.