Home Health చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి.! పగలకుండా పరిష్కారం ఏమిటి.?

చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి.! పగలకుండా పరిష్కారం ఏమిటి.?

చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి.! పగలకుండా పరిష్కారం ఏమిటి.?

మనకు తెలిసిందే చలికాలం వచ్చిందంటే పిల్లలకు పెద్దలకు అందరికీ పెదవులు పగులుతనే ఉంటాయి.పెదాలతో పాటు చర్మం కూడా పగులుతూనే ఉంటుంది. చలికాలంలో పెదవులకు ముఖానికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలా ప్రభావం చూపించడం వల్ల పెదవులు చర్మం పగిలి, నొప్పిగా ముఖం ఉండిపోతుంది.

పెదవులు పగలడం వల్ల మొఖం అందవిహీనంగా ఉంటుంది. పెదవుల, ముఖం చుట్టూ అంతా చర్మం పగిలిపోతుంది. అలా జరగకుండా మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెదవులను మృదువుగా, అందంగా ముఖాన్ని కూడా ఎలా అందంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

See also  Fatty Liver: వారానికి ఇదొక్కటి రెండున్నర గంటలు చేస్తే చాలు లివర్ ఫ్యాట్ ఇట్టే మాయం...

చలికాలంలో సూర్యరష్మికి ఎక్కువ గురవడం వలన, ముఖ్యంగా శరీరంలో తేమ ఎక్కువ లేకపోవడం, కొందరైతే పెదవులకు రసాయనాలు వాడడం వలన, కూల్ వాటర్ తాగడం, చలికాలం కదా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కూడా చర్మం పొడిబారుతుంది.

చలికాలంలో మాటిమాటికి సబ్బును ముఖానికి రుద్దడం వల్ల కూడా చర్మం పొడిబారుతూ ఉంటుంది. సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా, మాటిమాటికి నాలుకను పెదవులతో తడపడం వలన కూడా పెదవులు పగులుతాయి.

ఏదైనా కొత్తగా శరీరానికి ఉపయోగించే పౌడర్ వల్ల అయినా కూడా చర్మం పగులుతుంది. శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గినా కూడా చర్మం పొడిబారుతుంది పెదవులు కూడా పొడిపారుతాయి. ఇలా చాలా కారణాల వల్ల పెదవులు,చర్మం పగులుతూ ఉంటుంది.

See also  Rice Cooker: ఎలక్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుకుని తింటే..?? ఈ ప్రమాదంలో పడ్డట్టే.!!!

ఇలా జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

విటమిన్ B ఆహార పదార్థాలు తింటే పెదవులు పగలకుండా జాగ్రత్తగా ఉంటాము. వెన్నను పెదవులకు రాస్తే కూడా జాగ్రత్తగా ఫలితాలు కూడా ఉంటాయి.

కొబ్బరి నూనె తేనా కలిపి తరచుకు పెదవులకు రాసుకుంటే అందంగా మృదువుగా ఉంటాయి. కొద్దిగా నిమ్మరసం చెక్కరను కలిపి పెదవులకు మసాజ్ చేసుకుంటే పెదవులు పగలకుండా ఉంటాయి.

రెండు మూడు గులాబీ రెక్కలు తీసుకొని పాలల్లో కొద్దిసేపు ఉంచి నానిన తర్వాత ఆ రెక్కలను పెదవులకు చక్కగా మసాజ్ చేసుకుంటే పెదవులు మృదువుగా ఉంటాయి.

See also  Foods For Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తినవలసిన ఆహార పదార్థాలు

రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేసుకుంటే మంచిది. కీరా ముక్కలు కూడా పెదవుల మీద స్మూత్ గా రాయండి అలా చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వాటర్ తో కడిగేయండి ఇలా రెండు మూడు సార్లు చేయండి.

అలోవెరా జెల్ ని రాత్రిపూట పడుకునే ముందు రోజు పెదవులకు రాయండి మంచి ఫలితం ఉంటుంది.

పడుకునే ముందు పెదవులకు పెరుగు రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి అలాగే బాదం ఆయిల్ రాయండి ఇది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మృదువుగా ఎర్రగా పెదవులు ఉంటాయి.