Hanuman Jayanthi 2023: జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ ఈరోజు భక్తులు చేసే పూజలు చూసినా, విన్నా కూడా మనసుకు ఎంతో ఆనందంగా ధైర్యంగా ఉంటాది. హనుమంతుడు ధైర్యాన్ని కలిగించే దేవుడు అని మనందరికీ తెలుసు. చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ళు వరకు ఎవ్వరికైనా ఎలాంటి గాలి, ధూళి, చెడు దరి చేరకుండా ఉండేందుకు హనుమంతుడి చిత్రాన్ని దగ్గరలో పెట్టుకుంటారు. చిన్న పిల్లలకు అయితే ఖచ్చితంగా మేడలో ఆంజనేయుడి ( What should we do on Hanuman Jayanti on 6 April 2023 ) లాకెట్ కడతారు. అంటే హనుమంతుడు వాళ్ళ దరికి ఎలాంటి చెడు రాకుండా కాపాడుతాడన్నమాట.
ప్రతీ మంగళవారం హనుమంతుడిని పూజించడం ఎవ్వరికైనా చాలామంచిది. హనుమంతుడి కృప ఉంటె.. కష్టాలను దగ్గరకి రానివ్వడు, మన పాప ఖర్మ కొద్దీ వచ్చినా కూడా.. వాటిని ఎదుర్కునే ధైర్యాన్ని ఇచ్చి, కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. కొన్ని రాశులపై హనుమంతుడి కృప ఎక్కువగానే ఉంటాదని అంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. కుంభరాశి.. ఈ రాశివారిపై హనుమంతుడి కృప ఎక్కువగానే ఉంటాది. వీరికి ఎలాంటి కష్టాలు రాకుండా.. ఒకవేళ ఎంతటి కష్టము వచ్చినా వాటిని అంతకంటే గట్టిగా ఎదుర్కునే ధైర్యం ఇస్తాడు. వీరి నుంచి కష్టం భయపడి పారిపోవాలి తప్ప వీళ్ళు భయపడరు.
వృశ్చికరాశి.. ఈ రాశివారికి హనుమంతుడి దయ ఎక్కువగానే ఉంటది. వీరు ప్రతీ మంగళవారం ఖచ్చితంగా హనుమంతుడిని పూజించడం వలన, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సింహ రాశి.. ఈ రాశి అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రాశి అని అంటారు. వీరికి అన్నిటిలో విజయాన్ని కలిగించి, సంపద కురిపిస్తాడట. చైత్ర శుద్ధ పౌర్ణమినాడు హనుమాన్ జయంతి ( What should we do on Hanuman Jayanti on 6 April 2023 ) జరుపుకుంటాము. ఈరోజు రామాయణం, హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్తోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు ఖచ్చితంగా శ్రీరామచంద్రుడిని స్మరించాలి.
కనీసం రామ రామ శ్రీరామ అని అనుకుంటూ ఉన్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే హనుమంతుడు రామ దాసుడని మనందరికీ తెలిసినదే. హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి, హనుమ, వాయుపుత్రుడు, అంజనీసుతుడు, బజరంగీ, కేసరీనందన, పవన తనయ వంటి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో ఆయన్ని తలచినా కనికరిస్తాడు. లేదా ఆ శ్రీ రామచంద్రుడిని తలచినా.. ఆంజనేయుడు వెంటనే దరికి చేరి, అన్ని కష్టలను తొలగిస్తాడు. మీరు ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎంత బిజీగా ఉన్నా.. ఈరోజు మాత్రం ఒక్కసారి ఆ హనుమంతుడిని,శ్రీరామ చంద్రుడిని స్మరించండి.
అలాగే మీ పిల్లలకి ఈరోజు విశిష్టత గురించి చెప్పండి. వాళ్ళ నోటితో ఆ హనుమంతుడిని స్మరించేలా చేయండి. పిల్లలు హనుమంతుడిని ప్రార్ధించడం వలన మంచి బుద్ది, తెలివి, ధైర్యం కలుగుతాయి. రామాయణం చదవటానికి టైం లేకపోతే కనీసం పిల్లలు ఆడుకుంటూ ఉండగా, రామాయణం, హనుమాన్ చాలీసా , హనుమాన్ పాటలు ఆడియో పెట్టి వదిలేయండి. అలా అయినా వాళ్ళ చెవిలోకి, బ్రెయిన్ కి వెళ్లి భక్తి కలుగుతుంది. ఈరోజు ఆ హనుమంతుడిని స్మరించడం వలన అన్ని రాసులవారికి శుభము, ధైర్యం కలుగుతుంది. ఈరోజు అందరు హనుమాన్ జయంతిని ఆనందంగా చేసుకుని సుఖ సంతోషాలను పొందాలని మా తెలుగుట్రుత్ ( https://telugutruth.com/ ) మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
What should we do on Hanuman Jayanti on 6 April 2023