Mahesh Babu : ప్రతి మనిషిలోనూ ఏదో రకమైన హాబిట్ అనేది ఉంటుంది. వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, వాళ్లకు ఉన్న అవకాశాలను బట్టి, వాళ్ళ అలవాట్లు ఏర్పడతాయి. ఒక హాబిట్ మంచిదైనా అవుతుంది, చెడ్డదైనా ( Mahesh Babu habit ) అవుతుంది. లేదా రెండు కాకుండా ఏదో అలా అవేరేజ్ గా అయినా ఉంటుంది. అలాగే స్టార్స్ జీవితాల్లో కూడా వాళ్ళకంటూ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. అయితే ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరి హ్యాబిట్స్ ఒక్కోలా మారుతూ ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక హ్యాబిట్ మాత్రం మారలేదంట.
మహేష్ బాబు చిన్నప్పుడు డాక్టర్ చదవాలని అనుకున్నాను అని చాలా సార్లు చెప్పారు. అయినా కూడా వాళ్ళ ఫాదర్ దివంగత కృష్ణ గారు.. సినిమాల్లో నటించేందుకు చిన్నప్పటి నుంచి పంపేవారు. సెలవుల్లో సినిమాల్లో నటించి అలా సినిమాల ( Mahesh Babu habit ) వైపు టర్న్ అయిపోయానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆ వృత్తిపై ఇష్టం, రోగులకు ట్రీట్మెంట్ చేయించడం వలన ఆయనకు చాలా సంతృప్తి వస్తుందని చెప్పారు. అందుకే మహేష్ బాబు తన ఆదాయంలో కొంత భాగానికి పిల్లలకి ఎంతోమందికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇది ఎలా ఉంటే మహేష్ బాబుకు ఇది యాంబిషన్ అయితే ఆయనకు వదులుకోలేని ఒక హ్యాబిట్ ఉందంట.
మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అంట. అది ఎవరికైనా చిన్నప్పటినుంచి అలవాటు ఉంటుంది కానీ.. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత ఆ అలవాటు మార్చుకొని.. ఇంకేమైనా అలవాటు వైపు తిరుగుతారు. కానీ మహేష్ బాబు ఇప్పటికీ వీడియో గేమ్స్ నుంచి మాత్రం ( Mahesh Babu habit ) పక్కకు వెళ్లడంట. చిన్నప్పుడు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటే కృష్ణ గారు ఆ హ్యాబిట్ నుంచి బయటికి తీసుకురావాలని, ఎలాగైన మాన్పించాలని చాలా ట్రై చేసారంట. కానీ మహేష్ బాబు వినలేదంట. అలాగే నమ్రతతో కూడా పెళ్లయిన తర్వాత చాలా ట్రై చేసిందంట. అయినా కూడా మహేష్ బాబు మాత్రం వీడియో గేమ్స్ ని వదల లేదంట.
మహేష్ బాబు.. సూపర్ స్టార్ అయిపోయినప్పటికీ కూడా, ఆయన షూటింగ్లో కూడా ఎక్కడైనా టైం దొరికితే.. ఒక పది నిమిషాలు వీడియో గేమ్ ఆడేసుకుంటారు అంట ఫోన్లో. అలాగే తన పిల్లలతో కూడా ఎంజాయ్ చేసేటప్పుడు గేమ్స్ తోనే ఎక్కువగా ఎంజాయ్ ( Mahesh Babu habit ) చేస్తాడంట. అయితే నమ్రత చివరికి తన భర్త అన్నిటిని సమర్థవంతంగా చేసుకుంటూ కూడా.. తన ఇష్టమైన హ్యాబిట్ ని టైం దొరికినప్పుడు ఎంజాయ్ చేస్తుంటే.. ఇక కాదనలేక మహేష్ బాబు హ్యాబిట్ ని తను కూడా గౌరవించి చిరునవ్వుతో నవ్వుకుంటూ వదిలేస్తుందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఆ సినిమా తరవాత మహేష్ బాబు దర్శధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.