Vitamin B: విటమిన్ బి శరీరానికి అందకపోతే ఏమవుతుంది.
Vitamin B: మన శరీరానికి శక్తి కావాలంటే ఎన్నో రకాల వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెరగాలంటే రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు చాలా అవసరం.
శరీరానికి విటమిన్లు చాలా అవసరం వాటిలో బి విటమిన్ కూడా ముఖ్యమైనది.
విటమిన్ లలో రకరకాలు ఉంటాయి అలాగే విటమిన్ బి లో ఎనిమిది రకాలు ఉంటాయి అవి B1,B2,B3,B5,B7,B9,B12, వీటన్నిటిలో ముఖ్యమైనవి మాత్రం B12, B6, B9 మొదలగునవి.
B12: విటమిన్ బి12 లోపిస్తే అనీమియా, డేమింటియా, డిప్రెషన్, వికారం, గందరగోళం, నరాల బలహీనత, నోటిలో పుండ్లు, నిస్సత్తువ ఏర్పడతాయి.
బి12 విటమిన్ వలన డిఎన్ఏ ఉత్పత్తి, ఎర్ర రక్తకణాల ఏర్పడటంలో, కండరాలు సక్రమంగా పనిచేయడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడతాయి.
మాంసం, చేపలు, పాలు, చీజ్, గుడ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. శాఖాహారుల్లో ముఖ్యంగా ఈ లోకం ఎక్కువగా కనిపిస్తుంది.
B6: విటమిన్ బి6 లోపం వలన రక్త కణాలు తగ్గిపోతాయి గందరగోళానికి గురవుతారు.
బి6 విటమిన్ వలన మెదడు వృద్ధి చెందడానికి, రోగ నిరోధక శక్తి, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తుంది.
పౌల్ట్రీ, ఫిష్, ఆలుగడ్డ, అరటిపండ్లలో బీ6 విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
B9: విటమిన్ బి9 లో ఫోలిక్ఆసిడ్ ఉంటుంది గర్భిణీలకు ఇది ఎంతో ముఖ్యం.
పుట్టుకతో వచ్చే లోపాలను విటమిన్ బి9 నివారిస్తుంది గర్భం దాల్చే స్త్రీ కచ్చితంగా ఫోలేట్ కలిగి ఉండాలి ఈ బి9 విటమిన్ అధికంగా ఉంటే పుట్టబోయే బిడ్డ మరింత ఆరోగ్యంగా పుడతాడు కచ్చితంగా గర్భవతులు బి9 ఉన్న ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి.