
Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించిన గీత గోవిందం సినిమా అంటే ఇప్పటికీ అందరికీ ఎంతో ఇష్టం. ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎక్కడకో వెళ్లిపోయారు. వీళ్లిద్దరు కలిసి ఏ సినిమా నటించినా అభిమానులకు చాలా ఇష్టం. ఈ జంట అంటేనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన జంటలా కనిపిస్తారు. అయితే ( Vijay Devarakonda comments Rashmika ) అందరిలోనూ ఎప్పుడూ ఒకటే అనుమానం.. కచ్చితంగా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమించుకుంటున్నారని. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు అలాంటి మాటనే చెప్పలేదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు.
అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా మంచి రిజల్ట్ ఇచ్చింది. దీనితో విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే రష్మిక, రన్బీర్ కపూర్ కి హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటిస్తున్న అనిమల్ సినిమా నిన్న టీజర్ రిలీజ్ అయింది. అందరినీ చాలా ( Vijay Devarakonda comments Rashmika ) ఆకట్టుకుంది. ఈ సినిమా హీరో రణ్బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో రష్మిక తెల్లటి చీరతో ఎర్రటి బోర్డర్ ఉన్నది కట్టుకొని.. రన్బీర్ కపూర్ తో కలిసి అలా నడుస్తూ మాట్లాడుతుంది. ఈ టీజర్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో కూడిన సినిమాల కనిపిస్తుంది.
చూసిన వాళ్ళందరూ సినిమా బాగుండేలా ఉంది అని అనుకుంటున్నారు. అయితే ఇ టీజర్ కి ఈ సినిమాకి ఇంకా హైప్ క్రియేట్ చేసే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ ఒక మెసేజ్ పెట్టాడు. మై డియర్.. డార్లింగ్ రష్మిక మందన.. సందీప్ రెడ్డి వంగ అంటూ ట్యాగ్ చేస్తూ బాగా పొగిడాడు. అంతేకాకుండా రన్బీర్ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ( Vijay Devarakonda comments Rashmika ) తెలిపారు. ఈ సినిమాకు నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నానంటూ విషెస్ కూడా చెప్పాడు. ఇక విజయ్ దేవరకొండ చేసిన ఈ మెసేజ్ కి వెంటనే రష్మిక రియాక్ట్ అయింది. యు ఆర్ ద బెస్టెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు ట్యాగ్ చేసుకుని చేసిన మెసేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజనులందరూ విజయ్ దేవరకొండ రష్మిక గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
విజయ్ దేవరకొండ కి రష్మిక అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా టీజర్ వచ్చిందో లేదో అలా వెంటనే రష్మిక నటించిన ఆ సినిమా హిట్ అవ్వాలని తెగ ఆరాట పడిపోతున్నాడు అని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు మై డియర్ డార్లింగ్ అనే అందరిలో ఒప్పుకున్నాడు తనకి రష్మిక డార్లింగ్ అని.. పైగా తాను చేసిన కామెంట్ కి పొంగిపొతూ రష్మిక.. యు ఆర్ ది బెస్టెస్ట్ అని.. నువ్వు అందరికంటే బెస్ట్ అని అందుకే నువ్వు నాకు ఇష్టం అన్నట్టుగా ఆమె చేసిన మెసేజ్ ని అందరూ అనువదించుకుంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మిక ల మధ్య ఏముందో బయటపడింది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందో.. మంచి స్నేహం ఉందో తెలియదు గానీ ఈ జంట అంటే మాత్రం అందరికీ చాలా ఇష్టం. కాబట్టి ఎప్పటికైనా మరి వీళ్ళిద్దరూ ఒకటవతారేమో చూడాలి..