Home Cinema Varun Lavanya Reception : వెంకటేష్ అన్న ఆ మాటకు హర్ట్ అయిన లావణ్యతో వరుణ్...

Varun Lavanya Reception : వెంకటేష్ అన్న ఆ మాటకు హర్ట్ అయిన లావణ్యతో వరుణ్ ఏమన్నాడంటే..

victory-venkatesh-comments-at-varun-tej-and-lavanya-reception

Varun Lavanya Reception : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.వరుణ్ తేజ్ , లావణ్య పెళ్లి ఇటలీలో జరుగుతుందని తెలిసిన దగ్గరనుంచి.. ఇక్కడి నుంచి సెలబ్రిటీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు బయలుదేరుతున్న అప్పటినుంచి అభిమానులంతా ( Varun Lavanya Reception ) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్ళు పెడుతున్న పోస్టులను ఫాలో అవుతూనే ఉన్నారు. చూడ చక్కగా ఉండే ఈ జంట ఒక్కటైన వేల మెగా అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. అయితే మూడు రోజులపాటు ఇటలీలో పెళ్లి చేసుకున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చేసారు.

varun-tej-lavanya-tripathi-venkatesh

హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఆదివారం నాడు ఎంతో ఘనంగా రిసెప్షన్ చేసుకున్నారు. ఈ రిసెప్షన్ కి పెద్ద వాళ్ళందరూ సినిమా వాళ్లు,పొలిటిషియన్స్, టీవీ వాళ్ళు కూడా ఎందరో ఈ వేడుకకి హాజరయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుకల వాళ్ళ జంటను చూసి అందరూ చాలా ఆనందించారు. వరుణ్, లావణ్య జంట ( Varun Lavanya Reception ) చాలా బాగుందని అందరూ కొనియాడారు. ఈ వేడుక నిమిత్తం వచ్చిన వాళ్ళ వీడియోలు యూట్యూబ్ లో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకకి వెంకటేష్ కూడా రావడం జరిగింది.

See also  Agent: "ఏజెంట్" చిత్రం భారీ డిజాస్టర్‌.. 37 కోట్లకు వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

varun-tej-lavanya-tripathi-receprion-photos

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఒక సినిమా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎఫ్3 సినిమా వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాలో విపరీతమైన కామెడీ ఉంటుంది.ముఖ్యంగా భార్యల్ని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎలా ( Varun Lavanya Reception ) భరించాలి అనే దానిమీద ఈ సినిమా మొత్తం నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నాకు బాగా తెలుసు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత పెళ్ళాంతో సినిమాలో వరుణ్ తేజ్ నానా పాట్లు పడతాడు. అది చూసి వెంకటేష్ కామెడీ చాలా బాగుంటుంది.

See also  Varun Tej - Cocktail Party: వరుణ్ కాక్‌ టెయిల్‌ పార్టీలో ఈ మెగా జంటలు వాళ్ళని ఎం చేసారో చూడండి..

varun-tej-lavanya-receprion

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా రిసెప్షన్ కి వెళ్ళిన వెంకటేష్ అక్కడే స్టేజ్ మీద వరుణ్ తేజ్ కి ఆ డైలాగ్ గుర్తు చేసాడంట. పెళ్ళాంతో ఉండే కష్టాలు గురించి, పెళ్ళాం మెంటాలిటీ గురించి చెప్పుకొని నవ్వాడంట. అది వినగానే లావణ్య త్రిపాఠి అలిగిందంట. వరుణ్ తేజ్ బుజ్జగిస్తున్నట్టు ఏదో చక్కగా చెప్పి ఆమెని కూల్ చేశాడంట. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ ఎంత వయసు వచ్చినా.. ఎంత అల్లరి మనిషో దీనిని బట్టి అర్థమవుతుంది. వరుణ్ తేజ్ ని పాపం.. అక్కడికి అక్కడే లావణ్య దగ్గర బాగా బుక్ చేసేసాడు అని అభిమానులు చెప్పి నవ్వుకుంటున్నారు.