Home Cinema Vaishnavi : సినిమా ఒప్పుకునే ముందు ఆ పని చేస్తేనే డైరెక్టర్ కి ఎస్ చెపుతున్న...

Vaishnavi : సినిమా ఒప్పుకునే ముందు ఆ పని చేస్తేనే డైరెక్టర్ కి ఎస్ చెపుతున్న బేబీ హీరోయిన్ వైష్ణవి..

Vaishnavi : ఈమధ్య కాలం లో హీరోయిన్స్ కేవలం ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ ని సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడానికి కనీసం రెండు మూడేళ్లు అయినా పట్టేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులువుగా స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటున్నారు. అలా రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ చిత్రం తో తిరుగులేని ఫేమ్ ని దక్కించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Condition). ఇండస్ట్రీ లోకి రాకముందు ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది అని సోషల్ మీడియా వాడే ప్రతీ ఒక్కరికి తెలుసు. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

Vaishnavi-conditions

అలా వైకుంఠపురం లో, టక్ జగదీశ్ మరియు వలిమై వంటి సినిమాల్లో హీరోలకు చెల్లి పాత్రలు పోషించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమెకి ‘బేబీ’ చిత్రం లో ఆనంద్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమా విడుదలకు ముందే పాటలు, టీజర్ మరియు ట్రైలర్ తో మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈ సినిమా , విడుదల తర్వాత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లో హీరోలు గా నటించిన ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ కంటే కూడా వంద రెట్లు క్రేజ్ ని సంపాదించుకుంది.

See also  Rashmika: ఆ రెండు సీక్రెట్ టాటోల అర్ధాలు తెలిపిన రష్మిక.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా.?

vaishnavi-chaitanya

అమ్మాయి చూసేందుకు చాలా చక్కగా ఉంది, యాక్టింగ్ కూడా అదరగొడుతుంది అని పసిగట్టిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈమెతో సినిమాలు చేసేందుకు క్యూలు కట్టేస్తున్నారు. అయితే వచ్చిన ప్రతీ ఛాన్స్ ని వాడుకోకుండా, కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషించేందుకు మొగ్గు చూపిస్తుంది ఈమె. కానీ సినిమాకి సంతకం చేసే ముందే ఈమెకి కమిట్ అయినా డబ్బులు అడ్వాన్స్ గా పే చేయాలట(Vaishnavi Condition). అప్పుడే ఈమె ఒక సినిమాకి సంతకం చేసేందుకు ఒప్పుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. ఒక్కో సినిమాకు ఈమె రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుందట. ఇంకో హిట్ పడితే కచ్చితంగా ఈమె నేటి తరం స్టార్ హీరోయిన్స్ కి సరిసమానంగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

See also  Varun Tej : బిగ్ సీక్రెట్.. వరుణ్ ఫస్ట్ లవ్ గురించి తెలిసి లావణ్య ఎం చేసిందంటే..

actress-vaishnavi

ఒకపుడు షన్ను తో కలిసి వెబ్ సిరీస్ లు యూట్యూబ్ వీడియోలు చేసుకునే వైష్ణవి ఇంత ఎత్తుకు ఎదిగింది అంటే చాల గ్రేట్, కష్ట పడితే ఫలితం ఉంటుంది, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు అనటానికి వైష్ణవి చైతన్యనే నిదర్శనం. బేబీ సినిమా హిట్టు తరువాత ఈ అమ్ముడు ఇప్పటికే 4 సినిమాలు సైన్ చేసింది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫాన్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఒక వేళా వైష్ణవి తరువాత నటించే సినిమా కూడా హిట్ అయింది అంటే ఇంకా వైష్ణవిని ఎవ్వరు ఆపలేరు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎక్కేస్తుంది.