Arundhathi Movie: ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అరుంధతి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయి చిత్రమిది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందించుకున్న చిత్రానికి దర్శకత్వం వహించిన వారు కోడి రామకృష్ణ. ఈ సినిమాలో సోను సూద్, షాయాజీ షిండే, కైకాల సత్యనారాయణ, అర్జన్ బజ్వా మొదలగువారు కీలక పాత్ర పోషించారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కోటి గారు సంగీతం అందించారు.
జనవరి 16 2009న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఏ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కూడా డౌన్ ఫామ్ లో ఉన్నారు. అలాంటి పరిస్థితిల్లో పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా అరుంధతి చిత్రం ప్రారంభించే భారీ విజువల్ వండర్ స్వీకారానికి దాహోదం అయ్యింది. చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలను తిరగరాసి భారీ విజయం కైవసం చేసుకుంది. ఆ సినిమాతో అనుష్క జీవితం స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఇంత విజయం క్రైస్తవం చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు.
అప్పట్లోనే 35 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అప్పటివరకు గ్లామర్ రోజు చేసే అనుష్క అరుంధతి సినిమాతో తన విశ్వరూపాన్ని అందరికీ ప్రదర్శించింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ముద్ర పడింది. అయితే ఇది ఇలా ఉండగా మొదట అరుంధతి సినిమా అనుష్క అనుకోలేదంట, ఆ కథను మలయాల నటి (Arundhathi Movie) మమతా మోహన్ దాస్కు చెప్పారట ఆమె కూడా సరే అని సైన్ కూడా చేశారట.. ఇంతలోనే మమతా మోహన్ దాస్ మేనేజర్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదని చెప్పడంతో..
తెలుగు చిత్ర పరిశ్రమపై అంత పెద్దగా అవగాహన లేని మమత మోహన్ దాస్ మేనేజర్ మాటలు గుడ్డిగా నమ్మి అరుంధతి సినిమా చేయలేదు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి దాదాపు 3 నెలలు ఆమెను సినిమా చేయమని మమత ను అడిగాడంట. కానీ మమత కుదరదు అని చెప్పింది అంట. దాంతో చేసేది లేక గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్కను ఫైనల్ చేశారంట, కట్ చేస్తే సినిమా బంపర్ హిట్టు. ఆ సినిమా విజయం తర్వాత మమత అరుంధతి మిస్ చేసుకున్న అని చాలా బాధ పడిందంట కానీ ఏం లాభం..