Shruti Haasan: కమలహాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ అంటే అన్ని భాషల వారికి ఎంతో ఇష్టం. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టినప్పటికీ.. ఈరోజు శృతిహాసన్ తెచ్చుకున్న క్రేజ్ మాత్రం తన స్వయంకృషితోనే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. శృతిహాసన్ తనదైన శైలిలో నటించి తనకంటూ ( Shruti Haasan comments about marriage ) ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నార్త్ మరియు సౌత్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం శృతిహాసన్ పాన్ ఇండియా సినిమా అయిన సలార్ సినిమాలో నటిస్తుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
శృతిహాసన్ ఈ ఏడాది పండుగలో రిలీజ్ అయిన సినిమాల్లో హీరోయిన్ గా ఉండే అటు వల్తేరు వీరయ్య, ఇటు వీరసింహారెడ్డి సినిమాల్లో చిరంజీవి -బాలకృష్ణ లాంటి సీనియర్ నటుల సరసన నటించి ఆ సినిమా సక్సెస్ లని తన ఖాతాలో ( Shruti Haasan comments about marriage ) వేసుకుంది. శృతిహాసన్ కెరీర్ పరంగా మంచి సక్సెస్ ని చూసిందని చెప్పుకోవచ్చు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె ఎందరో హీరోలతోని, క్రికెటర్లతోని ప్రేమలో పడిందని అనేక వార్తలు చాలా సార్లు వచ్చాయి. కానీ ఎవరితో కూడా ఆమె ప్రేమ ఎంతో కాలం నిలబడలేదు. ప్రస్తుతం ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
శాంతాను హజారికాతో శృతిహాసన్ ఏకంగా సహజీవనం సాగిస్తుంది. అయితే శృతిహాసన్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆమె అభిమానులు, సాధారణ సినీ అభిమానులు కూడా ఎప్పటినుంచో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక మీడియా వాళ్ళైతే ఆమె ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకున్నా కూడా.. ఆమె పెళ్లి గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే.. ఆ సబ్జెక్టు ( Shruti Haasan comments about marriage ) మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండటం వలన.. దాని రిలేటెడ్ సంభాషణ ప్రచురించడం వల్ల ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారన్న విషయం మీడియా వాళ్లకి తెలుసు కాబట్టి. అయితే ఇటీవల శృతిహాసన్ పెళ్లి గురించి అడగ్గా ఆమె మాట్లాడిన మాటలు ఎప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
నా పెళ్లి గురించి అందరూ ఎందుకు ప్రశ్నిస్తారో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోపోతే ప్రపంచ ఆర్థికమాన్యమైన దెబ్బతింటుందా? నాకు 37 ఏళ్లు దాటితే మాత్రం ఇప్పుడు వచ్చిన నష్టమేముంది? 37 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? అసలు నా పెళ్లి గురించి మీకు ఎందుకు అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నాకు నచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇక శృతిహాసన్ మాట్లాడిన ఈ మాటలు చూస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న విషయం మాత్రం అందరికీ అర్థమవుతుంది. శృతిహాసన్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు అయితే ఉన్నాయి.