Home Cinema Dil Raju: దిల్ రాజును నిండా ముంచేసిన శాకుంతలం ఎన్ని కోట్ల నష్టమో తెలుసా...

Dil Raju: దిల్ రాజును నిండా ముంచేసిన శాకుంతలం ఎన్ని కోట్ల నష్టమో తెలుసా పాపం.?

Dil Raju: సినిమా విడుదల అయ్యాక అది హిట్ అవుతుంది లేక ప్లాట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా అవ్వాల్సిందే.. మంచి కంటెంట్ ఉండి జనాలకి నచ్చి మంచి డైరెక్షన్ లో తెరకెక్కితే అదే ఆటోమేటిగ్గా ఆ చిత్రమనేది మంచి స్పందన లభిస్తుంది. . ఇక ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో చాలా చిత్రాలు డిజాస్టర్ నిలిచినప్పటికీ ఎన్నో చిత్రాలు హిట్ గా కూడా నిలిచాయి. అలా ఈ సంవత్సరం విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న చిత్రం ఒకటి శాకుంతలం. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మలయాళ నటుడు దేవ్ మోహన్ కలిసి జంటగా నటించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

shaakuntalam-movie-dil-raju-faced-huge-loss-because-of-movie-failure

ఇక కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ దాదాపు మూడు సంవత్సరాల కాలం పాటు ఈ చిత్రాన్ని సాగదీసి రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రలలో మోహన్ బాబు, సచిన్ కేడేకర్, అనన్య నాగల, మధుబాల, ప్రకాష్ రాజ్, గౌతమి మొదలైన వారు పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ చిత్రం తో అడుగు పెట్టింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ.. ఇక ఈ చిత్రం ద్వారానే సినీ రంగా ప్రవేశం చేసింది. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగులో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలై మొదటి రోజే తొలి ఆట నుంచి డిజాస్టర్ పేరు దక్కించుకున్నది. సమంత అభిమానులు సైతం శాకుంతల చిత్రంపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి చేసేసాయి.

See also  Mrunal Thakur : అదేగాని జరక్కపోతే నా పేరు మార్చుకుంటానంటున్న మృణాల్ ఠాకూర్..

shaakuntalam-movie-dil-raju-faced-huge-loss-because-of-movie-failure

కొందరైతే సమంత నటనపై కూడా విమర్శిలు గుప్పించారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యి దారుణమైన వసూలను సొంతం చేసుకుంది. ఇటు చిత్రం కొన్న బయ్యర్లకు అటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. విడుదలైన కొన్ని రోజులకి ఇంటర్వ్యూలో దిల్ రాజు పాల్గొనగా ఈ చిత్రం గురించి దిల్ రాజు నిండా ముంచేసిందని అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన పాతికేళ్ల సినీ కెరియర్లో ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను ఎన్నో సినిమాలు నిర్మించాను అవన్నీ హిట్స్ అని చెప్పడం లేదు అందులో కొన్ని ప్లాప్స్ కూడా ఉంటాయి. కానీ శకుంతలం లాంటి ప్లాపు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పెట్టిన డబ్బులో కనీసం రెండు శాతం కూడా నాకు రాలేదంటే అర్థం చేసుకోండి..

See also  Samantha: నటి సమంతపై భారీ ట్రోలింగ్.. ఇదే కారణం..

shaakuntalam-movie-dil-raju-faced-huge-loss-because-of-movie-failure

అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీం వర్క్ బ్యానర్లపై దిల్ రాజు మరియు గుణశేఖర్ కలిసి దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ 30 కోట్లకు ప్రముఖ ప్లాట్ఫారం అమెజాన్ కు అమ్మేసినప్పటికీ డీల్ సెట్ కాకపోవడం వల్లనే సాటిలైట్ రైట్స్ కు అమ్ముడుపోలేదు. ఇక సినిమా డిజాస్టర్ అవ్వడం అని పేరు వచ్చిన తర్వాత సాటిలైట్ కంపెనీలు ఇప్పుడు మినిమం రేట్ కూడా ఇచ్చి తీసుకునేలా కనిపించడమే లేదు. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బిజినెస్ చూస్తే 19 కోట్లు జరగగా.. ఫుల్ రన్ లో కనీసం 8 కోట్లు కూడా కొల్లగొట్టలేకపోయింది. మొత్తానికి శాకుంతలం దెబ్బకు (Dil Raju) దిల్ రాజ్ దిమ్మ తిరిగిందనే చెప్పాలి. మొత్తం దిల్ రాజు మరియు గుణ శేకర్ 25 కోట్ల మొత్తం స్థాయిలో నష్టపోయారని మనకు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.