Samantha : గత కొంతకాలంగా సినిమాలో ఫెయిల్యూర్లతో బాధపడుతున్న సమంత.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సమంత జీవితంలో తీసుకున్న ఆమెకు ఒక్కొక్క మలుపు ( Samantha cannot forget Naga Chaitanya ) ఒక్కొక్క ఆనందాన్ని, ఒక బాధని, కొన్ని మలుపులు తనకి అనుభవాన్ని ఇస్తూ వచ్చాయి. సమంత సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తను మొదటి సినిమాతోనే అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే వీళ్ళ పెళ్లి జరిగినది తక్కువ కాలంలోనే ఇద్దరు కలిసి ఉండలేక విడిపోయారు. సమంత.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడింది. అనారోగ్య కారణంగా కొంతకాలం సినిమాలకి ( Samantha cannot forget Naga Chaitanya ) దూరంగా ఉండాల్సి వచ్చినా కూడా.. మళ్లీ తన ఆరోగ్యం తానే జాగ్రత్తగా లైన్ లో పెట్టుకొని.. తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసింది. అయితే సమంత సినిమాల్లో లాస్ట్ గా రిలీజ్ అయిన ఖుషి సినిమా కొంతవరకు పరవాలేదు అనిపించినా కూడా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అది కలెక్షన్స్ ని తీసుకుని రాలేదు. ఇలా సమంత కెరీర్ కూడా చాలా తటపటాయిస్తుంది.
మరోపక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటానని.. ఒక వన్ ఇయర్ పాటు తనని తాను మళ్ళీ యాక్టివ్ చేసుకుంటానని నిర్ధారించుకొని.. అనేక దేశాలు తిరుగుతూ తన ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇదిలా ( Samantha cannot forget Naga Chaitanya ) ఉంటే సమంత ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచైనా ఆనందంగా ఒక ఫోటోని పోస్ట్ చేస్తే.. ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే.. సమంత కచ్చితంగా ఎవరైనా ప్రేమిస్తుందని, అతి తొందరలోనే పెళ్లి చేసుకుంటుందని కొందరు కామెంట్ చేస్తే.. నాగచైతన్య మీద కోపంతోనే ఇలాంటివన్నీ చేస్తుందని మరికొందరు కామెంట్ చేస్తూ ఉంటారు.
అయితే సమంత ఇప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత సింగల్ లైఫ్ బ్రతుకుతుంది. అయితే ఆమెకు తల్లి కావాలని ఆశ కలుగుతుందంట. పిల్లలు అమ్మ అని పిలిచే పిలుపు కోసం ఎదురుచూస్తుందట. అందుకని సమంత ఇద్దరు పిల్లల్ని పెంచుకోవాలని డిసైడ్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదే నిజమైతే.. సమంత ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా? ఇంకా ఏజ్ చాలా ఉంది కదా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చు అని కొందరు అంటుంటే.. మరికొందరు నాగచైతన్యపై ఆమెకు ప్రేమ చావలేదని.. అందుకే చేసుకోలేదని అంటున్నారు. ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సమంతకు చైతు మీద ఇంకా ప్రేమ ఉందని మాత్రం అభిమానులు ఆశపడుతున్నారు