
Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత గత కొద్ది కాలంగా మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్న సమంత అటు వెకేషన్స్ కి వెళ్తూ తన లైఫ్ ని సరదా సరదాగా గడుతుంది. ఇదే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో సైతం చాలా చురుగ్గా ఉంటూ ఆమెకి సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. అందులో కొన్ని వైరల్ అవుతు నిత్యం వార్తల్లో సైతం నిలుస్తూ ఉంటాయి. ఇదే కాకుండా తన హాట్ హాట్ ఫొటోస్ సైతం షేర్ చేస్తూ
ఇటు తన అభిమానులకి, కుర్రాకారులను సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇక ఆమె అభిమానులు మాత్రం సమంత మళ్ళీ ఎప్పుడు రియంట్రిస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఇటీవల సమంత స్పందించినట్లు మనకు తెలిసిందే. ప్రస్తుతం తన ఆసక్తికరమైన (Samantha Surprise) ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. టెక్ 20 పాడ్ అనే క్యాస్ట్ ను స్టార్ట్ చేసి అందులో హెల్త్ గురించి చెబుతానని వెల్లడించింది. ఇందులో కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతుందట.. ఈ రెండేళ్లలో నేను అనుభవించిన బాధ మయోసైటీస్ నుంచి ఎలా కోలుకున్నాను
అనేది తెలుపుతుందట. ఇక ఎన్నో సంవత్సరాలుగా అనుభవజ్ఞులు రీసర్జ్ చేసిన విషయాలు ఇందులో చెప్పేవి, అందరికి అర్థమయ్యే విధంగా ఉంటాయి. అందరూ చేరండి అందరు నేర్చుకోవచ్చు, అందరికి తెలిసేలా చేయొచ్చు. మన జీవితాలను మరింత బెటర్ చేసుకోవచ్చు అంటూ సమంత చెప్పుకొస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియో ఫిబ్రవరి 19 తారీఖున రానున్నట్లు తెలిపింది. ఇక అది (Samantha Surprise) చూసిన ఆమె అభిమానులు ఆమెకు విషెస్ చెప్తున్నారు చాలామందికి ఉపయోగపడే పని చేస్తున్న అంటూ ఆమెను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram