Samantha Kushi: శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ లో రౌడీ బాయ్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు సంతరించుకున్న స్టార్ బ్యూటీ సమంత కలిసి జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు దాదాపు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేవి వై. రవిశంకర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్న వారు జయరాం, సచిన్ కేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కాగా.. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషా అబ్దుల్ వహాబ్ సాంగ్స్ అందించాడు.
కాశ్మీర్ లోని ఎత్తైన మంచు కొండల నడుము అందమైన ప్రేమ కథగా రూపొదిద్దుకుంటుంది ఈ చిత్రం. కాగా సెప్టెంబర్ ఒకటవ తారీఖున తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల అవ్వబోతోంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మేకర్ వరుస అప్డేట్లతో సినిమాపై మరింత ఆశను రేకెత్తిస్తున్నారు. అందులో భాగంగానే ఖుషి రెండవ పాటను విడుదల చేశారు.
ఇక ఈ పాట ఆరాధ్య అంటూ సాగే మెలోడీ అద్భుతంగా అందరినీ కట్టిపడేసింది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో విడుదలైన మొదటి పాట నా రోజా నువ్వే పాట యూట్యూబ్లో ఇప్పటికే షేక్ చేసి రికార్డులను తిరగ రాసింది. కాగా విడుదలైన రెండో పాట ఆరాధ్య కూడా మొదటి పాటకు గట్టి పోటీని ఇస్తుంది. చాలా రొమాంటిక్ గా సాగిన ఈ సాంగ్ యూట్యూబ్ లో భారీ వీక్షణలతో దూసుకెళ్తోంది.
ఇకపోతే ఈ సాంగ్ లో సమంత (Samantha Kushi) వేసుకున్న చెప్పుల ధర ఎంత అని ఆరా తీస్తుండగా ఆ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఆరాధ్య అనే పాటలో సమంత క్యాజువల్ లుక్ తో మిస్మరైస్ చేసింది. అయితే అక్కడ సమంత లుక్ తో పాటు ఆ వేసుకున్న చెప్పులు కూడా చాలామంది ఆడాళ్లకు ఎట్రాక్ట్ అయ్యాయట. మరి ఆమె ధరించిన ఆ చెప్పులు దాంతో అసలు ఈ చెప్పులు ఏంటని ప్రతి ఒక్కరు గూగుల్ సెట్ చేయడం మొదలు పెట్టారట. మరి ఆ చెప్పుల ధర ఏంటో మనం తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ చెప్పులు అక్షరాల 7399 రూపాయలు.. సమంత రేంజ్ కు ఆ చెప్పులు కాస్ట్ తక్కువే కావచ్చేమో.. కానీ మనలాంటి సామాన్యులకు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. దాంతో సమంతకి ఆ చెప్పులు వేసుకునే సరికి ఆమె చెప్పుల అందం మరింత పెరిగిందని పోరగాళ్లు ఫుల్ అవుతున్నారు.