Samantha Boyfriend: గత కొద్ది రోజులు గా సమంత గురించి సమంత చేసుకోబోయే రెండో పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు మనకు వినిపిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఇదే గాక ఆధ్యాత్మిక గురువు సద్గురు సైతం సమంత ను రెండో వివాహం చేసుకోవాలని సూచించినట్టు కూడా ఎన్నో రకాల వార్తలు మనకి వినిపించ సాగాయి. కానీ సమంత ఇప్పుడంతలో పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అది మనందరికీ తెలిసిన విషయమే.. కానీ సమంత అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా సరే మరో నాలుగు, ఐదేళ్లలో తప్పకుండా ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని గట్టి నమ్మకంతో ఆమె అభిమానులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకరికి ఒకరు ఎంతో ప్రేమించుకుని మరీఖ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నాగ చైతన్య తో విడాకులు అనంతరం కొద్ది రోజులు ప్రేమ పై మరియు రిలేషన్స్ పై కూడా పూర్తి నమ్మకం కోల్పోయిన అటువంటి సమంతకు తాజాగా కొద్ది రోజుల నుండి ఆమె చేస్తున్న పోస్ట్ లను బట్టి చూస్తుంటే సమంత కు మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత న్యూయార్క్ నగరం లో వెకేషన్ లను ఎంజాయ్ చేస్తుంది. ఇండిపెండెన్స్ డే కి న్యూయార్క్ లో జరిగే మన ఇండియన్స్ నిర్వహించిన పరేడ్ ర్యాలీ లో చాలా ఉత్సాహంగా తను పాల్గొన్నది.
తదనంతరం న్యూయార్క్ అందాలన్నిటినీ ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న ప్రదేశాలను చుట్టు ముడుతూ ఎప్పటికప్పుడు ఫొటోస్ లను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంటూ అందరితో పంచుకుంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది సమంత. ఇక సమంత ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టని ఒకే ఒక విషయం తన ఎక్ససైజ్ చేయడం అది మాత్రం అస్సలు వదిలి పెట్టదు. తను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లినా కూడా జిమ్ లో తెగ కష్ట పడుతూ తన ఫిజిక్ ను కాపాడుకునే ప్రయత్నాలు కచ్చితంగా చేస్తూనే ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలోని స్టేటస్ లో ఒక ఫోటోని షేర్ చేసింది సమంత.
అవును ఆమె షేర్ చేసిన ఫోటో స్టేటస్ లో మేము కూడా చూశాం అందులో ఏముందని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే సమంత తో పాటు తన జిమ్ లో పక్కనే మరొక వ్యక్తి కూడా దర్శనం ఇచ్చాడు. పైగా అతడు పూర్తిగా అటు వైపు తిరిగి తన ముఖాన్ని కనిపించకుండా మిస్టరీ వ్యక్తిగా ఉన్నాడు. దాంతో ఆ మిక్స్టరీ వ్యక్తి ఎవరనే ప్రశ్నలు ఇటు సమంత అభిమానులకి కాకుండా నెటిజన్లకు సైతం నెలకొల్పాయి. దాంతో చాలా మంది సమంత రెండో పెళ్లి చేసుకోనే వ్యక్తి (Samantha Boyfriend) అగో అతనే అంటూ రకరకాల కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. సమంత పక్కనే ఉన్న మిస్టరీ వ్యక్తి ఎవరు.? అసలు ఎవరో మనకు తెలియాలంటే ఈ విషయాన్ని స్వయంగా సమంతనే మనకు వెల్లడించాలి.