మళ్ళీ రంగంలోకి దిగిన సామ్ – జిమ్ లో అదరగొడుతుంది.
Samantha:
సమంత అంటే ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కానీ నేడు తన క్రేజ్ ఏంటో అందరికీ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో, పుష్పలోని ఐటమ్ సాంగ్ తో దేశమంతటా తెలిసిపోయింది. కేవలం తన అందం ఒక్కటే కాదు తన నటన, అభినయంతో అందరినీ ఇట్టే మంత్రముగ్దులను చేస్తుంది.
వ్యాయామం ఆమె దినచర్యలోని భాగం, ఇటీవలే వయోసైటిస్ తో భాద పడుతున్న తను ఇప్పుడిప్పుడే దాని నుండి కొలుకుంటుంది.
వ్యాధి భారిన పడినప్పటికీ శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న సామ్ డైరెక్టర్ గుణశేఖర్ అన్న మాటలకు భావోద్వేగానికి గురైనది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమంత, తాజాగా ఓ పోస్ట్ తన ఇస్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది అదిప్పుడు వైరల్ గా మారింది.
అందులో సామ్ జిమ్ లో కుస్తీలూ పడుతూ తన వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ లావుగా ఉన్న మహిళ ఇది చేసే వరకు ముగియదని స్పెషల్ నోట్ రాసింది.
ముందుగా @WhoisGravity స్పెషల్ థ్యాంక్స్, మీరు కఠినమైన రోజుల్లో నాకు స్పూర్తి నిస్తూ,
బలం అంటే మనం తినే ఆహరంలో ఉండదు, మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం అంటూ వీడియోకు క్యాప్షన్ రాసింది.
ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదలకాబోతుంది. ఆ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న చిత్రం ఖుషి.
వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది, విజయ్ దేవరకొండ సామ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఆ తర్వాత బాలివుడ్ లో హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సిటాడెల్ లో సామ్ పాల్గొననుంది.