Home Cinema Roja : చిరు రాంచరణ్ లకు విషెస్ చెబుతూ రెండు నిజాలు బయటపెట్టిన రోజా!

Roja : చిరు రాంచరణ్ లకు విషెస్ చెబుతూ రెండు నిజాలు బయటపెట్టిన రోజా!

roja-congrats-to-chiranjeevi-and-ramcharan-for-the-baby-born-in-the-mega-family

Roja : మెగా కుటుంబంలో మెగా ప్రిన్సెస్ రావడంతో టాలీవుడ్, బాలీవుడ్ సినిమా తారలందరూ కూడా మెగాస్టార్ చిరంజీవికి, రామ్ చరణ్ కి, ఉపాసనకి శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి ఒక సినిమా హాలు కంటే, ఒక స్టేడియం కంటే కూడా గొప్పగా అయిపోయింది. హాస్పిటల్ చుట్టూ ( Roja congrats to Chiranjeevi and Ramcharan ) జనాలు నినాదాలతో, ప్రెస్ మీట్ లు, అభిమానులు ఆనందభాష్పాలతో నిండిపోయింది. అయితే మెగా ప్రిన్సెస్ కి వెల్కమ్ చెప్తూ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక అభిమానుల అభిమానాన్ని చూసి చిరంజీవికి నిజంగా ఆనందం ఆగలేదు. మనవరాలు పుట్టిన ఆనందంతో పాటు వీళ్ళందరూ అభిమానం చూసి ఆయన ఎంతగానో పొంగిపోయారు.

See also  Niharika: నిహారిక మేడలో తాయత్తు వేసుకోవడానికి గల అసలు కారణం ఇదా.?

roja-congrats-to-chiranjeevi-and-ramcharan-for-the-baby-born-in-the-mega-family

అయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి రోజు.. చిరంజీవి కుటుంబానికి ఇష్టమైన దేవుడు రోజున ఒక దేవతలా మనవరాలు పుట్టిందని ఆనందంతో మెగా కుటుంబం పొంగిపోతుంది. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్గా, ఫైర్ బ్రాండ్ గా, ఇప్పుడు ( Roja congrats to Chiranjeevi and Ramcharan ) మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న రోజా అంటే అందరికీ ఎంత అభిమానం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. చిరంజీవికి మనవరాలు పుట్టిన సందర్భంగా రోజా విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఆమె ట్రీట్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చిరంజీవి ఇంట్లో ఆడపిల్ల పుట్టినందుకు.. ఇన్నాళ్లకు రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

See also  Pawan Kalyan: పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్.. ఈసారి చాల భారీగా స్కెచ్ వేశారు!

roja-congrats-to-chiranjeevi-and-ramcharan-for-the-baby-born-in-the-mega-family

ఇంకా ఆమె మెసేజ్ లో తాత అయిన చిరంజీవి గారికి నా ఆమె అభినందనలు అన్నారు. అలాగే ఎప్పుడు శక్తివంతంగా, యవ్వనంగా ఉండే కుటుంబానికి సర్వశక్తివంతమైన భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో వారికి ఆశీర్వాదాన్నే ఇచ్చారని ఆమె తెలిపారు. ఇంకా ఆమె రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రాంచరణ్ నీ చిన్నప్పుడు నిన్ను ( Roja congrats to Chiranjeevi and Ramcharan ) నా చేతులతో ఎత్తుకొని.. నా గుండెలకు హత్తుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు నీకు పాప పుట్టింది అన్న వార్త విని చాలా సంతోషిస్తున్నాను అంటూ రాంచరణ్ కి విషెస్ చెప్పింది. అలాగే రోజా చిరంజీవిని.. సార్ మీరు తాతయ్య అయినప్పటికీ కూడా.. మాకు మాత్రం ఎప్పటికీ రియల్ హీరోనే అని చెప్పుకొచ్చింది.

See also  Niharika: ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన నిహారిక..

roja-congrats-to-chiranjeevi-and-ramcharan-for-the-baby-born-in-the-mega-family

ఇక ఉపాసన గురించి రోజా మెసేజ్ చేస్తూ.. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఇదే నా శుభాకాంక్షలు అంటూ ట్విట్ చేసింది. ఇలా మంత్రి రోజా చేసిన ఈ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె పేరుపేరునా చిరంజీవికి, రామ్ చరణ్ కి, ఉపాసనకి మెసేజ్ చేయడం నిజంగా మెగా అభిమానులు ఆనంద పడుతున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఎంత తాత అయినప్పటికీ.. మాకు మాత్రం ఎప్పటికీ రియల్ హీరోనే అని చిరంజీవి గురించి చెప్పడం.. అలాగే రామ్ చరణ్ చిన్నప్పుడు రోజా ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది అన్న విషయాన్ని చెప్పడం మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.